Telangana CMO

15.4K posts

Telangana CMO banner
Telangana CMO

Telangana CMO

@TelanganaCMO

Official account of CMO Telangana.

Hyderabad Katılım Haziran 2014
132 Takip Edilen1.7M Takipçiler
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి రహేజా గ్రూప్, రామ్‌కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్‌లు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ #CSR కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన ఈ సంస్థలు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. ✅డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశంలో @KRaheja_Corp అధ్య‌క్షుడు నీల్ సి. ర‌హేజా గారు, @RamkyFoundation మేనేజింగ్ ట్ర‌స్టీ అల్లా దాక్షాయ‌ణి గారు, @YashodaHospital గ్రూప్ డైరెక్ట‌ర్ గోరుకంటి దేవేంద‌ర్ రావు గారు పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా విద్యా శాఖతో కుదిరిన ఒప్పందాలను ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరస్పరం అందజేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం కొత్త ప్రాంగణ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం మేరకు (రూ. 19.66 కోట్లు) వెచ్చించడానికి రాంకీ సంస్థ ముందుకొచ్చింది. ✅రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ZPHS ఉన్నతీకరణలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదవ తరగతి, ఇంటర్ తరగతి గదుల నిర్మాణం కోసం మొత్తం వ్యయంలో 40 శాతం (రూ. 10.4 కోట్లు) ఖర్చు చేయడానికి రాంకీ సంస్థ‌ ఒప్పందం చేసుకుంది. ✅రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల నిర్మాణం కోసం అవసరమైన రూ. 50.50 కోట్లు ర‌హేజా గ్రూప్ ఖర్చు చేయడానికి ముందుకొచ్చి ఒప్పందం చేసుకుంది. ✅మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్‌నగర్ MPPS లో ప్రీ-ప్రైమరీ, 6వ, 7వ తరగతి గదుల కోసం అవసరమైన రూ. 12.20 కోట్లు యశోదా హాస్పటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ✅ఈ ఒప్పంద కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితా రాణా గారు, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ దేవ‌సేన‌ గారు, సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి గారు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (@IGBConline) ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ✅కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న మంచి ఆలోచనతో ముందుకొచ్చిన సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు. #CorporateSocialResponsibility #SchoolEducation #GovernmentSchools #Telangana #Hyderabad #YashodaFoundation #RamkyFoundation #RahejaGroup
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
2
3
9
565
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పాల్గొని భూమిపూజ చేశారు. 🛕వేద పాఠశాలతో పాటు టెంపుల్ సిటీ పరిధిలో రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేశారు. 🛕ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసన మండలి చైర్మన్ @Gutha_Sukender గారు, మంత్రులు @iamkondasurekha గారు, @KomatireddyKVR గారు, @minister_adluri గారు, ఎంపీలు @Vemnarenderredy గారు, @kiran_chamala గారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 🛕#YadagiriguttaTempleCity ని తిరుమల తిరుపతి దేవస్థానం #TTD తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 🛕రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. 🛕వేద పాఠశాలకు భూమిపూజతో పాటు రూ. 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ. 1.41 కోట్లతో రక్షణ పైకప్పు (కానోపీ) నిర్మాణం, రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. #Yadagirigutta #SriLakshmiNarasimhaSwamyTemple #PrajaPalana #YadadriBhuvanagiri #SriKanchiKamakotiPeetam #VedaPatashala
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
3
5
26
1.6K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రి గారితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. #Yadagirigutta #SriLakshmiNarasimhaSwamyTemple #YadadriBhuvanagiri #SriKanchiKamakotiPeetam
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
2
11
58
2K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Darshan and Pooja at Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta, Yadadri Bhuvanagiri District twitter.com/i/broadcasts/1…
हिन्दी
4
14
33
1.4K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Bhoomi Pooja for Sri Lakshmi Narasimha Swamy Veda Patashala & Lays Foundation Stone for Development Works at Temple City | Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta twitter.com/i/broadcasts/1…
English
2
12
27
1.5K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy extended his warm birthday greetings to Shri Komatireddy Venkat Reddy, Minister for Roads & Buildings and Cinematography. The Chief Minister conveyed his earnest wishes for his continued good health, happiness, and a long and purposeful life. On this special occasion, he also expressed his sincere prayers for Shri Venkat Reddy’s well-being and for his continued contributions to public life and the nation. రాష్ట్ర రోడ్లు, భవనాలు, & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. #TelanganaRising2047
Telangana CMO tweet media
English
4
12
71
