Anil Kumar B(+) 🚩

24.9K posts

Anil Kumar B(+) 🚩

Anil Kumar B(+) 🚩

@set_2_rise

#పవన్ కళ్యాణ్ #జనసేన || Civil Engineer by profession || against anything that kills People or Destroys the planet we live on.

Earth, Milkyway Galaxy Katılım Mayıs 2010
289 Takip Edilen109 Takipçiler
Anil Kumar B(+) 🚩 retweetledi
phani.💖💜💕
phani.💖💜💕@phani0653857706·
#YSRCriminalParty దీనిని డైవర్ట్ చేయటానికి సుగాలి ఇష్యూ తీసుకు వచ్చాడు జగన్ 💦💦💦
phani.💖💜💕 tweet media
తెలుగు
1
42
97
1.1K
Anil Kumar B(+) 🚩 retweetledi
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 2రోజుల రాజమహేంద్రవరం పర్యటనను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, కీలక విషయాలు వెల్లడించాను. ఇందులో భాగంగా...గౌరవ ఉప ముఖ్యమంత్రి & జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలు, ఆదేశాలను శిరోధార్యంగా స్వీకరిస్తూ గోదావరి కాలుష్య నివారణపై కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. ప్రజల ఆరోగ్యం, గోదావరి పవిత్రత విషయంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే డిప్యూటీ సీఎం గారు కొన్ని కీలక సూచనలు చేశారు. నాయకుడి ఆలోచనకు తగ్గట్టుగా, శాఖా మంత్రిగా ఆ సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే...రాజకీయ కాలుష్యం కాదు! శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భాగంగా నల్లాఛానల్ నుండి గోదావరిలోకి డిశ్చార్జ్ అవుతున్న నీరును, కలుషితం అవుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో గోదావరి కాలుష్య నివారణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) ను నోడల్ ఏజెన్సీగా చేస్తూ, వివిధ శాఖల అధికారులతో కూడిన 'స్పెషల్ టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న 24 గంటలలోపే ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారి పేరుతో సంబంధిత జీవో కూడా విడుదలయింది. కూటమి ప్రభుత్వంలో మాట లానే యాక్షన్ కూడా అంతే స్పీడ్ గా ఉంటుంది. నదులను కలుషితం చేస్తున్న కారకాలను గుర్తించేందుకు త్వరలోనే సమగ్రమైన 'పొల్యూషన్ ఆడిట్' నిర్వహిస్తాం, ఇది నిరంతర ప్రక్రియగా ప్రతిసారి జరుగుతుంది. గోదావరిలోకి మురుగు నీరు, రసాయన వ్యర్థాలు విడుదల చేసే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవు. ప్రజల ఆరోగ్యం, గోదావరి పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తున్నాను. ముఖ్యంగా 'ఆంధ్రా పేపర్ మిల్లు' వ్యర్థాల తీవ్రతపై ఇప్పటికే పలుదఫాలు చర్చించాం. ఎఫ్ లెంట్ ట్రీట్ మెంట్ చేసే గోదావరిలోకి నీళ్లు వదులుతున్నామని మాకు దొంగమాటలు చెబుతున్నారు. నిన్న స్వయంగా డిప్యూటీ సీఎం గారు, మేము కళ్లారా చూసి నీటి గాఢతను చెక్ చేస్తే పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉంది. మీరెంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో నిన్నటి ఘటన చూస్తే స్పష్టమవుతోంది. మున్సిపాలిటీకి ఆంధ్రా పేపర్ మిల్లు కట్టాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను నేటికీ కట్టలేదు, పలుమార్లు హెచ్చరించినా వారి నుండి సమాధానం లేదు. ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదు, నిబంధనలు పాటించకపోతే చట్టప్రకారం నేరుగా జైలుకు పంపే తీవ్రమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నాను. 