@santoshamsuresh సూరి అన్న ఎంత సేపు TFI భజన ఎమ్ చెస్త్తావు కానీ జీవితంలో ఒక్కసారైనా ప్రేక్షకుల తరపున ఇలాంటి ఒక్క ప్రశ్న TFI అడుగు 🙏🙏 లాంగ్ రన్ లో థియేటర్ లని బతికించు 🤗
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్
చిన్న సినిమాల నటులు, దర్శకులే సెలబ్రిటీలుగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో కల్కి లాంటి పాన్ ఇండియా సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సింప్లిసిటీ ఎంతోమందికి ఆదర్శంగా మారింది. నాగ్ అశ్విన్ నిర్మాణంలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ అనే సినిమా రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ నేలపై కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 94 ఏళ్ల వయసులోనూ సినిమాను డైరెక్ట్ చేసిన లెజెండరీ డైరెక్టర్ సింగీతంపై ఉన్న గౌరవంతో నాగ్ అశ్విన్ నేలపై కూర్చున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నాగ్ అశ్విన్ సింప్లిసిటీ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
#NagAshwin#SSR61#SingGeetham
@directedbykrish అన్నాయ్ బొల్డ్ కంటెంట్ కావాలంటే ఇంటర్నెట్ లో బోలెడు కంటెంట్ ఉంది ఇంక 1970,80 మూవీస్ లాగా హీరోయిన్ అందలా అరబోత మీద సినిమా తీస్తాం అంటే కుదరదు.. గ్లోబల్ మార్కెట్ లో ముందు ఉండాలి అంటే కంటెంట్ ఉండాలి
మంచి సినిమాని రివ్యూ రైటర్ లు, సోషల మీడియా ఆపలేదు.... నిజానికి రేపటినుండి #Peddi సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది....
"హీరో క్యారెక్టరైజేషన్" : మా పార్వతీపురం (మన్యం) ఏజెన్సీ జిల్లాలో పెద్ది లాంటి క్యారెక్టర్ లు ఊరికి వందమంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, ప్రపంచ జ్ఞానం ఉండదు, అచ్చంగా "పెద్ది"లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. 2026 లో ఇలా ఉంటే 1996 ఎలా ఉంటారు అనేది మనం ఊహించలేం.....
మరి ఇక్కడ మాట్లాడే చదువుకునే మేధావులు పోర్న్ చూస్తారు, హీరోయిన్ ఫోటో ను జూమ్ చేసి పార్ట్ పార్ట్ లు క్లోజ్ లో చూస్తారు, లేచిన దగ్గరనుండి అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని తిడుతూ ఉంటారు కదా???
"నిజానికి చదువు లేని పెద్ది కంటే?? చదువుకున్న ఈ మేధావులు ఏ విధంగా గొప్పోళ్ళు"???
వాడు కొండమనిషి అలాగే ఉంటాడు, నీకు ప్రూఫ్ కావాలంటే ఒకసారి సరదాగా ఉత్తరాంధ్ర తిరగేసి రా అప్పుడు ఎలాంటి సందేహాలు ఉండవు....
ఒక్కసారి ఆలోచించు "ఇంత పెద్ద కమర్షియల్ హీరో, ఇలాంటి కథ తెలుగులో చేసి ఎన్ని దశాబ్దాలు అయిందో కనీసం గుర్తుందా??"
