Syed Raffi retweetledi
Syed Raffi
1.9K posts

Syed Raffi
@SyedSyedrafimrf
TDP - Spokesperson - Andhra Pradesh
Vijayawada, India Katılım Temmuz 2015
3.2K Takip Edilen1.4K Takipçiler

డి లిమిటేషన్ పై తెలంగాణ సీఎం @revanth_anumula ఫార్ములా బాగుంది.లోక్ సభ సీట్లు పెంచకుండా?అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల స్థానాలు పెంచటం వల్ల ప్రజాప్రతినిధ్యం పెరుగుతుందని చెప్పాడు. ఈ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని చెప్పాడు .జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు పెంచటం వల్ల ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని ఆది దేశ విభజన దారి తీస్తుందని భావించి ఆనాడు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ,అటల్ బిహారీ వాజపేయి లు వారి హయాంలో 25 ఏళ్ల వరుకు లోకసభ సీట్లు పెంచకుండా చట్టం చేసి సీజ్ చేశారు అది 50 ఏళ్ళ అయ్యింది ఇపుడు ఆ సమస్య వచ్చింది , ఇప్పటికీ ఆ అసమానతలు తగ్గలేదు. మళ్లీ ఏ ప్రాతిపదికన లోకసభ సీట్లు పెంచినా ? ఆ సమస్య కు పరిష్కారం కాదు,అది 50 % అయితే మరింత వ్యత్యాసం పెరిగిపోతుంది. అది ఉత్తరాది-దక్షణాది మధ్య పొరపొచ్చాలు ఏర్పడి దేశ సమైక్యతకు ముప్పు తెస్తుంది.కేంద్రం 543 లోక్ సభ సీట్లు కొనసాగిస్తూ మళ్లీ 25 ఏళ్ల వరకు సీజ్ చేయాలి, కాకపోతే ఇపుడు 543 సీట్లలోనే 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇంతకు మించి వేరే మార్గం లేదు. రేవంత్ రెడ్డి ఫార్ములాతో రాష్ట్రాల శాసన సభల్లో సీట్లు పెంచి 33 %శాతం సీట్లు రిజర్వర్డ్ చేయాలి. స్థానిక సంస్థల్లో ఎలాగూ మహిళా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి, కాక పోతే డి లిమిటేషన్ కమిటీ సిఫార్స్ తో అసెంబ్లీ సీట్లు కూడా పెంచుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఫార్ములా దేశ వ్యాప్తంగా చర్చలోకి వచ్చింది, రావటమే కాదు ,అది ఆమోద్యయోగంగా ఉందని జాతీయస్థాయి లో మంచి మద్దతు లభించింది . కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చే వర్షాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి ఫార్ములా పై నిర్ణయం తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఈ వివాదానికి ముగింపు పలకాలి

తెలుగు

ట్రంప్ గెలుపులో అమెరికా లోని ప్రవాస భారతీయుల పాత్ర కీలకం. ట్రంప్ మోడీకి స్నేహితుడని నమ్మి గెలిపించారు. చివరికి భారతీయుల్ని నమ్మక ద్రోహులని, భారత్ దేశం నరకం తో సమానం అని చెప్పాడు.అమెరికా లో ఉన్న ప్రవాస భారతీయులు ఆ దేశం వదిలి వచ్చేయాలని భావిస్తున్నారు. ఇది ప్రవాస భారతీయులకు ఒక విషాదకర పరిణామం. ఇప్పటికే గత 40 ఏళ్లుగా ఇండియాలొ పుట్టి ఇండియా ప్రభుత్య ఖర్చుతో ఉన్నత చదువులు చదివి వారి విజ్ఞానం అంతా విదేశాల్లో వినియోగిస్తున్నారు,ఆ విజ్ఞానం మన దేశానికి వినియోగిస్తే మన దేశం ఎంతో అభివృద్ధి సాధించేది. ఇకనైనా ప్రవాస భారతీయులు ఈ ఆలోచన మానేయాలి. మన దేశం లో చదువుకుంటున్న విద్యార్థులు డిగ్రీలు పొంది విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనకు స్వస్తి చెప్పాలి. వారి సేవలు మాతృగడ్డకే పరిమితం కావాలి. ప్రభుత్యాలు ఈ అంశం పై విద్యార్థులకు బోధన చేయాలి. పరుగెత్తి పాలు తాగటం అనర్థమని, దూరపు కొండలు నునుపు కాదని చెప్పాలి, ఇపుడు అమెరికాలో ఉన్న మన భారతీయులు పడుతున్న కష్టాలు వారికి తెలియజేయాలి.సారే జహాసే అచ్చాహై హిందూ సితార హమార హమ్మర అనే ప్రముఖ కవి ఇక్బాల్ రాసిన గేయం తాలూకు గొప్పతనాన్ని తెలపాలి

