🐆 Euphoria Oopuloo ᴼᴳ
6.6K posts

🐆 Euphoria Oopuloo ᴼᴳ
@hungryceetah
Euphoria Oopuloo ato ito sagudham..... #PawanKalyan #Janasena ✊








This video enni sarlu repeat esaano Everything is relatable every word is matched those words helped me a lot





Tollywood Blockbuster Files : #Desamuduru ఒక్క సినిమా… ఒక్క ట్రాన్స్‌ఫర్మేషన్… అల్లు అర్జున్ రేంజ్ మార్చేసింది🔥 సినిమా రంగంలో సక్సెస్ అవ్వడంతో పాటు తమకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. దానికోసం అహర్నిసలు శ్రమించాలి. అహోరాత్రులు కృషి చేయాలి. దానికి ఖచ్చితంగా తగిన ఫలితం ఉంటుంది. అందుకు ఒక ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఒక సినిమా కోసం తను పడ్డ కష్టమే బన్నీని ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంచడానికి పునాది వేసింది. ఆ సినిమానే దేశముదురు. అది 2003 శివమణి షూటింగ్ ....సుమంత్ కోసం ఏదైనా స్టోరీ రెడీ చేయ్ చేద్దామని చెప్పారు #Nagarjuna . ఒక లైన్ ఉంది సార్ అని వినిపించి తర్వాత సుమంత్ ని కలిసి బ్రీఫ్ గా స్టోరీ చెప్పారు పూరి జగన్నాథ్. ' ఇది నాకు సెట్ అవదు " అని చెప్పేసాడు సుమంత్. 2006 పోకిరి ఇండస్ట్రీ హిట్. పూరి జగన్నాథ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. #Chiranjeevi #Prabhas లు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు తమతో సినిమా చేయమని. కానీ పూరీ మాత్రం ఇంత పెద్ద హిట్ తర్వాత నెక్స్ట్ మూవీ మీద అంచనాలు మాములుగా ఉండవు , సో ముందు ఒక మామూలు సినిమా చేసి తరువాత బిగ్ ప్రాజెక్ట్ జోలికి వెళ్తాం అనుకున్నారు. శ్రీకాంత్ హీరోగా మిస్టర్ శ్రీకాంత్ అనే మూవీ అనౌన్స్ చేశారు. అది రెండు నెలల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు . మరోవైపు ...హ్యాపీ ఫెయిల్యూర్ తర్వాత ఏ మూవీ ఒప్పుకోలేదు బన్నీ . మూడు హిట్స్ తర్వాత ఒక ఫ్లాప్ రావడంతో ఈసారి చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలని తమిళ్లో అప్పటికే రిలీజ్ అయి హిట్ అయిన శివకాశి మూవీని రీమేక్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఆర్య తర్వాత పూరితో సినిమా చేయాలనుకున్నాడు బన్నీ ..కానీ కుదరలేదు . ఇప్పుడు శివకాశి రీమేక్ చేయాలనుకునే టైంలో పూరి జగన్నాథ్ నుంచే సినిమా చేద్దాం అనే ఆఫర్ వచ్చింది. బన్నీ వెంటనే ఓకే చెప్పేసాడు ..శివకాశి రీమేక్ పక్కనపడేసారు . ఇక కథ కావాలి . వైజాగ్ లో బన్నీ మూవీ గురించి స్టోరీ సిట్టింగ్ జరిగింది. తన టీం తో ఎలాంటి కథ అయితే బాగుంటుందని డిస్కస్ చేస్తుంటే ఎప్పుడో సుమంత్ కు చెప్పిన కథ గుర్తొచ్చి దాన్నే డెవలప్ చేద్దాం అన్నారు పూరి. ఒక క్రైమ్ రిపోర్టర్ ఒక న్యూస్ కవరేజ్ కోసం నేపాల్ వెళ్లి అక్కడ ఒక లేడీ సన్యాసిని చూసి ఇష్టపడడం తర్వాత ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని తనని సేవ్ చేయడం అనేది కాన్సెప్ట్. హీరో క్యారెక్టరైజేషన్ అంతా చేంజ్ చేసి నేపాల్ బ్యాక్ డ్రాప్ బదులుగా హిమాచల్ ప్రదేశ్ నేపథ్యం పెట్టేశారు. కథంతా ఒక కొలిక్కి వచ్చింది. అల్లు అర్జున్ కీ నచ్చేసింది . అప్పట్లో బాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ అనేది సెన్సేషనల్ న్యూస్. షారుక్, సల్మాన్‌లు ఈ సిక్స్ ప్యాక్ చేసి ట్రెండ్ క్రియేట్ చేయగా సౌత్ లో ఇంకా ఎవరు ట్రై చేయలేదు. సౌత్ హీరోలకు అంత సీన్ లేదని ఓ హీరోయిన్ పబ్లిక్ గా కామెంట్ చేసింది కూడా. ఇది అల్లు అర్జున్ మనసులో బలంగా నాటుకుపోయి టైం కోసం ఎదురు చూస్తున్నాడు. పూరీ గారు కథ చెప్పాక ఇందులో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అడిగాడు