@Vizagleader_24@directedbykrish సరే మరి పక్కన ఉన్న పాపాలు ఎమ్ పాపం చేసారు వాళ్ళకి ఇప్పక పోయారా ఓ వాళ్ళు 2099 లో ఉన్నారు అంటావు.. ఒక్కటే సలహా **యువత మేలుకో ** బానిసత్వం వదులుకో🤗 id పేరు కి నీ బానిసత్వం కి ఎమ్ సంబంధం లేదు.. నీ లాగా నేను జఫ్ఫా.. అనలేను ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ 🤗🤗
@gnrg365@directedbykrish ఒరేయ్ జఫ్ఫా..అరకు , పాడేరు మన్యం ఏరియా కి వెళ్లి చూడు రా..2005 కి ముందు అక్కడ లేడీస్ జాకెట్ లు వేసుకోరు.. సినిమా 1990 లో తీసింది రా , అప్పుడు ఇంకా దారుణంగా ఉండేవి..వైజాగ్ సిటీ లో ఒక ఊరు ఉంది..ఆది 2020 వరకు ఎవరికి తెలియదు..ఆది తెలుసా..అక్కడ ఊరు ఉంది, జనాలు ఉన్నారు అని
చరణ్ అన్న నటన మాస్టర్‌క్లాస్: వరుణ్ తేజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'పెద్ది' చిత్రంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిత్ర బృందాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా తన సోదరుడు రామ్ చరణ్ నటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే మనసును బలంగా తాకుతాయని, 'పెద్ది' తనను మానసికంగా ఎంతో కదిలించిందని వరుణ్ తేజ్ తన పోస్టులో పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్నిసార్లు కిందపడినా తిరిగి నిలబడాలనే స్ఫూర్తిదాయకమైన సందేశం ఈ సినిమాలో తనకు బాగా నచ్చిందని వివరించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక బలమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతమైన ప్రతిభతో తెరకెక్కించారని ప్రశంసించారు. అంతేకాకుండా, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. ముఖ్యంగా సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న) నటన అద్భుతంగా ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక, తన అన్న రామ్ చరణ్ నటన గురించి వరుణ్ తేజ్ భావోద్వేగభరితంగా స్పందించారు. "చరణ్ అన్నా, నీ నటన చూశాక నాకు మాటలు రావడం లేదు. 'పెద్ది' పాత్రలోకి నువ్వు పరకాయ ప్రవేశం చేసిన తీరు అమోఘం. ఆ పాత్రను సజీవంగా మలిచి, ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడం నిజంగా ఒక మాస్టర్‌క్లాస్" అని వరుణ్ కొనియాడారు. ఒక నటుడిగా తనను చరణ్ మరోసారి ఎంతగానో ఇన్‌స్పైర్ చేశాడని, అందుకు ధన్యవాదాలని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం 'పెద్ది' చిత్రంపై, రామ్ చరణ్ నటనపై వరుణ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నయ్య సినిమా విజయంపై తమ్ముడి స్పందన మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.
#PEDDI#Ramcharan#Varuntej
Am OBSESSED with OBSESSION..
Till even a few weeks before the whole industry believed that only Big starred , massive budgeted , Vfx spectacle films will pull audience into the theatres and now OBSESSION reset that BUTTON
No BIG STARS No GRAND LOCATIONS No LAVISH PRODUCTION DESIGN No FOREIGN SHOOTS No TOP TECHNICIANS and contrary to it’s reported budget of 7 cr (Indian) it’s easy to see , it’s pure making cost cannot be more than 70 lakhs minus technical fees considering it’s entirely shot in exactly 3 locations ( two rooms in a modest house, interior of a car AND interior of a small store
The directors style is visually simplistic but very unique ( I was especially struck with his use of too much head space in many shots which strangely enhances the mood )
He treats editing not just as a technical craft but as psychological weapon blending rapid cuts with especially lengthy stays (case in point is long stay on Nikki’s face in interval shot )
These kind of long takes build unbearable tension because the audience is trapped in the character’s perspective with no escape.
His cutting on sharp sound effects (a door slam, a sudden laugh, a heartbeat) to create rhythmic punctuation is awe inspiring
Barker’s editing philosophy seems to be: “Make the audience feel what the character feels, which is being unstable”
He throws out traditional editing rules (smooth continuity, clear emotional beats) in favor of something extremely anarchic
The result is a film that feels unpredictable and alive, like the editing itself is also a part of the horror.