2.5K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో లంబాడ ప్రజాప్రతినిధుల బృందం కలిసింది. లంబాడీల ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుతో “సంత్ సేవాలాల్ కార్పొరేషన్” ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్‌ను వేరు చేసి ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. ఎంపీ బలరాం నాయక్ గారు, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ గారు, ఎమ్మెల్యేలు మురళీ నాయక్ గారు, రాందాస్ నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, తెలంగాణ గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఉన్నారు. #ShriSantSevalalMaharaj
Telangana CMO tweet media
తెలుగు
3
20
88
4.7K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (#NIMS) యూరాలజీ విభాగం, 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. ✅కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లలో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ మొదటి స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రెండో స్థానంలో ఉండగా, నిమ్స్ మూడో స్థానంలో ఉంది. ✅ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. ✅ఈ 2 వేల మందిలో 1,900 మంది అంటే 95 శాతం మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవడం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు సృష్టించింది. #KidneyTransplant #KidneyCare #TelanganaHealthcare #RajivAarogyasri
Telangana CMO tweet media
తెలుగు
9
31
87
4.9K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
సామాజిక సంస్కర్త, ఆది హిందు సోషల్ సర్వీస్ లీగ్ వ్యవస్థాపకులు స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ గారి 138వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళల విముక్తి కోసం వారు చేసిన పోరాటాలు, నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. #BhagyaReddyVarma
Telangana CMO tweet media
తెలుగు
4
16
41
2.5K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
జనగణనలో కులగణన చేర్చే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దశ, దిశ, ఒక దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. ✅సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో జనగణనలో తక్షణం కులగణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన చేసిందని గుర్తుచేశారు. ✅సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే చేసి సమగ్ర వివరాలను ప్రజల ముందు ఉంచిందని చెప్పారు. బలహీన వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని పేర్కొన్నారు. ✅“ఇప్పుడు కులగణనను సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. మంచి పరిణామం. తెలంగాణ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం” అని అన్నారు. వంద సంవత్సరాలుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని గర్వంగా ఉందని చెప్పారు. #CMRevanthReddy #Census #CasteCensus #Telangana #SEEEPC
Telangana CMO tweet media
తెలుగు
12
21
70
5.1K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇకనుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అభిప్రాయపడ్డారు. యువత బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ✅ముఖ్యమంత్రి గారు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యువత వైఖరిలో మార్పు రావాలని చెప్పారు. ✅“ఈ 2026 సంవత్సరంలో యువత ఇప్పటి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవలసిన అవసరం ఉంది. #AI వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగానికి భద్రత లేని పరిస్థితులున్నాయి. అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్స్‌ను ఏఐ రిప్లేస్ చేయలేదు” అని చెప్పారు. ✅"బ్లూ కాలర్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నదని వివరించారు. స్కిల్స్ నేర్చుకోవాలని యువతకు సూచిస్తున్నాం. యువతకు స్కిల్స్ నేర్పించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాం. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందించే ఏటీసీలుగా మార్చాం. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను అప్‌గ్రేడ్ చేస్తున్నాం" అని వెల్లడించారు. ✅“ఏదైనా చదువుకుంటే ఉద్యోగం రావాలి. లేదా ఉపాధి అవకాశమైనా ఉండాలి. ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు లేని చదువులు చదివి ప్రయోజనం లేదు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. జీవన ప్రమాణాలు కూడా అమెరికాకన్నా మెరుగ్గా ఉన్నాయి. సాంకేతిక నైపుణ్యం ఉంటే రూ. 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి” అని అన్నారు. ✅“స్కిల్స్ కలిగిన వారికి జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. ఇంగ్లీషు రాకున్నా ఈ దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అక్కడి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే జర్మన్, జపనీస్ భాషలు నేర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది” అని గుర్తుచేశారు. ✅“2000 సంవత్సరంలో ఐటీ చదువుకున్నా, కంప్యూటర్ నేర్చుకున్నా ఉద్యోగం వస్తుంది. అమెరికా వెళ్లొచ్చనే ఒక భద్రత కనిపించేది. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రపంచంలో పెను మార్పులొచ్చాయి. ఏఐ తుఫానులో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది” అని మారుతున్న పరిస్థితులను వివరించారు. ✅“శరవేగంగా మారుతున్న పరిస్థితులను అంచనా వేసుకుని ప్రపంచ దేశాలకు ప్రత్యామ్యాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువత దృక్పథంలో మార్పు రావాలి..” అని హితవు చెప్పారు. #Telangana #ArtificialIntelligence #BlueCollarJobs #SkilledWorkforce #SkillDevelopment
Telangana CMO tweet media
తెలుగు
21
30
109