తెలుగు

నాక్కూడా @narendramodi గారిలా ‘బెంగాలి ఝాల్ ముడి‘ తినాల్నిపిస్తుంది . విజయవాడ లో ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే చెపుతారా ?

తెలుగు

ఈరోజు 20.04. 2026 న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56 వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో సీఎం @ncbn గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాము, ఈ సందర్భంగా కేకు కట్ చేయటం జరిగింది సీట్లు పంచటం జరిగింది, ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గున్నారు



తెలుగు

75 వసంతాలు పూర్తి చేసుకుని 76 వ వసంతం లోకి అడుగు పెడుతున్న @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీ సారథ్యం లో రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతుంది. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.మీరు తిరిగి సీఎం కావాలని తపించి ఐదు సంవత్సరాలు విరామం లేని పోరాటం చేసిన అనేక మంది లో నేను కూడా ఒకడిని, వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి మీరు అధికారంలోకి రావాలని మనసా,వాచా,కోరుకుంటు ఆ అల్లా మీకు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ప్రజాసేవ లో మీరు మరింత ఉత్సాహంగా ఉండాలని నేను నమ్మే అల్లా హుతలాను ప్రార్ధిస్తున్నాను. అలాగే మీరు నమ్మే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని నూరు వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను

తెలుగు

దేశంలో ఏ విధాన నిర్ణయం తేసుకోవాలన్నా ఆ అధికారం కేంద్ర క్యాబినెట్ కు ఉంటుంది, దాన్ని పార్లమెంటు ఆమోదం పొందవలసి ఉంటుంది. క్యాబినెట్ ఏ సమస్య పైన ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక కమిటీ గాని లేదా ఒక కమిషన్ గానీ నియమించి అది ఇచ్చే నివేదిక ఆధారంగా క్యాబినెట్ లో చర్చించి విధాన నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగాలి ఇది మన రాజ్యాంగం లో పేర్కున్న అంశం. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం వేతనసంఘాన్ని నియమిస్తుంది దానికి కాల పరిమితి విధిస్తుంది, ఆ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా క్యాబినెట్ లో చర్చించి ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది, అవసరమైతే పార్లమెంట్ ఆమోదం తీసుకుంటుంది. ఈ ప్రకియ దేనికైనా ఇదే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 131 రాజ్యాంగ సవరణ కోసం బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినపుడు లోకసభ, రాష్ట్రాల శాసనసభల్లో 50 శాతం సీట్లు పెంచుతామని హోo మంత్రి పార్లమెంట్ బయట లోపల ప్రకటించారు, దేశంలో అనేక పార్టీలు దీన్ని నమ్మాయి. ఆశావాహుల సంఖ్య పేరిగి పోయింది,వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు, మీడియా కూడా నమ్మి కొత్తగా వచ్చే నియోజకవర్గాలు అంచనాలు వేసాయి, దాంతో మహిళలు 33 శాతం మంది వచ్చే ఎన్నికల్లో గెలిచి చట్ట సభల్లో కూర్చోబోతున్నారని ప్రచారం జరిగింది. పార్లమెంట్ ప్రత్యక సమావేశాల్లో తెచ్చిన డి లిమిటేషన్ బిల్లులో 50 శాతం సీట్లు పెంచే క్లాజు లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నామని తమను నమ్మమని చెప్పింది . ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే ఏ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పౌరులు న్యాయ స్థానాలల్లో సవాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేక చేతులు ఎత్తేసే పరిస్థితి, అపుడు న్యాయస్థానం 50 శాతం సీట్లు పెంచిన జీవో ను కొట్టేస్తుంది, ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం ఎటువంటి కమీషన్ గానీ కమిటీ కానీ నియమించలేదు, చట్ట సభల్లో సీట్లు పెంచే అధికారం డి లిమిటేషన్ కు మాత్రమే ఉంటుంది అది తాజా జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే, అలాంటిది ఏది లేకుండా పార్లమెంట్ లో ప్రభుత్వం ప్రకటన చేసినా జీవో ఇచ్చినా అది చెల్లదు, ఈ విషయం తెలిసినా పాలకులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, రెచ్చకొడితున్నారు. ఇపుడు 2026 లో జనాభా లెక్కల ప్రక్రియ మొదలు పెట్టారు, ఆ నివేదిక 2027 లో వస్తుంది, అపుడు డి లిమిటేషన్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుంది, డి లిమిటేటిన్ కమిటీ నియోజకవర్గాల బౌండ్రీ లను సరిచేయడం అంటే పునర్విభజన చేయటం , నియోజక వర్గాల సంఖ్య పెంచడం, మహిళా రిజర్వేషన్ ప్రకారం 33 శాతం సీట్లు గుర్తించటం, అందులో వెనుకబడిన వర్గాల మహిళల సబ్ కోటా ప్రకారం ఎంత శాతం అలాగే ఏ నియోజక వర్గాలు కేటాయించటం లాంటివి డిలిమిటేషన్ కమిషన్ నియమించవలసి ఉంటుంది, దీనికి కనీసం ఐదు నుండి ఆరు సంవత్సరాల సమయం పడుతుంది, అంటే 2029 సాధారణ ఎన్నికల్లో లోపు సీట్లు పెంచటం గానీ నియోజక వర్గాల పునర్విభజన గానీ సాధ్యం కాదు అంటే ఇదంతా పూర్తి అయ్యి 2034 సాధారణ ఎన్నికల్లో నే మహిళా రిజర్వేషన్ అమలు జరుగుతాయి అనేది సుస్పష్టం. వచ్చే 2029 ఎన్నికల్లో ఇపుడున్న 543 లోకసభ స్థానాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయటం మినహా కేంద్ర ప్రభుత్వానికి మరో దారి లేదు. తద్ ద్వారా తాము మహిళకు న్యాయం చేశామని చెప్పటానికీ అవకాశం ఉంటుంది

తెలుగు

Who Controls India’s Future After Delimitation? youtube.com/shorts/uRUkOpC… via @YouTube