He mostly used single source lighting and lit up spaces rather than individual shots very much like David fincher but much more effectively
More than the 179 million dollars collection so far with a less than 1 million dollar budget , what needs to be even more studied are the path breaking edit and sound design techniques not to forget CHARACTER DESIGN
@miryalasrikanth Work లో work ఆ TFI ని కొంచెం దీని గురించి కూడా ఆలోచించమనండి 🙏 లేదంటే ఇంకొన్ని ఇయర్స్ లో హార్డ్ కోర్ అభిబానులే చుసుకోవాలి థియేటర్ లో 🤗🤗
పెద్ది
ఒప్పుకుంటాను కొన్ని సన్నివేశాలు అసలు బాగాలేవు, నాకు నచ్చలేదు, అలా తీసి ఉండకూడదు, దాని పైన చాలా విమర్శలు వచ్చాయి, వాటికి సంఘీభావం తెలుపుతున్నాను. అటువంటి సన్నివేశాలను ఇగ్నోర్ చెయ్యమని, అది మంచి ప్రవర్తన కాదని కూడా మా అబ్బాయికి చెప్పాను.
ఇకపోతే “మిగతా” సినిమా అంతా గొప్పగా ఉంది. ముందుగా ఇప్పుడు వస్తున్న మిగతా తెలుగు సినిమాల్లా రోత హాస్యం, వెగటు హింస లేకుండా ఒక ప్రేరణ కలిగించే కథతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
నటులలో @AlwaysRamCharan అత్యద్భుతమైన నిబద్ధతని కనబరిచారు. ప్రతిసన్నివేశంలో ఆయన తన దేహం గురించి గానీ, ఆహార్యం విషయంలో కానీ, నటన విషయంలో కానీ తీసుకున్న ప్రతీ చిన్న జాగ్రత్త లేదా మెళకువలు బాగా కనిపించాయి. ప్రేక్షకుడిని ఆయన లోకువగా తీసుకోలేదు. అతన్ని అలా చూడాలి అనిపించింది. అయితే అతని ప్రవేశ సన్నివేశంలో వెనక నుంచి చూపించడం ఆయన నడకలో @KChiruTweets కనిపించడం ఎన్నో జ్ఞాపకాలని తోడింది.
శుభలగ్నం సినిమా నుంచి నాన్నకు ప్రేమతో మొదలుకుని నేను @IamJagguBhai సినిమాలని వేటినీ వదలకుండా చూసాను. ఈ చిత్రంలో ఆయన పాత్ర నాకు బాగా నచ్చింది, ప్రస్తుత తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు లాంటి మహామహులు వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు తీర్చగలిగేది ఈయనొక్కరే. ఆయన ఆఖరి సన్నివేశం గుండెల్ని పిండింది.
ఇకపోతే సినిమా మొత్తం నా బాల్యంతో ముడిపడిన విజయనగరం, బొబ్బిలి ప్రాంతంతో తీయడంతో నేను బాగా కథకి దగ్గరయ్యాను. ఉత్తరాంధ్ర యాసని చక్కగా చూపారు. చక్కెర కర్మాగారం బొబ్బిలిలో నేను చదివేటప్పుడు దూరంగా కనిపించే లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ పొగగొట్టాన్ని గుర్తుచేసింది. గౌరునాయుడు, అచ్చియ్యమ్మ, పెద్ది, అప్పల సూరి ఈ పేర్లు అన్నీ మా ఊర్లో ఉన్నాయి. ఎప్పుడో ఛత్రపతిలో అప్పలనాయుడు పాత్ర పేరు విని మా ఊర్లో ఒకరిపేరు ఇది అని సంతోషించిన నాకు ఇన్ని పేర్లు ఒకేసారి వినటం బాగా ఆనందం కలిగించింది. అలాగే వసతులు లేక వలసలు పోయే ఎన్నో ఉత్తరాంధ్ర ఊర్ల కథ ఇది.