9.3K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ✅డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారు కార్మిక ఉపాది శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ @VivekVenkatswam గారు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికులకు ఈ శుభవార్తను చెప్పారు. ✅రాష్ట్రంలో కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆ ప్రాతిపదికన వేతనాలను పెంచినట్టు తెలిపారు. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా 4 విభాగాలుగా విభజించినట్టు చెప్పారు. ✅ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బన్, రూరల్‌గా 2 జోన్లు ఉండేవని, వాటిని ఇప్పుడు 3 జోన్లుగా విభజించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలను నిర్ణయించామని చెప్పారు. ✅అన్‌స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ. 12,750 నుంచి రూ. 16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ. 13,592 నుంచి రూ. 17 వేలకు, స్కిల్డ్ కార్మికులకు రూ. 13,772 నుంచి రూ. 18,500 లకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ. 14,607 నుంచి రూ. 20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ పెంచిన వేతనాలు వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ✅“కార్మికుల వేతనాల పెంపుపై #Telangana ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో కార్మికుల వేతనాల పెంపు జరగలేదు. తద్వారా రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారు” అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. ✅తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతన సవరణపై ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి నేతృత్వంలో మంత్రులు @OffDSB గారు, వివేక్ వెంకటస్వామి గార్లతో మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. ✅కార్మిక సంఘాలు, నాయకులు, ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతర స్టేక్‌హోల్డర్స్ అందరితో సంప్రదింపులు జరిపి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వేతన సవరణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారి ఈ నిర్ణయం జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ✅“ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల పెరుగుదల, ఇంటి అద్దె వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు శుభవార్త” అని ముఖ్యమంత్రి గారు పేర్కొంటూ ఈ సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ✅అనేక దేశాల్లో స్కిల్డ్ లేబర్ కొరత ఉందని, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఏజెంట్ల చేతుల్లో కార్మికులెవరూ మోసపోవద్దని హెచ్చరించారు. ✅ముఖ్యంగా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, అక్కడి కంపెనీలతో సంప్రదింపులు జరిపి వారికి ఏం కావాలో అందుకు అనుగుణంగా ఇక్కడి నుంచి కార్మికులను పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ✅ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటుందని, తొందర్లోనే మరిన్ని మంచి ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పారు. ✅గతంలో ప్రమాదవశాత్తు #Gulf దేశాల్లో ఎవరైనా మరణిస్తే శవాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదని, తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వారి అండగా నిలవడమే కాకుండా ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని గుర్తుచేశారు. #Telangana #LabourWelfare #MinimumWages #WorkerWelfare #LabourDepartment
Telangana CMO tweet media
తెలుగు
29
18
68
4.7K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Addresses the Media at Dr BR Ambedkar Telangana State Secretariat, Hyderabad | CM Revanth Reddy Press Meet twitter.com/i/broadcasts/1…
English
9
25
41
2.3K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ✅రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఆ మహానేత విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ✅21వ శతాబ్దంలో దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు నడిపించి ఒక దశ, దిశ చూపించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారని గుర్తుచేశారు. సాంకేతిక యుగం వైపు దేశ యువతను సన్నద్ధం చేసిన నాయకుడని కొనియాడారు. ✅మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ లాంటి మహానాయకుల స్ఫూర్తితో పనిచేస్తూ రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించారని అన్నారు. టెలికాం, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక విప్లవం తేవడమే కాకుండా పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని భావించి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. ✅లోక్‌సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి చిక్కుముడులు లేకుండా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరోసారి బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రి గారిని కోరారు. ✅తెలంగాణతో ఇందిరాగాంధీ కుటుంబానికి గొప్ప అనుబంధం ఉందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #RajivGandhi #WomenReservation #Telangana
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
7
28
107
3.2K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Pays Floral Tributes to Bharat Ratna and Former Prime Minister of India Sri Rajiv Gandhi ji on His Death Anniversary at the Statue Opposite Telangana Secretariat, Hyderabad twitter.com/i/broadcasts/1…
English
5
17
39
1.9K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
పవిత్ర “సరస్వతి అంత్య పుష్కర మహోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, దైవానుగ్రహం పొందాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ఈరోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న అంత్య పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని అభిలషించారు. #SaraswatiAnthyaPushkaralu #Kaleshwaram #TriveniSangamam
Telangana CMO tweet media
తెలుగు
4
18
54
3K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని దేశవ్యాప్తంగా “ఉగ్రవాద వ్యతిరేక దినం”గా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం మరియు సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. “సమైక్యతే మన శక్తి – శాంతియుత భారతమే మన లక్ష్యం” అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. #RajivGandhi #AntiTerrorismDay