2027 గోదావరి మహా పుష్కరాలను కాలుష్య రహితంగా, ప్లాస్టిక్ ఫ్రీగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రూ.8,500 కోట్లతో భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. భక్తుల భద్రత, పరిశుభ్రత, సౌకర్యాలే మన కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, ఘాట్ల అభివృద్ధి, హేవలాక్ బ్రిడ్జి సుందరీకరణ, టెంట్ సిటీలు, హోమ్ స్టేలు వంటి కార్యక్రమాలతో గోదావరి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక - పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాను. @PawanKalyan @JanaSenaParty @APDeputyCMO
Kandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet media
తెలుగు
2
205
801
9.4K
Anil Kumar B(+) 🚩 retweetledi
భానుడు 🌻🇮🇳 🚩
సంస్కారం అడ్డొచ్చి, మా నాయకుడు నేర్పిన సహనం అడ్డొచ్చి.. మీ ఇల్లకు వచ్చి గుడ్డలిప్పి ఎందుకు తన్నడం లేదంటే.. అలా తన్నించుకున్న తర్వాత కూడా పలానా అభిమానులు ఇలా చేశారు అని చెప్పుకుంటారనే.. అక్కడే మీరు రోజువారీ కూడు సిగ్గు లేకుండా తినేస్తున్నారు💦💦💦 థూ థూ మీ బ్రతికుల మీద మా చెప్పు
తెలుగు
0
12
69
825
Anil Kumar B(+) 🚩 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
One of the ideals of #JanaSenaParty: "Progress that preserves the environment" JanaSena Party & Deputy CM, Chief @PawanKalyan always stood rock solid against environmental pollution & the inspection of Godavari waters and getting GO for a special task force is no surprise! #PawanKalyanAneNenu
English
3
436
1K
8.3K
Anil Kumar B(+) 🚩 retweetledi
భానుడు 🌻🇮🇳 🚩
చేసిన పాపపు పనికి సిగ్గేసి.., వాడ్ని వాడే సమర్థించేసుకుని తప్పు కాదన్నట్టు నిరూపించుకోవడానికి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుంటారు కొందరు..🤦 అయితే ఎవడి మనస్సాక్షీ వాడ్ని అంత తేలికగా వదిలిపెట్టదు.😎 @K_Nageshwar You lost man 🤷
Rebellion@RebellionTweet

ఇంత నీచ స్థాయికి దిగజారడం ఏంటి నాగేశ్వర్ నిన్న వదిలేద్దాం అని మళ్లీ సిగ్గులేని బతుకు మాటలు 🤮🤮

తెలుగు
4
87
235
2.4K
Anil Kumar B(+) 🚩 retweetledi
SRINIVASA RAO🦉
SRINIVASA RAO🦉@NeverSayYesDude·
HDFC బ్యాంక్ చేసిన ‘చట్టబద్ధమైన మోసం’ (Corporate Scams Explained) మీరు బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పెడితే వచ్చే వడ్డీ ఎంత? కేవలం **3.5%**. కానీ, అదే మహారాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పరేషన్ (MSRDC) పెడితే వచ్చిన వడ్డీ 6.1%! అంటే, మనకన్నా ఆ ప్రభుత్వ సంస్థకు 2.6% ఎక్కువ. ఈ తేడా ఎందుకు? ఇక్కడే అసలు కార్పొరేట్ డ్రామా మొదలైంది! 1. స్పాన్సర్‌షిప్ ముసుగులో వడ్డీ! HDFC బ్యాంక్ ఆ అదనపు 2.6% ని నేరుగా వడ్డీ రూపంలో చెల్లించలేదు. ఎందుకంటే అలా చేస్తే దొరికిపోతారు. అందుకే ఒక కొత్త దారి వెతికారు: * నలుగురు ప్రైవేట్ వెండర్స్ (Vendors) ను రంగంలోకి దించారు. * వారి ద్వారా రోడ్ సేఫ్టీ స్పాన్సర్‌షిప్ పేరిట ఏకంగా ₹45 కోట్లు MSRDC కి చేర్చారు. * బ్యాంక్ అకౌంట్ బుక్స్‌లో దీనిని ‘మార్కెటింగ్ ఖర్చు’ (Marketing Expense) గా చూపించారు. కానీ నిజానికి అది వడ్డీ! చట్టం దృష్టిలో ఇది Disguised Interest" (నిజమైన వడ్డీని దాచి, వేరే రూపంలో ఇవ్వడం). 2. RBI రూల్ ఏం చెప్తోంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధన చాలా స్పష్టంగా ఉంది: "బ్యాంకులు డిపాజిటర్లందరికీ ఒకే వడ్డీ రేటు ఇవ్వాలి." ఒక్క పెద్ద సంస్థ కోసం బ్యాక్ డోర్ (Back-door) లో అదనపు డబ్బులు చెల్లించడం నిబంధనల ఉల్లంఘనే. చట్టం మీరు ‘ఏం చేశారు’ అని చూస్తుంది తప్ప, ‘ఎందుకు చేశారు’ అనే కారణాలను పట్టించుకోదు. 