అలాగే కుస్తీ ఆట విషయంలో ఉత్తరాంధ్ర చరిత్రని చెప్పటమే కాక, ఆ ఆట విషయంలో దర్శకత్వ జట్టు సునిశిత పరిశీలన కూడా బాగా నచ్చింది. కుస్తీ పట్టేవాళ్లలో ఉండే కాలీఫ్లవర్ చెవులని కూడా చూపించారు. అప్పటికి విజయనగరంలో చందన బ్రదర్స్ మాత్రమే ఉండేది కానీ సినిమాలో సీఎంఆర్ అని చూపించారు, వాణిజ్య కారణాల వలన కావచ్చు. అలాగే వెనక దుకాణాలపైన పైడితల్లి వంటి పేర్లు కనిపించాయి. గంటస్తంభం సెట్ కూడా బాగుంది. అయితే సాధారణంగా గ్రామీణ ప్రజలు ఎక్కువమంది ఇజీనగరం అని పలుకుతారు కానీ ఇక్కడి పాత్రలన్నీ విజయనగరం అని పిలుస్తారు. సినిమాలో చూపించిన క్రికెట్ ఆట ఎలాగూ మా చిన్నప్పటి మా చిన్నాన్నలు ఆడిన గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లని చూపించింది.
బోమన్ ఇరానీ పాత్ర మధ్య మధ్యలో వచ్చి చిరాకు పెట్టింది. ఇకపోతే కథానాయిక పాత్ర పూర్తిగా తీసేస్తే సినిమా ఇంకా బాగుంటుంది. రావు రమేష్ ని వాడుకోలేదు. సంగీతం అంతంత మాత్రం. నృత్యం బాగాలేదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుణ్ణు అనిపించింది. అదనపు సెంటిమెంటు సీన్లు ఉన్నాయి.
దివ్యేందు పాత్రకి న్యాయం చేసారు. పోరాటాలు బాగున్నాయి. చిత్రణ బాగుంది. ఎక్కువగా ఏఐ వాడలేదు. డూపులు కూడా వాడినట్లు కనపడలేదు. కథ ఊహించదగినదిగా ఉన్నప్పటికీ కథనం బాగుంది. ఈ ఎవడో రావడం, ఎంక్వయిరీ చెయ్యటం, దానికి ఇంకొకడు ఫ్లాష్బ్యాక్ చెప్పటం ఇక ఆపేస్తే బాగుంటుంది. తక్కువ పాత్రలు పెట్టుకుని వాటికి మంచి సంభాషణలు రాసుకుంటే బాగుంటుంది. క్రీడ నేపథ్యంలో కథ రాసుకోవటం అన్నింటికన్నా నచ్చిన విషయం. చూసే పిల్లలకు ఒక ప్రేరణ కావచ్చు.
తెలుగు భాషా ప్రేమికుడిగా ఒకవైపు ఉత్తరాంధ్ర యాసను బాగా చూపారు అని సంతోషిస్తూనే ఒక్క నిర్మాత తప్ప ఎవ్వరి పేరూ తెలుగులో వేయలేదు అన్న బాధ కలిగింది.
కథానాయకుల చేత ఆ బీడీలు, బీరు సీసాలు తాగించడం మానండిరా బాబు.
మొత్తానికి సినిమా నాకు బాగా నచ్చింది.
@sairaaj44 కరెక్ట్ పాయింట్ కి వచిర్రు ఇప్పుడు చాలా మంది మధ్య తరగతి, కామన్ ఆడియన్ లు మనకు ఈ రొట్ట రొటీన్ రోత మూవీకి 300 నుంచి 600 ఒక్కరికి ఒక్క మూవీకి **కిట్టుబాటు** కాదు సరాసమైన ధర కాదు అని మూవీని థియేటర్ లో చూడటం stop చేసారు..
@gnrg365 సినిమా సంగతి పక్కన పెడదాం..మనకు కిట్టుబాటు కాదు అనుకున్నది.. సరైన..సరసమైన ధర కాదనుకున్నది మీరు కొంటారా?
సినిమా దగ్గర మాత్రం ఎందుకు రగడ..పక్కన పెడితే సరి కదా
ఓటిటి ఆప్షన్లు వున్నాయి కదా
@pepparsalt9 నువ్వు పెద్ద భజన లాల్ లా ఉన్నారు.. భజన భజన..
