మహా యజ్ఞంలా విత్తన బంతుల తయారీ, పంపిణీ
•2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీకి అటవీ శాఖ ముమ్మర సన్నాహాలు
•జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా హరిత సమరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పర్యావరణ సమతుల్యతను అందించడం కోసం ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ హరిత సమరంలో భాగంగా జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. వర్షాకాలం సీజన్‌ను పూర్తిగా వినియోగించుకుంటూ జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందుకోసం మూడు రకాల ప్రత్యేక పద్ధతులను ఉపయోగించనున్నారు. నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ల సాంకేతికత ఉపయోగించడం, చేతులతో నాటడం చేస్తారు. అడవులలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిణామాన్ని మెరుగుపరచడం, పర్యావరణ స్థిరత్వం, పచ్చదనాన్ని పెంచడం, వాతావరణ మార్పులను సమర్థవంతంగా తట్టుకునే విధంగా స్వచ్ఛమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడం కోసం ఈ హరిత ఉద్యమం ప్రధాన లక్ష్యం. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులకి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “మనం చల్లే ప్రతి విత్తన బంతి.. మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ. రాబోయే తరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు మనమంతా చేతులు కలుపుదామ”ని పిలుపునిచ్చారు.
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “
ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️
Love you Kalyan ❤️❤️❤️
#Mega158#ChiruBobby2 begins ✨
@dirbobby#VenkatKNarayana@KvnProductions
పల్లె ప్రగతికి పారదర్శక సర్వే
- తద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గుర్తింపు
- పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం
జియో ట్యాగింగ్ తో రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్
- పల్లె పండుగ 1, 2 ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన
- గిరిజన ప్రాంతాలకు మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరణ
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే 2వ విడతలో 2,750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే ఎక్కువగా 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాం. మొదటి విడతలో 22,500 గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గానూ 22,514 పూర్తి చేశాం. రెండవ విడతలో 15 వేల లక్ష్యానికి గానూ 15,303 గోకులాలు నిర్మించాం. పశువుల తాగునీటి అవసరాల కోసం 15 వేల లక్ష్యానికి గానూ 15,188 నీటి తొట్టెలు నిర్మించాం. మొదటి విడతలో 20 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 21 వేలు పూర్తి చేశాం. రెండవ విడతలో ఈ పనులను భారీగా పెంచి, 81 వేలు లక్ష్యానికి గానూ 86 వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించాం. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
•మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరించాలి
గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలి. నల్లరేగడి నేలలు, డెల్టా ఏరియాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి, అక్కడి భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించాలి. కొండలు, గుట్టలతో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ పనులు చాలా కాలం మన్నేలా, శాస్త్రీయంగా ఉండటం కోసం నిపుణులైన ఇంజనీర్లు, పారిశుధ్యం-ప్రజారోగ్య నిపుణులు సలహాలు, సూచనలు కచ్చితంగా తీసుకోవాలి.
•రోడ్ల నాణ్యతపై రాజీపడొద్దు
గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నేలా ఉండాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. నాణ్యత లోపిస్తే సహించేది లేదు. సీసీ రోడ్డు వేసిన తర్వాత ఇరువైపులా అలాగే వదిలేయకుండా, మట్టితో పక్కాగా వాలు చేయాలి. వాలు చేయకుండా వదిలేస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశంతోపాటు వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్డు అంచులు త్వరగా పాడైపోతాయి. పల్లె ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే లక్ష్యంగా రోడ్లకు జియో మానిటరింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చాం. రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ పెట్టేందుకు ఈ డిజిటల్ పద్ధతి సహాయపడుతుంది. ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఎంతవరకు రోడ్డు పనులు జరిగాయో శాటిలైట్, జియో-ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చు. ప్రజలు కూడా రోడ్ల యొక్క ప్రస్తుత స్థితిగతులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. (1/2)
పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం..!
* స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి
* రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు
* స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం
* పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్లు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటులో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి
•రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయం
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి. ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ శ్రీ బాలునాయక్ పాల్గొన్నారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందర్నీ తన సొంత కుటుంబంలా చూసుకుంటారని @IamNiharikaK గారు పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 300కి పైగా ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేయడమే అందుకు నిదర్శనం అని, ప్రజల సమస్యల పట్ల సకాలంలో స్పందించే ఆయనకి ఆయనే సాటి అని అభిప్రాయపడ్డారు.
#PawanKalyanTransformsAP#Chapter10
ఒక నాయకుడిలో ప్రజలు కోరుకునేది స్పందించే హృదయం. అలాంటి స్పందించే అందరికంటే ఎక్కువ నేను మన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిలో చూశానంటున్నారు ప్రముఖ నటుడు శ్రీ @AdiviSesh గారు. సమస్య విన్నవెంటనే స్పందించే తత్వం ఆయనకి మాత్రమే సొంతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని స్పష్టం చేశారు.
#PawanKalyanTransformsAP#Chapter9