YouTube
English

దేశంలో అన్ని పత్రికలు మహిళా బిల్లు వీగిపోయిందని హెడ్డింగ్ పెట్టాయి.ఒక్క హిందూ పత్రిక మాత్రమే 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిందని హెడ్డింగ్ పెట్టింది. ఆ పత్రికకు ఉన్న నిబద్ధత మరో సారి చాటుకుంది.మన మీడియా ఎలా ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తుందో మిగితా పత్రికల హెడ్డింగులు చూస్తే అర్ధమౌతుంది . అంతే కాదు రాజకీయ నాయకులు కూడా మహిళా బిల్లు ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. 2023 లోన్ మహిళ రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆది సజీవంగా ఉంది, అయినా రాజకీయ నాయకులు ఎందుకు అబద్ధం చెబుతున్నారని ప్రశ్నిస్తున్నాను. రాజ్యాంగ సవరణ తో ముడి పెట్టి మహిళా బిల్లు అమలు జరపకుండా ఇలా ప్రజల్ని ముఖ్యంగా మహిళల ను ఎందుకు మోసం చేస్తున్నారు? అసలు మహిళా బిల్లు ను అడ్డుకుంది ఎవరు? కేంద్రప్రభుత్వమా? ప్రతిపక్షాలా? ప్రజలు తెలుసుకోలేనంత అమాయకులని పాలకులు భావిస్తున్నారు . అలా వాళ్ళు భ్రమపడుతున్నారు ? మనం సోషల్ మీడియా యుగం ఉన్నామనేది వాళ్ళు మరచిపోతున్నారు. ఏ నిముషానికి ఆ నిముషం ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు తమ గురించి ఎవరు ఏం చెపుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పేరు మోసిన సాట్లైట్ ఛానెల్స్ ,ప్రముఖ పత్రికలు చెప్పినవి నమ్మే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. సోషల్ మీడియా ఆ స్పేస్ ను ఆక్రమించింది. పాలకులు తాము చెప్పిందే నిజం అని ప్రజలు నమ్ముతున్నారని అనుకోవటం అది వారి భ్రమ. ఇప్పటికైనా 2023 లో పార్లమెంట్ ఆమెదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును దానికి జోడించిన డి లిమిటటన్ ను విడదీస్తూ చిన్న పాటి సవరణ కోసం వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి మహిళా రిజర్వేషన్ లు అమలు చేయాలి. అసలు ఇపుడున్న 543 స్థానాల్లో మహిళా రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తున్నది ఎవరు? అనేది అందరికీ తెలిసిన సత్యమే. పురుష ఎంపీ లు పురుష నాయకులు తమ స్థానాలు కోల్పోతామని గత మూడు దశాబ్దాలుగా ఈ మహిళా రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తున్నారు.పాలకులు వారి మెప్పుకోసం తన అధికారం చేజారకుండా వారిని తృప్తి పరుస్తు మహిళా రిజర్వేషన్ లు అమలు చేయడం మానేశారు, పైకి అందరూ మహిళా పక్షపాతులు గా నటిస్తున్నారు, అందుకే వారి స్థానాలకు ముప్పు రాకుండా దేశవ్యాప్తంగా 50 శాతం సీట్లు పెంచాలనే ఫార్ములా తెచ్చారు. రాజ్యాంగం లో జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేసి సీట్లు పెంచాలని ఉంటే కేంద్ర ప్రభుత్వం 131 ద్వారా 50 శాతం సీట్లు పెంచుతామని నమ్మ బలికింది,అది న్యాయ సమీక్షకు నిలబడదు, అది తెలిసే కేంద్ర ప్రభుత్వం బిల్లు లో చేర్చలేదు. నెమ్మదిగా ఈ విషయాలు అన్ని ప్రజలకు తెలుస్తాయి. ఇపుడు 2023 చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే.

తెలుగు

2023 లోనే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దాన్ని 2024 సాధారణ ఎన్నికల్లో అమలు చేసి ఉంటే లోకసభ , అసెంబ్లీ స్థానాల్లో కొన్ని వందల మంది మహిళా సభ్యులు చట్టసభలకు ఎన్నికైవారు. దాన్ని విస్మరించి కేంద్రపభత్యం హడావుడిగా మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ దాని మాటున 131 రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఆ బిల్లు లో 50 శాతం సీట్లు పెంచుతామన్న క్లాజు ను పెట్టకపోవటం అలాగే బిసి మహిళల సబ్ కోటాను చేర్చకపోవటం లేకపోవడంతో ప్రతిపక్షాల విశ్వాసం పొందలేక పోయింది. బిల్లు వీగిపోయింది. లోకసభ తిరస్కరించింది అది డి లిమిటేషన్ ను మాత్రమే. మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు.మహిళా రిజర్వేషన్ ను డి లిమిటిషన్ ను జత చేయటం పెద్ద తప్పిదం. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా పార్లమెంట్ లో సజీవంగా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ను చిన్న సవరణ తో అమలు చేయాలి.ఆ తర్వాత 2026 లో జరుగుతున్న జనగణన, కులగణన తర్వాత 131 రాజ్యాంగ సవరణ చేసి డి లిమిటెటిన్ అమలు చేయవచ్చు. అపుడు ఏ ప్రతిపాదన సీట్లు పెంచాలో పార్లమెంట్ నిర్ణయిస్తుంది. 2029 ఎన్నికల్లో 543 స్థానాల్లో, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో 33 శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలి.ఇది కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం.