3. "ప్రభుత్వ సంస్థకే వెళ్ళింది కదా, తప్పేముంది?" ఇది చాలా మందికి వచ్చే అనుమానం. కానీ ఇక్కడే మూడు పెద్ద లూప్‌హోల్స్ (Loopholes) ఉన్నాయి: డబ్బు వృధా: మధ్యలో ఉన్న వెండర్స్ ఏజెన్సీ ఫీజు, GST, TDS రూపంలో కొట్టేశారు. అంటే ఆ ₹45 కోట్లు పూర్తిగా ప్రభుత్వానికి చేరలేదు. అవినీతి అనుమానాలు: ఆ వెండర్లను ఎవరు సెలెక్ట్ చేశారు? ఏ ప్రాతిపదికన చేశారు? ఈ ప్రాసెస్‌లో ఎవరికైనా పర్సనల్ కమిషన్లు వెళ్ళాయా? ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (Express Investigation) లీక్ చేసింది సరిగ్గా ఇదే! డేంజర్ ట్రెండ్: ఈ మోడల్ కనుక సక్సెస్ అయితే, రేపు ప్రైవేట్ కంపెనీలకు, పొలిటిషియన్లకు కూడా ఇదే రూట్‌లో బ్యాంకులు అదనపు వడ్డీలు ఇస్తాయి. అప్పుడు సామాన్యుడికి రక్షణ ఉండదు. > మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం: > రేపు మీరు బ్యాంకెళ్లి "నాకు కూడా 6% వడ్డీ ఇవ్వండి" అంటే ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే మనకు ఆ నెగోషియేషన్ పవర్ లేదు. "రూల్ అందరికీ ఒక్కటే" అనేది కేవలం పేపర్ల మీద మాత్రమే అని ఈ ఘటన నిరూపించింది. బ్యాంకింగ్ వ్యవస్థ నడిచేది నమ్మకం మీద. ఒక సంస్థకు వెనకదారిలో లాభం చేకూర్చడం అంటే, సామాన్య డిపాజిటర్ల నమ్మకాన్ని వమ్ము చేయడమే. HDFC బ్యాంక్ మాజీ చైర్మన్ "నైతిక విలువల" గురించి మాట్లాడి రాజీనామా చేశారు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత బయటపడ్డ ఈ కథ ఒకటే చెబుతోంది: గవర్నెన్స్ (Governance) అనేది కేవలం స్పీచుల్లో ఉంటే సరిపోదు, అకౌంట్ లెడ్జర్లలో కనపడాలి.
తెలుగు
12
53
254
42.1K
Anil Kumar B(+) 🚩 retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
@pvssarma పదో తరగతి పేపర్లు దొబ్బేసినోడు అయ్య MLA అండతో పోలీసులపై దౌర్జన్యం చేసినోడు అయ్య పదవి చాటున వేలకోట్ల అక్రమాస్తులు వెనకేసినోడు CBI ED కేసుల అలంకరణుడు అయ్య పోతే సంతకాలు సేకరించిన ఘనుడు అయ్య పేరు చార్జషీట్లు చేర్చినోడు అమ్మమీద కేసేసినోడు చెల్లికి రంకుపెట్టినోడు మద్యం కుంబకోణ వీరుడు
తెలుగు
2
232
573
5K
Anil Kumar B(+) 🚩 retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
YSR Criminal Party 👍 ED questions Chevireddy Bhaskar Reddy wife and younger son Harshit Reddy in AP Liquor Scam. Questions about Money Laundering and willful supression of assets of around 55 Cr in 2024 election affidavit 🤷‍♂️
Chanandler Bong tweet media
English
2
279
527
3.9K
Anil Kumar B(+) 🚩 retweetledi
Deputy CMO, Andhra Pradesh
(2/2) * ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మేము ‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దాల్సింది అధికారులైతే, ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సింది ప్రజా ప్రతినిధులుగా మేము. గోదావరి కాలుష్యం మీద నా కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా? పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రజలు ఏదైనా మమ్మల్ని ప్రశ్నిస్తారు. వారికి సమాధానం చెప్పాల్సింది మేము. ఇక్కడ ఉన్న జలాలు చూశాక - పుణ్య స్నానానికి వస్తే రోగాలు వస్తాయి. ఘాట్స్ సుందరీకరణ, ముస్తాబు చేస్తే సరిపోతుందా? అక్కడ స్నానం చేసే నీళ్లు శుద్ధిగా ఉండవద్దా? ఎస్టీపీ ప్లాంట్స్ లో నిబంధనల ప్రకారం శుద్ధి చేస్తున్నారో లేదో చూడాలి. పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు… కెమికల్ స్నానం చేయించకూడదు కదా. కాలుష్య నియంత్రణ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు క్యాబినెట్ లో చర్చించి బలమైన నిర్ణయం తీసుకుంటాం. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలి. మేము ఉపాధి చూపిస్తున్నాం… మా ఇష్టం వచ్చినట్లు ఉంటాం అనడం సరికాదు. ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించి, పర్యావరణానికి తగిన గౌరవం ఇచ్చి ముందుకు వెళ్లాలి. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య పరిస్థితిపై సమగ్ర నివేదికను ఇవ్వండి. తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశాన్ని క్యాబినెట్లో చర్చిస్తాం " అని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, జిల్లా అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ పర్యటనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్యేలు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు, ఉన్నతాధికారులు శ్రీ కాంతిలాల్ దండే గారు, శ్రీ శరవణన్ గారు, శ్రీమతి కీర్తి చేకూరి గారు ఉన్నారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
1
246
661
5.2K
Anil Kumar B(+) 🚩 retweetledi
భానుడు 🌻🇮🇳 🚩
మీరు రాజమండ్రీ నుండి కాకినాడ వయా ద్వారపూడి మార్గం గుండా ఒకసారి వస్తే.. అఖండ గోదావరిని ఎంత చిత్రవధకు గురిచేస్తున్నారో తెలుస్తుంది సార్. మున్సిపాలిటీ తుక్కుపట్టుకు వెళ్ళే బండ్లు బెటర్ సార్. ప్రజలు కూడా వ్యర్థాలన్నీ తీసుకొచ్చి గోదావరి కాలవులో పడేస్తారు. ఏ ఒక్కడికీ కూడా బాధ లేదు😌
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

కలుషిత జలాలు గోదావరిలో కలిపేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? - గలగలా గోదారి… అని గీతం ఆలపిస్తాము… ఇంత కాలుష్యం ఉంటే ఏమని ఆలపించాలి? * ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యానికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? * రూ. 13 కోట్ల బకాయిలను రాబట్టలేరా? * ప్రజల ముందు సమాధానం చెప్పాల్సింది మేము * ⁠పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు… కెమికల్ స్నానం చేయించకూడదు కదా * ఇంతటి కీలక సమస్యలను నా దృష్టికి తీసుకురండి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం * ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా… తూర్పులంక లాగూన్స్ వరకు వెళ్లి మరీ పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘మా తెలుగుతల్లికి.. రాష్ట్ర గీతంలో గల గలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తాం.. ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ.. కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తోంది. ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా..? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యక్షంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది… పరిశ్రమలను ప్రోత్సహించాలని రాయితీ ధరలకు భూములను కేటాయిస్తున్నాం.. ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా, పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ధి చేసి గోదావరిలోకి విడుదల చేయాలి. తూర్పు లంకలోని లాగూన్స్ (మడుగులు)లో వీటిని వదులుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయాన్నే వెంకట నగరం ఘాట్ నుంచి పడవలో లాగూన్స్ వరకూ వెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మొబైల్ కిట్లతో నీటిలో కాలుష్య కారకాలు ఎంత ఉన్నాయి అన్నది అక్కడికక్కడే పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ- ప్రత్యక్షంగా గోదావరిలోకి కాలుష్య జలాలు ఈ స్థాయిలో కలుస్తున్నా ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు స్పందించలేదని, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీ శంకర్ నాయక్ ను ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలుష్య శుద్ధి ఎలా జరుగుతుంది అన్న వివరాలు తెలుసుకుంటున్నారా? క్షేత్రస్థాయిలోకి వచ్చి ఈ మడుగులను ఎన్నిసార్లు పరిశీలించారు అని ప్రశ్నించారు. గోదావరి మధ్యలోని తూర్పులంకలో అతి పెద్ద మడుగులలో కాలుష్య కారకాలు ఉన్న నీటిని నిల్వ చేసి తర్వాత, గోదావరిలోకి ఇంకిపోయేలా చేయడం ఏమిటన్నారు. మడుగుల్లోని నీరు మొబైల్ కిట్ లో మరోసారి పరీక్షలు చేయించారు. అక్కడ గుర్రపు డెక్క భారీగా పేరుకొని ఉందంటే కచ్చితంగా జలాలు కలుషితం అయినట్లే కదా అన్నారు. * పెండింగ్ బకాయి రాబట్టలేరా? కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు స్నేహపూర్వక భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తే, యువతకు ఉపాధి దొరుకుతుందని, రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని భావిస్తాం. అయితే ఇంత స్నేహపూర్వక వాతావరణంలో రాయితీలపై భూములు కేటాయిస్తున్నా సరే పరిశ్రమలు కాలుష్యం నివారణ విషయంలో సరైన దృష్టి పెట్టడం లేదు అనిపిస్తుంది. గాలి, నీరు కాలుష్యం విషయంలో ప్రతి పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్నులు రూపేణా చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను వెంటనే రాబట్టేలా జిల్లా యంత్రాంగం పనిచేయాలి. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ బకాయిలు కట్టకపోతే ఎలా? దీనిపై సీరియస్ గా స్పందించండి. అలాగే ప్రతి ఏటా కాలుష్య నియంత్రణకు యాజమాన్యం ఎంత మేర చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందో..? పరిశీలించండి. ఇంత దారుణంగా కళ్ళముందే కాలుష్యం జరుగుతున్న ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యాజమాన్యానికి ఎందుకు నోటీసు ఇవ్వలేదో కూడా నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు. (1/2)

తెలుగు
0
25
68
770
Anil Kumar B(+) 🚩 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
నా సంపద.. సంపాదన… సాధక్, ఉద్యమిలే * క్రమశిక్షణగల సమూహాన్ని తయారు చేసుకున్నాం * ⁠పార్టీ నిర్మాణ ప్రక్రియలో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యతలు * కమిటీల ముందుకు మీ పని తీరును ప్రతిబింబించే వివరాలు అందజేయండి * కాపు నాయకుల పేరుతో పదేపదే నాపై నిందలు వేస్తే ఇక ఉపేక్షించేది లేదు * నాకు కులం ముఖ్యం కాదు.. పార్టీ గురించి నిలబడిన వాళ్లే ముఖ్యం * అభాండాలు.. అన్యాయాల మీద జనసేనది రాజీలేని పోరాటం * ఇక నుంచి పార్టీపై జరిగే విష ప్రచారానికి గట్టిగా బదులివ్వాలి * రాజమహేంద్రవరంలో సాధక్ ల సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
8
483
1.6K
12K
Anil Kumar B(+) 🚩 retweetledi
Bolisetti Srinivas
Bolisetti Srinivas@BolisettiSrinu·
మీరు ఏం పీకారు సార్ 2019-24 మధ్యలో ? మేము కర్నూల్ లో 2 లక్షల మందితో ఒత్తిడి తెస్తేనే కానీ వారికి రావాల్సిన SC/ST బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోయావ్ ? అంతే కాకుండా ఒక పనికి రాని జీ.ఓ విడుదల చేసావ్! ఇదేనా నీ చిత్తశుద్ధి ?
