ASHOK VEMULAPALLI@ashuvemulapalli
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
హైదరాబాద్ లో చిన్నదో పెద్దదో సొంత ఇల్లు ఉంటే జీవితానికి ఎక్కడా లేని ప్రశాంతత వచ్చేస్తుంది .. ప్రతి ఏటా యజమానులు పెంచుకుంటూ పోయే రెంట్ కట్టలేక నానా ఇబ్బంది పడాల్సి వస్తోంది ..నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఒక ఓల్డ్ గేటెడ్ కమ్యూనిటీలో గత నాలుగేళ్లుగా ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో రెంట్ కి ఉంటున్నాను .. ప్రస్తుతం 25 వేలు రెంట్ , 2300 మెయింటెనెన్స్ (ఈ మధ్య మరో 500 పెంచారు ) కడుతున్నాను .. తాజాగా ఇవాళ ఇంటి ఓనర్ కాల్ చేసి మరో నాలుగువేలు రెంట్ పెంచుతున్నానని చెప్పారు .. పోయిన ఏడాది కూడా ఇలాగే 4 వేలు రెంట్ పెంచారు .. ఇంత రెంట్ ఒకేసారి పెంచితే బాకు భారం అవుతుందని చెప్పాను . కానీ ఓనర్ వినలేదు .. పెరిగిన రెంట్ ప్రకారం 29000 వేలు రెంట్ , పెరిగిన మెయింటెనెన్స్ ప్రకారం 2800 మొత్తం కలిపితే 31800 అవుతుంది .. నేను ఉండే అపార్ట్మెంట్ 40 ఏళ్ల క్రితంది .. ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు .. లిఫ్ట్ లు కూడా 40 ఏళ్ల క్రితం వే.. పేరుకి గేటెడ్ కమ్యూనిటీ కానీ ప్రత్యేక వసతులు ఏమీ ఉండవు.. అయినా సరే పిల్లల స్కూల్ కి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడే ఉంటున్నాను ..
ప్రస్తుతం నాకు జీతం బాగానే వస్తోంది కాబట్టి ఇంత రెంట్ కట్టగల్గుతున్నాను . కానీ ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏదైనా నెల జీతం ఆగితే ఆలస్యం అయితే ఆ నెల పడే నరకం అంతా ఇంతా కాదు ..జీతం ఎంత బాగా వచ్చినా .. హోదా ఎంత పెద్దదైనా .. సరే.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి .. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించడానికి ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తాను .. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటాయి ..
అందుకే చిన్నదైనా సరే .. పాతదైనా సరే ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోన్ తీసుకుని కొందామని చాలా ట్రై చేశాను .. తెలిసిన వాళ్ళందరికీ ఏదైనా ఫ్లాట్ ఉందేమి అడిగేవాడిని .. నో బ్రోకర్ , 99 యాకర్స్ లాంటి సైట్స్ లో ప్రీమియం మెంబర్ షిప్ తీసుకున్నాను .. లోకల్ గా ఉండే ప్రాపర్టీ మీడియేటర్స్ అందరినీ అప్రోచ్ అయ్యాను .. ఇక పొద్దున్నే లేవగానే బైక్ పై శ్రీనగర్ కాలనీ , ఎల్లారెడ్డిగూడ , నాగార్జున నగర్ కాలనీ , కమలాపురి కాలనీల్లో తిరిగి ఫర్ సేల్ బోర్డులు కోసం గాలించేవాడిని .. సేల్ కి చాలానే ఉన్నాయి కానీ నా బడ్జెట్ కి సెట్ కాకపోవడం , కొన్ని ఫ్లాట్స్ లో ఫెసిలిటీస్ బావుండకపోవడం లాంటి కారణాలతో కొనలేకపోయాను .. కొన్నింటికి బీపీఎస్ చేయించకపోవడం , లీగర్ హెయిర్ సర్టిఫికెట్స్ లాంటివి లేకపోవడం తో లోన్స్ విషయం లో బ్యాంక్ సిబ్బంది ఒప్పుకోలేదు .. ఇలా తిరిగి తిరిగి నాకు ఫ్లాట్స్ , రేట్లు ఇలా అన్నింటిపైనా పీహెచ్డీ కి కావాల్సినంత సబ్జెక్ట్ వచ్చింది .. ఈ ఏరియాలో ఉన్న ప్రతి రోడ్డు , ప్రతి బిల్డింగ్ పేరు కూడా చెప్పగలిగేంత సబ్జెక్ట్ పెరిగింది కానీ ఫ్లాట్ మాత్రం సెట్ అవలేదు .. శ్రీనగర్ కాలనీలోనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో పెంట్ హౌజ్ కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను . కానీ బీపీఎస్ లేకపోవడంతో రెగ్యులర్ బ్యాంకులు లోన్ ఇవ్వమని చెబితే నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లోకి వెళ్లాల్సి వచ్చింది .. ఈ తలనొప్పులు ఎందుకులే అని భయంతో డ్రాప్ అయిపోయాను .. పోనీ ధైర్యం చేసి కొద్దిగా కాస్ట్ లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామా అంటే నేను డౌన్ పేమెంట్ చేయగలిగేది కొద్ది ఎమౌంట్ మాత్రమే .మిగిలినదంతా లోన్ కే వెళ్ళాలి .. అంతా EMI పెట్టుకుంటే జీవితమంతా కట్టాల్సిందే ఇంకో ఐదేళ్ల తర్వాత ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటో తెలీదు .. అందుకే ఇల్లు కొనాలన్న ఆలోచన వదిలేసాను .. పొద్దున్నే లేచి బైక్ పై ఇళ్ల కోసం వెదికే ప్రయత్నాలు మానేశాను
ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనాలన్న ఆశల్ని వదులుకుని ఇలా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను .. చాలామంది అనుకుంటారు జర్నలిస్టులు విపరీతంగా సంపాదించేస్తారు.. అని .. కానీ అందరూ జర్నలిస్టుల విషయంలో అలా ఉండదు .. అందరు జర్నలిస్టులు ఇలా తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించలేరు .. దానికి చాలా ధైర్యం కావాలి.. ఆ ధైర్యం లేని నాలాంటి చేతగాని జర్నలిస్టులు చాలా మంది ఉంటారు .. ఇప్పటికే నామాదిరి సొంత ఇల్లు కూడా లేని జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు .. నెలాఖరుకి వచ్చే జీతం కోసం 20 వ తేదీ నుంచి ఎదురు చూసే జర్నలిస్టులు అనేకమంది ఉన్నారు .. నాలాంటి జర్నలిస్టుకు నిత్యం .. ముఖ్యమంత్రులు , మంత్రులతో మాట్లాడగలిగేంత పరిచయాలు ఉంటాయి.. నిజానికి చాలామందికి చాలా విషయాల్లో సలహాలు ఇస్తుంటాం కూడా . ఇక టీవీలో కనిపించిన ప్రభావంతో క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది .. కొన్నిసార్లు నాలాంటివాడిని బయట గుర్తు పట్టి సెల్ఫీలు దిగుతుంటారు .. కానీ మా వెనుక చూస్తే అంతా డొల్లే ఉంటుంది
… continue …