
gowrisankar
1.8K posts

gowrisankar
@sankar2178
Honest reviews/reactions only. Nothing fake here




‘కవి పేరరసు’ వైరముత్తు గారికి అభినందనలు ప్రముఖ తమిళ కవి, సినీ గీత రచయిత ‘కవి పేరరసు’ వైరముత్తు (@Vairamuthu) గారు జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన తరుణంలో వారికి నా హృదయపూర్వక అభినందనలు. తమిళ సాహిత్యంలో శ్రీ వైరముత్తు గారికి ప్రత్యేక స్థానం ఉంది. సినీ గీత రచయితగానే కాకుండా కవితలు, నవలలు రచించారు. ఆయన రచనల్లో సామాజిక స్పృహ, మానవ సంబంధాలలోని సున్నితత్వాన్ని చూపిస్తారు. సినీ గీత రచయితగా ఏడు జాతీయ సినీ పురస్కారాలు అందుకొన్న ఘనత ఆయన సొంతం. జ్ఞానపీఠ్ పురస్కారంతో శ్రీ వైరముత్తు గారి సాహితీ సేవలకు విశిష్ట గుర్తింపు దక్కింది. శ్రీ వైరముత్తు గారికి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషాలు దక్కాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. - @PawanKalyan @PMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada @pibchennai
