YS Jagan Mohan Reddy@ysjagan

సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబుగారు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు చూపుతూ, అప్పట్లో చేసిన CDFD ల్యాబ్‌ రిపోర్టులు చూపుతూ, డీఎన్‌ఏ ప్రొఫైల్‌ ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం. English Version - tinyurl.com/2wfajb56

తెలుగు
221
979
2.7K
132.4K
Anil Kumar B(+) 🚩 retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
"As per the district administration, out of Rs 8000 Cr estimated proposals, not single rupee was earmarked for pollution aspect. Which is why I have requested APPCB to allot Rs. 100 Cr for pollution treatment of Godavari, which is the priority" - AP Deputy CM @PawanKalyan ⚡❤️‍🔥
English
2
288
774
10.7K
Anil Kumar B(+) 🚩 retweetledi
Deputy CMO, Andhra Pradesh
పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించాలి * ఆన్లైన్ పన్నుల వసూళ్లతో విధానంతో పారదర్శకత పెరుగుతుంది * రాజవోలు గ్రామ పంచాయతీలో స్వయంగా ఆన్లైన్ పన్నుల విధానాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుంది. పంచాయతీ పన్నుల వసూలు ప్రక్రియ సరికొత్త మార్గంలో ముందుకు వెళ్లడం శుభపరిణామం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో పన్ను వసూళ్లు ఉండేవని, దీన్ని పూర్తిగా మార్చి మొత్తం ఆన్లైన్ విధానం తీసుకు వచ్చామని చెప్పారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు మంగళవారం స్వయంగా పరిశీలించారు. రాజమండ్రి రూరల్ మండలం, రాజవోలు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పన్నుల వసూలు విధానాన్ని పరిశీలించారు. పన్నులను ఆన్లైన్లో కడుతున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. "కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పని చేస్తుంది. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తుంది. పంచాయతీలు స్వావలంబన సాధించాలంటే, ఆర్థికంగా వృద్ధి చెందాలి. స్వయంగా ఆదాయం ఆర్జించే స్థాయికి పంచాయతీలు రావాలి. ప్రతి అభివృద్ధి పనికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకునే దశకు పంచాయతీలు రావాలి. దీనికోసం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోంది. నూతన విధానాలను పంచాయతీలు కూడా అందిపుచ్చుకొని, పన్నులు గ్రామ ప్రగతికి పునాదులు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి" అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు ఉన్నారు. * ఆవ ఛానెల్ పరిశీలన రాజవోలు గ్రామపంచాయతీ నుంచి తిరిగి వస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో కీలకమైన ఆవాఎల్ చానల్ ను పరిశీలించారు. ఎస్టీపీ నుంచి వచ్చే ఈ ఛానెల్ పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయి ఉండటంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘ స్వరూప్ లను పిలిచి కాలువలో వ్యర్ధాలు పేరుకుపోకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల్లో స్వచ్ఛరథాలు మాదిరిగా అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎందుకు పేరుకు పోతున్నాయనే విషయం మీదా, ఆ సమస్య మీద ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దీనికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందుతుందని, వెంటనే ఛానల్ సరిదిద్దే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. - గోదావరి పరీవాహకంలో కాలుష్య నివారణకు రూ.100 కోట్లు కృష్ణా, గోదావరి నదులను కాలుష్యం నుంచి రక్షించడానికి, వాటిని శుభ్రపరచడానికి మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు చేపట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని గుర్తించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నదీ జలాలు కాలుష్యం బారిన పడకుండా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ నిధుల ద్వారా మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కాలువల్లో కలకవకుండా నిరోధించడానికి ఉపయోగిస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. నది, కాలువల్లోకి వెళ్లే మురికినీటిని శుద్ధి చేయడానికి ఎస్టీపీలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఈ నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. * వుడ్ బ్యాంక్ కోసం పంచాయతీరాజ్ - అటవీ శాఖ మధ్య అవగాహన ఒప్పందం వుడ్ బ్యాంక్ కింద మొక్కలు కొనుగోలు చేయడానికి పంచాయతీరాజ్ - అటవీ శాఖల అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లను పంచాయతీరాజ్ శాఖ వారు అటవీ శాఖకు ఇస్తారు. అందుకు సంబంధించి అటవీ శాఖ కలపను త్వరగా ఇచ్చే మొక్కలను అందిస్తుంది. వాటితో పంచాయితీల్లో పల్లె వనాలు అభివృద్ధి చేస్తారు. అక్కడ వచ్చే కలపను అటవీ శాఖ కొనుగోలు చేసి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా అటు పంచాయతీలకు ఆదాయ ఆర్జన సాధ్యమవుతుంది, ఇటు పర్యావరణం మెరుగవుతుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పీసీసీఎఫ్ శ్రీ చలపతి రావు, పి ఆర్ ఆర్డీ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ సంతకాలు చేశారు. (1/3)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