బన్నీ. చేస్తే ఎక్సలెంట్ కానీ అది చాలా కష్టం కదా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని విన్నాను అని చెప్పాడు పూరి. నేను రెడీ, ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నా, త్రీ మంత్స్ లో వర్కవుట్ చేస్తా అని బన్నీ చెప్పడంతో పూరి కూడా సరేనన్నాడు. ఈలోపు శ్రీకాంత్ మూవీ ఫినిష్ చేద్దాం అనుకుంటే ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో పూరి ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వేశారు. వన్ మంత్ తర్వాత తిరిగివచ్చి బన్నీని కలిస్తే తనలో చాలా చేంజ్ వచ్చేసింది. అలానే జుట్టు కూడా పెంచమని చెప్పారు పూరి. బ్యాంకాక్ వెళ్లి 15 రోజుల్లో డైలాగ్ వర్షన్ సహా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొచ్చారు పూరి. ఇక ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అందరినీ ఈజీగా ఎంపిక చేసుకున్నారు కానీ హీరోయిన్ దగ్గర చాలా మందిని లుక్ టెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కు ఒక సెంటిమెంట్ ఉండేది. కొత్త హీరోయిన్ తో చేస్తే సినిమా హిట్ అని. అలా కాకుండా ఆల్రెడీ పేరున్న హీరోయిన్ తో చేస్తే ఫలితం హ్యాపీ మూవీలా ఉంటుందని తన నమ్మకం. అందుకే కొత్త హీరోయిన్ కోసం ముంబైలో వేట మొదలు పెట్టారు పూరి. బాలనటిగా పేరు తెచ్చుకొని యాడ్స్ చేస్తున్న హన్సిక అయితే బాగుంటుందని ఆమెను కలిశారు. అప్పటికీ తన వయసు 16 సంవత్సరాలు. దాంతో వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. పూరి కథంతా చెప్పి ఎట్టకేలకు ఆమెను ఒప్పించారు. దాంతో అతి చిన్న వయసులో హన్సిక తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్, పోకిరి మూవీస్ కు మిస్ అయిన తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ చక్రీనే ఈ సినిమాకు తీసుకున్నారు. టైటిల్ దేశముదురు . పక్కా పూరి జగన్నాథ్ స్టైల్ లో ఉండే టైటిల్. అలా 2006 జూన్ 18న పూరి జగన్నాథ్ ఆఫీస్ లో దేశముదురు ముహూర్తం జరిగింది. ఇంకో పక్క బన్నీ రోజుకు నాలుగు గంటల పాటు వర్కవుట్స్ చేస్తూ స్టైలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ అనుకున్న టైంలోనే సిక్స్ ప్యాక్ బాడీ సాధించాడు. అతని కమిట్మెంట్ కు పూరి జగన్నాథ్ ఆశ్చర్యపోగా ఆ లాంగ్ హెయిర్, బాడీ షేప్ చూసి మిగతా అంతా షాక్ అయ్యారు. సౌత్ లో సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ హీరోగా రికార్డ్ అండ్ ట్రెండ్ క్రియేట్ చేసి నేషనల్ మీడియాలో సైతం ప్రశంసలు పొందాడు బన్నీ . అలా జూలై 14, 2006లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది దేశముదురు. హైదరాబాద్ ఆర్ఎఫ్సీ,, అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్ లో కొంత భాగం షూటింగ్ జరుపుకోగా వైజాగ్ లో కొన్ని సీన్స్ చిత్రీకరించారు. హిమాచల్ ప్రదేశ్ లో , మనాళి చుట్టుపక్కల , ఉత్తరాంచల్లో 40% షూటింగ్ జరిగింది. క్లైమాక్స్ ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారు. అలా 72 వర్కింగ్ డేస్ తో డిసెంబర్ 20 కల్లా షూటింగ్ పూర్తి చేసుకుంది దేశముదురు. బడ్జెట్ 10 కోట్లు. డిసెంబర్ 25 ఆడియో రిలీజ్ చాలా కలర్ఫుల్ గా జరిగింది. నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చారు. చక్రీ కంపోజ్ చేసిన సాంగ్స్ బంపర్ హిట్స్ అయ్యాయి. “సత్తే ఏ గొడవ లేదు” అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది. అలా 2007 జనవరి 12న అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీగా 500 థియేటర్లలో రిలీజ్ అయింది దేశముదురు. పూరి జగన్నాథ్ క్రేజ్, బన్నీ స్టైలిష్ అవతార్ తో ఈ సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. పక్కనే ప్రభాస్ యోగి భారీగా రిలీజ్ అయి టఫ్ కాంపిటీషన్ గా నిలిచింది. అందరికీ బన్నీ సిక్స్ ప్యాక్ చూడాలనే ఉత్సుకత. అది తన ఇంట్రడక్షన్ తోనే చూపించి విజిల్స్ వేయిస్తాడు అల్లు అర్జున్. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా హీరో ఒక సన్యాసిని ప్రేమలో పడడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. బన్నీ ఎంట్రీ సీన్, వేణుమాధవ్ ఎలివేషన్స్, వినాయకుడితో బన్నీ కాన్వర్సేషన్, హిమాలయాల్లో హీరోయిన్ సీన్స్, , ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ ఫైట్, విలన్ కు బన్నీ అడ్రెస్ చెప్పే సీన్, క్లైమాక్స్... హైలైట్స్ గా నిలిచాయి. అక్కడక్కడ వచ్చే అలీ కామెడీ సీన్స్ కడుపుబ్బ నవ్వించాయి. అల్లు అర్జున్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మానరిజం, డాన్స్, ఫైట్స్ అన్నిటిలో అదరగొట్టాడు. అంతకుముందు సినిమాలతో పోలిస్తే దేశముదురులో బన్నీకి డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. తన సిక్స్ ప్యాక్ ఒక సెన్సేషన్ అయింది. చాలా మంది హీరోలు అదే బాడీ షేప్ ట్రై చేశారు. తన హెయిర్ స్టైల్, కార్గో ప్యాంట్స్ యూత్ లో కొత్త ట్రెండ్ సృష్టించాయి. ఈ సినిమాతో ఆర్యతో వచ్చిన స్టార్ డం కంటే డబుల్ స్టార్డం వచ్చింది. ఎంతో మంది ఫ్యాన్స్ ని తెచ్చింది. “స్టైలిష్ స్టార్” అనే బిరుదుకు పునాది వేసింది దేశముదురు. సినిమా అంతా బన్నీ స్టైలింగ్, పూరి టేకింగ్ మాత్రమే కనబడుతుంది. పగలబడి నవ్వించే కామెడీ మరో ఎసెట్. తెలంగాణ శకుంతల ఏడుస్తుంటే రఘుబాబు అనువాదం చేసే సీన్స్ హిలేరియస్. అలీ కామెడీకి పొట్ట చెక్కలు అవుతాయి. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు వేసుకుంది హన్సిక. తన గ్లామర్, క్యూట్ లుక్స్ తో యూత్ ని ఆకట్టుకుంది. ప్రదీప్ రావత్, అజయ్, సుబ్బరాజు తమ విలనీతో మెప్పించారు. పూరి జగన్నాథ్ తన డిఫరెంట్ టేకింగ్ తో సినిమాను ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దారు. బన్నీని కొత్తగా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. డైలాగ్స్ అయితే పీక్స్—“నేను ఇక్కడ తంతే రీసౌండ్ ఉదర్ ఆతా”, మట్టి డైలాగ్ , “నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే రీచార్జ్ చేయించు”—ఇలాంటి డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టించాయి. చక్రీ సాంగ్స్ మరో హైలైట్—“సత్తే ఏ గొడవ లేదు”, “నిన్నే నిన్నే”, “గిలిగిలిగా”—ఇవి అన్నీ డాన్స్ నెంబర్స్ గా సూపర్ హిట్ అయ్యాయి. రంభ ఐటం సాంగ్ కూడా అలరించింది. ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న దేశముదురుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే—500 థియేటర్లలో రిలీజ్ అయి మొదటి వారం 12 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 243 సెంటర్లలో 50 రోజులు, 129 సెంటర్లలో 100 రోజులు ( డైరెక్ట్ + హిప్ట్ ) ప్రదర్శించబడింది. హైదరాబాద్ సుదర్శన్ లో 175 రోజులు ఆడి కోటి 12 లక్షల గ్రాస్ వసూలు చేయడం మరో రికార్డ్. మొత్తం 24 కోట్ల షేర్ తో బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటికి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కేరళలో కూడా సూపర్ హిట్ అయి అక్కడ బన్నీ రేంజ్ పెంచింది. అల్లు అర్జున్ కెరీర్ లో తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్స్ వచ్చినా—తన స్టార్‌డమ్ ని, తన స్టైల్ ని, తన ఫ్యాన్ బేస్ ని నిర్మించిన ట్రెండ్ సెట్టర్ మాత్రం దేశముదురే.బన్నీ ఫ్యాన్స్ కి ఈ మూవీ ఎప్పటికీ స్పెషల్. #AlluArjun #AA22