తెలుగు

మొన్న మాడభూషి శ్రీధర్ అమరావతి పై విషం చిమ్మాడు, నిన్న దేవులపల్లి అమర్ విషం కత్కాడు. ఈ తెలంగాణ మేధావులు ఎవరికి అమ్ముడు పోయి ఇలా విషం చిమ్ముతున్నారు ? వీళ్లు ఆంధ్ర లో అడుగుపెడితే తరిమి కొట్టాలి.తెలంగాల అభివృద్ధి వికేంద్రీకరణ గురించి వీళ్లు మాట్లాడరు. హైదరాబాద్ లోనే ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు అని ప్రశ్నించరు? ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ప్రక్కనే ఎందుకు కడుతున్నారు అని అడగే దమ్ము లేదు ? వరంగల్ లో కట్టవచ్చునని చెప్పలేరా? తెలంగాణ కు ఒక విధానం? ఆంధ్ర కు ఒక విధానం ఈ మేధావులకు..,ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్లి హైదరాబాద్ లో స్థిరపడిన వాళ్ళు అలాగే వామపక్ష మేధావులు కూడా తెలంగాణ మేధావుల పాటనే పాడుతారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి వి రాఘవులు గారు @ysjagan కు బాగా గడ్డి పెట్టారు. వీళ్లు ఆది చదివి అయినా బుద్ధి తెచ్చుకుంటే మంచిది .సీఎం @ncbn గారు చేస్తున్న ప్రయత్నానికి ఇస్తే మద్దతు ఇవ్వండి బివి రాఘవులు గారిలా, లేకుంటే నోరు మూసుకొని ఉండండి, అంతేకానీ తెలంగాణ లో కూర్చుని విషం చిమ్మితే ఆంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు.


తెలుగు

YS రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంపై సోనియాగాంధీ, ముఖేష్ అంబానీ ల హస్తం ఉంది అని ఆరోపణలు చేసి రిలయన్స్ ఔట్లెట్ల పై, రిలయన్స్ మాల్స్ పై దాడులు చేసి నానా యాగి చేసిన @ysjagan అప్పట్లోనే సీబీఐ దర్యాప్తు కు ఎందుకు డిమాండ్ చేయలేదు, అలాగే తాను సీఎం అయ్యాన తర్వాత కూడా జగన్ ఎటువంటి దర్యాప్తుకు ఆదేశించలేదు. అసలు ఆ సంఘటన జరగలేదన్నట్లు వ్యహరించాడు. ఎందుకు మౌనం వహించాడు. అంతేకాకుండా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కి రెడ్ కార్పెట్ పరిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి అతని సహచరుడు పరిమళ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చి తన బంధాన్ని చాటుకోటం ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో బొత్స సత్యనారాయణ ఆరోపించినట్లు అనుమానాలు ప్రజలు ఇప్పటికీ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి జగన్ తన తండ్రి వైఎస్ మరణం మీద ఇప్పటికైనా దర్యాప్తును కోరాలి. జగన్ దర్యాప్తు కోరటం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.జగన్ కనుక దర్యాపు చేయమని కోరితే సీఎం @ncbn గారు CID ద్వారా తప్పకుండా దర్యాపుచేస్తారు