ఇన్ని రోజులు అంటే ఓ 5ఇయర్స్ back మీ విజినారి బాబు అనుకుంటా cm..ఉమ్మడి రాష్ట్రము లోను విజినారి బాబు cm గ ఉన్నాడు క్యా కరెంగా 🤗🤗 కరెంటు ఇవ్వలేదా 🤗
పెద్ది చూస్తున్నంత సేపు ఎంతమందికి పవన్ కళ్యాణ్ గుర్తు వచ్చారు? ఆరోజుల్లో పవన్ లాంటి నాయకులు ఉంటే పెద్దిగాడి ప్రయాణం అంత కష్టం అయ్యేది కాదేమో.
ఈరోజు పవన్ కళ్యాణ్ కరెంట్ ఏంటో తెలియని గ్రామాలకి కరెంట్ ని తీసుకెళ్ళాడు, రోడ్డు అంటే ఏంటో తెలియని గ్రామాలకి రోడ్లు వేయించాడు. ఆయన శాఖలో ఆయన చెయ్యగలిగింది మొత్తం అలాంటి గ్రామాలని వెదికి పట్టుకొని మరీ అభివృద్ధి చేస్తున్నాడు. రవాణా ఉంటేనే ఏ గ్రామం అయినా అభివృద్ధి అవుతుంది అని బలంగా నమ్మినోడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ లాంటోడు రైల్వే మినిస్టర్ అయితే పెద్ది లాంటోడు అంత కష్టపడాల్సి వచ్చేది కాదేమో. అప్పల సూరి లాంటోడు చనిపోయేవాడు కాదేమో.
@pawankalyan@AlwaysRamCharan@BuchiBabuSana#Peddi
@NaaPerupraveen@UgavanthV పోద్ది సినిమా కి వద్ధం ఒక్కరిని చూపించు ఆ కాలంలో..ఈ కాలంలో ఎవరు అలా బట్టలు ఇప్పుకొని..ఎధ ని గాల్లో కి లేపుకుని తిరగరు.
బోల్డ్ కంటెంట్ కావాలంటే ఇప్పుడు ఇంటర్నెట్లో బోలెడు ఉంది
అందరికి ఆ బోల్డ్ కంటెంట్ మూవీ లో అవసరం లేదు ఈ రోజుల్లో
ఎందుకు పెట్టావు అంటే బచ్చి అంటాడు ఆడియన్స్ కోసం
@gnrg365@UgavanthV సినిమా ఎవ్వరైనా బాగుండాలి అని తీస్తారు. కానీ అది ఆడుతుందా, అడదా అని రిలీజ్ అయ్యాకే చెప్పగలం. టికెట్ ధర అంటావా మన ఫ్యాన్స్ ఏ ఒప్పుకోరు రికార్డులు రావు అని. కానీ డబ్బు ఉన్నోడు కూడా రివ్యూలు చూసి పోతున్నాడు సినిమాకు.ఒక రోజు ముందే సినిమా బాగాలేదు అని చెప్తే వెళ్ళే వాడు కూడా వెళ్ళడు.
@NaaPerupraveen@UgavanthV రివ్యూ ఎందుకు చూస్తుర్రు బోకు రొటీన్ రోత మూవీ లు ఎక్కువ తీయడం వల్ల ఇంకోటి రివ్యూ బాగుంది అంటే కూడా maximum ఎవడు పోవడం లేదు.. ఈ అధిక ధరలు టికెట్📈📈 కి కాంటీన్📈📈 రేట్స్ కి థియేటర్ worst మెయింటనెన్స్ కి. రేట్ నార్మల్ గ పెట్టు ప్లాప్ మూవీకి కూడా మినిమం అక్క్యూపెన్స్ ఉంటాది
పెద్ది కి రివ్యూ అక్కర్లేదు. బుచ్చి డైరెక్షన్ ని జడ్జ్ చేసేంత, చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడేంత, ARR మ్యూజిక్ ని రివ్యూ చేసేంత విషయం ఇక్కడ ఎవరికీ లేదు. బయటకి వచ్చి చెపుతున్న వారు సినెమా చూశాక వారికి కలిగిన అనుభూతి మాత్రమే. బొక్కలు వేరే వాళ్ళు వారికి ఒక మనిషి మీద లేదా ఒక ఫామిలీ మీద ఉన్న అసూయ, ద్వేషం బయటకి చూపించడం.