Telangana CMO tweet media
తెలుగు
7
18
53
2.5K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
దేశంలో నేరాలు, వాటి స్వరూపం మారుతున్న నేపథ్యంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో మార్పులు అవసరమని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టంగా చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా అన్ని వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ✅#Telangana లో శాంతి భద్రతలు, ఆధునిక అవసరాలకు తగిన విధంగా పోలీసు వ్యవస్థలో తీసుకురావలసిన మార్పుచేర్పులు, ప్రభుత్వ ఆలోచనలు.. వంటి కీలక అంశాలపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సీనియర్ పోలీసు అధికారులు, అగ్నిమాపక, హైడ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ✅వచ్చే పదేళ్ల అవసరాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ✅ఈ సమావేశంలో @TelanganaCS కె. రామకృష్ణా రావు గారు, రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి గారు, @TelanganaDGP సీవీ ఆనంద్ గారితో పాటు అదనపు డీజీలు, పోలీసు కమిషనర్లు, ఐజీలతో పాటు ఉన్నతస్థాయి పోలీసు అధికారులు పాల్గొన్నారు. ✅నేరాల స్వరూపం మారుతోందని, పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ గార్లను ఆదేశించారు. ✅“#CyberCrime నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయడం కోసం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ప్రత్యేకంగా సెలక్షన్ జరగాలి. అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్స్‌ను ప్రారంభించాలి” అని సూచించారు. ✅“యంత్రాంగం నిరంతర నిఘా వ్యవస్థలా పనిచేయాలి. డ్రోన్ పోలీసింగ్ పెంచాలి. పోలీసింగ్‌లో నూతన సాంకేతికతను వినియోగించుకోవాలి. సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలి. నైట్ పెట్రోలింగ్‌ వ్యవస్థను పెంచాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి” అని చెప్పారు. ✅మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన ఫోరెన్సిక్ సెంటర్స్, డేటా సెంటర్లను పెంచుకోవాలి. డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐ నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తర్వాత రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లోనూ పనిచేసే విధంగా చూడాలని అన్నారు. ✅డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం బాగా పెరగాలన్నారు. ✅“విజిలెన్స్ విభాగంలో సాంకేతికతను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారి పైన విజిలెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. డేటా అనాలిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ పైన విజిలెన్స్ విభాగం దృష్టి సారించాలి. అవసరమైతే విజిలెన్స్‌కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపైన అధ్యయనం చేయాలి” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ✅“అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక విభాగం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి మునిసిపల్, హైడ్రాతో సమన్వయం, తీసుకోవలసిన చర్యలపై అగ్నిమాపక విభాగం జూన్ 15 లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి” అని ఆదేశించారు. ✅“నాలాల నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్ విభాగంతో సమన్వయం చేసుకోవాలి. మ్యాన్ హోల్స్ నిర్వహణ పైన పోలీస్, ట్రాఫిక్ పోలీస్, #HYDRAA, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలి” అని చెప్పారు. ✅నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందే. పోలీసు కమిషనర్, జీహెచ్‌ఎంసీ అధికారులు ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ✅ఆహార కల్తీ నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. కల్తీ ఆహారం వల్ల క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కల్తీ ఆహారం సూత్రధారులపై ఉక్కుపాదం మోపాలి. కల్తీ నిరోధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పారు. ✅“శాంతి భద్రతల పరిరక్షణ పవిత్ర బాధ్యత. ప్రభుత్వ ఆలోచనను పంచుకోవాలన్నదే ఈ సమావేశ ఉద్దేశం. పోలీసు శాఖలో బాధ్యత పెరగాలి. ఈ వ్యవస్థలో అందరూ భాగస్వాములే. పరిధి దాటి వెళ్తామంటే అంగీకరించేది లేదు. అలాంటి అధికారులను ప్రభుత్వం ఒప్పుకోదు” అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ✅“క్రైమ్ రివ్యూ మీటింగ్స్ తప్పని సరిగా జరగాలి. ఎస్పీలు నిరంతరం జిల్లాల్లో పర్యటించాలి. ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. రౌడీ షీటర్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. గంజాయి రవాణాను నిరంతర నిఘా పెట్టాలి. ✅శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదు. పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలి. విలేజ్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలి. కాలం చెల్లిన ఆయుధాలను తొలగించాలి” అని సూచించారు. ✅“పోలీసుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. డిపార్ట్‌మెంట్‌లో ఇకనుంచి అన్ని వాహనాలు ఈవీకి మారాలి. డిపార్ట్‌మెంట్ బలోపేతం కావడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తా. ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం” అని తెలిపారు. ✅“డిపార్ట్‌మెంట్‌లో అవినీతిని సహించం. మెరిట్ ప్రకారం పోస్టింగ్స్ ఇవ్వాలి. సమన్వయ లోపం వల్ల సమస్యలు రాకూడదు. పోలీసు అధికారుల మధ్య సమన్వయం పెరగాలి. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ను ఒక యూనిట్ కిందకు మార్చాలి. వీఐపీలు, సెలబ్రిటీల కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి గారు సూచించారు. #TelanganaPolice #CyberCrime #PublicSafety #PoliceReforms #CyberSecurity #CrimePrevention
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
16
30
121
5.1K