తెలుగు

ఆంధ్రజ్యోతి MD @vemuriradha1 గారిని తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతానని ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలికాడు @ysjagan , అదీ ఆయన అధికారంలోకి వచ్చాక అని తన పగటికల ను నూరి పోశాడు తను పిలిపించుకున్న తన కార్యకర్తలకు. గతంలో why not one seventy five అని ఉదరకొట్టాడు . ఇప్పుడు కూడా అదే పరిస్థితి.అతను అధికారం లోకి వస్తానని ఉదర కొడుతున్నాడు,అతను వచ్చేది లేదు సచ్చేదీ లేదు అని వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు.ఏదో కొంతమంది సైకో లు తప్పితే ఎవరికి అతని మీద నమ్మకం లేదు. ఎపుడైతే ‘ మావిగన్ ‘ అన్నాడో అదేరోజు జగన్ రాజకీయ భవిష్యత్ శూన్యం అని తేలిపోయింది. ఒక ప్రక్క అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఇతనేంటి మావిగన్ అంటూ బయలుదేరాడు అని ప్రజలు నవ్వుకుని ఒక పిచ్చోడి లా భావిస్తున్నారు. పైగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని మావిగన్ ను ప్రచారం చేస్తానని చెప్పాడు. ఈ #Mavigun ప్రతిపాదనే వైసీపీ కి మరణశాసనం అని కూటమికి గెలుపుకి ఒక అదనపు అస్త్రం అని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా @ncbn గారు ప్రజల జేజేలు అందుకుని 2029 లో కూడా కూటమి విజయానికి బాటలు వేస్తున్నారు. మీ లాంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉండటం వైసీపీ లాంటి పార్టీ తో పోటీ చేయటం కూటమికి కలసి వచ్చిన అదృష్టం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత దిగజారిన పార్టీ గానీ ఇంత అవగాహన లేని నాయకుడు గానీ లేదు. ABN రాధాకృష్ణ మీ టాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదు, మీ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ఏమీ చేయలేక పోయాడు. మీరు కూడా సీఎం గా ఉండి కూడా ఏమీ చేయలేక పోయారు జగన్. రాధాకృష్ణ దమ్మున్న జర్నలిస్టు ఆయన ABN, ఆంధ్రజ్యోతి దమ్మున్న వార్త సంస్థలు.ప్రజలు ఆదరిస్తున్నoత కాలం ఆయన్ని ఆ సంస్థల్ని ఏమీ చేయలేరు,ఏమీ పీక లేరు.


తెలుగు

వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన కామెంట్ పై ఏనాడైనా స్పందించారా @ysjagan .ఇది దారుణమని మీకు అనిపించలేదా? వర్రా రవీంద్రారెడ్డి ని మందలించక పోగా అతన్ని భుజం తగ్గినట్లు చెపుతున్నారు. అతను మీ తల్లి క్యారెక్టర్ ని, మీ చెల్లి పుట్టుకను ప్రశ్నించాడు కదా? మీకు పౌరుషం రాలేదా?మీ వైసీపీ నాయకులు @ncbn గారి సతీమణి మీద చేసిన కామెంట్స్ ఖండించక పోగా,మీ వాళ్ళు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతుంటే నవ్వుకున్నారు కదా? ABN రాధాకృష్ణ చేసిన కామెంట్స్ మీ శైతాన్ సైన్యం చేసిన కామెంట్స్ తో పోల్చితే ఆ కామెంట్ ఎంత? దీనికే మీరు దాడులు చేయిస్తారా? ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా మీ నైజం మారలేదు. ఈ వైఖరిని ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలలో ఆ 11 సీట్లు కూడా ప్రజలు ఇచ్చే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ఒక రాజకీయనాయకుడుగా ? మీ పార్టీని ఒక రాజకీయపార్టీగా ప్రజలు పరిగణించటం లేదు జగన్ రెడ్డి. ఏదో YSR కుమారుడిగా ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చారు. మీరు విశ్వరూపం చూపించారు. అది చూసిన తర్వాత కూడా ప్రజలు మళ్లీ తప్పు ఎందుకు చేస్తారు?

తెలుగు