#Peddi
బుచ్చి బాబు కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్.
'కథ రెడీ చేస్కో... రెండో సినిమా చేద్దాం'
అని మాట ఇచ్చిన చరణ్.
సుకుమార్ సినిమా తరవాత మళ్ళీ ఈ కాంబో చూసే అవకాశం.
పెద్ది: బుచ్చిబాబు తేలిగ్గా దొరికాడా..? ఇతర సినిమాల్లో బోల్డ్ సీన్స్ మాటేంటీ..?
Read more here: telugubulletin.com/telugu/peddi-f…
ఎవరికైనా కొన్ని సన్నివేశాలు నచ్చకపోవచ్చు. వాటిని విమర్శించే హక్కు అందరికీ ఉంది. కానీ ఇక్కడ ప్రశ్న ఆ విమర్శల గురించి కాదు... వాటి స్థిరత్వం గురించి.
అసలీ సినిమాకు హీరోయిన్ అవసరం లేకుండా కూడా ఇంకా కన్విన్సింగ్ మూవీ ఇవ్వగలడు బుచ్చిబాబు. కానీ, ఇప్పుడు విమర్శించేవాళ్లే హీరోయిన్ లేకుండా సినిమానా అంటారు. ఒకవేళ హీరోయిన్‌ను నార్మల్‌గా చూపినా హీరోయిన్‌ను మరీ డీగ్లామర్‌గా తీశాడు అని అంటారు.
బుచ్చిబాబు సినిమాకే ఈ రూలా??? ఇంతకంటే దారుణమైన సీన్లు ఏవీ ఏ సినిమాలోనూ లేవా? ‘పుష్ప’లో అల్లు అర్జున్-రష్మిక మధ్య మారుతీ వ్యాన్ సన్నివేశం.., నీళ్లలో రష్మిక ఆటలాడే సన్నివేశం.., షారుఖ్ ఖాన్ ‘పఠాన్’లో దీపికా పడుకునే చేసిన అల్ట్రా గ్లామర్ రోల్.., ఎన్టీఆర్ దేవరలోనూ జాన్వీ కపూర్ గ్లామర్ సీన్, ఎన్టీఆర్-హృతిక్ వార్-2లో కైరా అద్వానీ బికినీ సీన్, అర్జున్ రెడ్డి బోల్డ్ సీన్స్, యానిమల్ మూవీలో ఎవరెవరు పాటలో హై ఎండ్ బోల్డ్ సీన్స్.. ముద్దు సీన్స్, ఏకంగా బెడ్ పై రణబీర్-త్రిప్తి డిమ్రి సన్నివేశాలు కళ్లార్పకుండా చూసినవాళ్లు లేరా? మరి, ‘పెద్ది’లో సన్నివేశాలనే ఎందుకు తప్పుబడుతున్నట్టు. అప్పుడు ఎవరూ మాట్లాడ లేదే?
ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈరోజు “పెద్ది”పై వస్తున్న ఈ విమర్శల ప్రమాణం రేపు విడుదలయ్యే ఇతర పెద్ద చిత్రాలకు కూడా వర్తిస్తుందా? అక్కడ కూడా ఇదే స్థాయి చర్చ జరుగుతుందా? అలా అయితే ఎలాంటి సమస్య లేదు. కానీ ప్రమాణం సినిమా బట్టి, హీరో ని బట్టి, క్యాంప్ ని బట్టి మారితే ప్రేక్షకులు విమర్శలను కాదు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు.
మరి ‘యానిమల్’ సినిమాలో సీన్స్? ఇదే సందీప్ రెడ్డి వంగా అయితే “ఉమెన్ ఆబ్జెక్టిఫయింగ్ ఎక్కడుంది? నేనైతే తీయలేదు.. మీరు చూస్తున్నారు అంతే” అని సమాధానం చెప్పేవాడు. కానీ ఇక్కడుంది బుచ్చిబాబు. సాఫ్ట్ టార్గెట్ అయి సారీ చెప్పాడు. లేదంటే, సారీ చెప్పడానికి ఏం లేదు అక్కడ.
అయితే చివరికి ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. మనం నిజంగా సినిమాను మొత్తం చూస్తున్నామా? లేక ముందే నిర్ణయించుకున్న అభిప్రాయానికి సరిపోయే భాగాలను మాత్రమే ఎంచుకుని మాట్లాడుతున్నామా?
విమర్శలు అవసరం. ప్రశ్నలు కూడా అవసరం. కానీ ఒకే ప్రమాణం అందరికీ వర్తించినప్పుడే వాటికి విలువ ఉంటుంది.
కొసమెరుపు ఏంటంటే... ప్రేక్షకులు “పెద్ది”లో స్ఫూర్తిని చూశారు. రామ్ చరణ్ నటనను చూశారు. భావోద్వేగాన్ని చూశారు. ఒక మనిషి మార్పును చూశారు. కానీ కొందరు మాత్రం వారు వెతుక్కోవాలనుకున్నదే వెతికి పట్టుకున్నారు.
అందుకే అంటారు...
కొన్నిసార్లు సమస్య తెరపై ఉండదు. దాన్ని చూసే కళ్లలో, దాన్ని అర్థం చేసుకునే మనసులో ఉంటుంది.
#Peddi#RamCharan#BuchiBabuSana#Tollywood#TeluguCinema#PeddiSuccess#JanhviKapoor@AlwaysRamCharan@NimmaShivanna#JanhviKapoor@BuchiBabuSana@arrahman@RathnaveluDop@artkolla@NavinNooli@bomanirani@IamJagguBhai@divyenndu@vriddhicinemas@VenkataSKilaru@gautamkalidindi@MythriOfficial@SukumarWritings#JyotiDeshpande@jiostudios@ivyofficial2023@Tseries@thinkstudiosind@PeddiMovieOffl
విడికి ఉన్న knowledge లో 50% ఉన్న బాగుండు copyrights వేయించే వాళ్ళకి.
first time upload చేసిన వీడియో కంటే delete చేశాక Re-Upload చేసిన వీడియోకే ఎక్కువ reach వచ్చింది.
ఇదే నేను చెప్పేది ఎందుకు మీరు Barbell గాడికి అంత attention ఇస్తారు ?
చూసి వదిలేయొచ్చు కదా ?
వాడి రివ్యూస్ జనాలు టైం పాస్ కోసమే చూస్తారు, serious గా పట్టించుకోరు.
ఎన్ని మూవీస్ కి నెగటివ్ గా ఇవ్వలేదు ?
ఆ సినిమాలని జనాలు చూడటం మానేసారా ?
అప్పుడు అయితే ఎవరు copyrights వేయలేదు Ramcharan కి manchi feedback ఇచ్చాడు.
ఇప్పుడు అయితే #PEDDI వాళ్ళు copyrights వేస్తున్నారు.
ఇలా కాపీరైట్స్ వేసి వాడ్ని మూవీ టీమ్ వాళ్ళే పెద్దోడ్ని చేస్తున్నారు.🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
@UgavanthV బ్రో ఒక్కటి గుర్తు పెట్టుకో ఇక నుండి ప్రతి రివ్యూ ఇచ్చేవాడికి ఇదే జరగాలి. నిజమైన సినిమా ప్రేక్షకుడు థియేటర్స్ కు ఎందుకు రావడం లేదో తెలుసా,YT లో రివ్యూ చూసి డిసైడ్ అవుతున్నాడు.OTT లో చూద్దాం లే అనుకుని. థియేటర్ కు పోతేనే కదా బాగుందో లేదో తెలిసేది. కనీసం ఎక్కడికైనా పోవాలి కదా.