16
547
2.3K
34.1K
Anil Kumar B(+) 🚩 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
గోదావరి గలగల కాదు... కాలుష్యంతో విలవిల •రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి •నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే •పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు •ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది •కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు •పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి •రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి, నేడు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంతో విలవిలలాడుతోంది. నదిని మురికిగా ఉంచి, భక్తులను పవిత్ర స్నానాలు చేయమనడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇంత కలుషిత నీటిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ, జబ్బులు రావడం మాత్రం ఖాయమ’ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు, రంగులు వేయడం కంటే ముందు గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించాలని అధికారులకి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ముందు తూర్పు లంక లాగూన్స్ పరిశీలించారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ నల్లా ఛానెల్ ను మరోసారి పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ మీద మురుగు నీరు శుద్ధి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడం గుర్తించారు. దీనిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఒక వైపు పుణ్య నది గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతూ.. మరో వైపు భారీ స్థాయిలో మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం అత్యంత హాస్యాస్పదం, దారుణం. స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదుగానీ... జబ్బులు వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. రాజమండ్రి నగరం నుంచి ప్రతి రోజూ 75 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే, అందులో కేవలం 30 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 45 మిలియన్ లీటర్ల మురికినీటిని ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. గోదావరి తల్లి మన తప్పులన్నింటినీ భరిస్తూ ప్రవహిస్తోంది కాబట్టి సరిపోయింది. కానీ పవిత్రమైన పుష్కర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావన కలగకూడదు. *మురుగునీటి శుద్ధికి బడ్జెట్ ఎక్కడ?* రాబోయే పుష్కరాల కోసం అన్ని రకాల వసతులు, రోడ్లు, ఘాట్‌ల నిర్మాణం, మౌలిక వసతులు కోసం దాదాపు రూ.8,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ, వారు స్నానం చేసే గోదావరి నదిని శుభ్రంగా ఉంచే మురుగునీటి శుద్ధికి మాత్రం పైసా బడ్జెట్ కేటాయించలేదు. రోజూ 45 ఎంఎల్డీ మురుగునీరు నేరుగా నదిలోకి వెళ్తుంటే.. దాన్ని ఆపడానికి బడ్జెట్ పెట్టకుండా, మిగతా వసతులకు రూ. 8,000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం? కొన్నేళ్ల క్రితం ఏలూరులో తాగునీరు కలుషితమై, ప్రజలు వింత వ్యాధి బారిన పడి పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదిలోకి మురుగు నీరు కలవకుండా నిరోధించేందుకు, అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి. *వాళ్లది బాధ్యత లేని నిర్లక్ష్యం* నిన్న జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలు తాము అన్ని నిబంధనలూ కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే వారు చెప్పిన మాటలకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. పరిశ్రమ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల కోసం కనీసం ఒక కాంక్రీట్ కెనాల్ కూడా నిర్మించలేదు. విషపు నీటిని నేరుగా వదిలేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఈ రసాయన మురికి నీరంతా నేరుగా పవిత్ర గోదావరిలో కలవడం వల్ల నదిలో విపరీతంగా గుర్రపుడెక్క పెరిగిపోతోంది. నది పర్యావరణ వ్యవస్థ సర్వనాశనమవుతోంది. ఇన్ని తప్పులు చేస్తూ, తిరిగి మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు అని ఆ పరిశ్రమ వాళ్ళు మాట్లాడుతున్నారు. కోట్లు అర్జిస్తున్నా... రూ. 13 కోట్ల టాక్స్ కట్టలేదు ఆంధ్రా పేపర్ మిల్లు సంస్థ రూ.500 కోట్ల భారీ లాభాలు గడిస్తున్నా, ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.13 కోట్ల పన్ను బకాయిలను మాత్రం చెల్లించడం లేదు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
4
552
1.7K
12.3K
Anil Kumar B(+) 🚩 retweetledi
Deputy CMO, Andhra Pradesh
(2/2) * కోట్లు అర్జిస్తున్నా... రూ. 13 కోట్ల టాక్స్ కట్టలేదు ఆంధ్రా పేపర్ మిల్లు సంస్థ రూ.500 కోట్ల భారీ లాభాలు గడిస్తున్నా, ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.13 కోట్ల పన్ను బకాయిలను మాత్రం చెల్లించడం లేదు. క్షేత్రస్థాయిలో ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఆ యాజమాన్యానికి కనీసం ఒక్క నోటీసు కూడా పంపించలేదు. పన్ను బకాయిలు ఎందుకు కట్టలేదని, కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నిస్తే.. తాము 3 వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని యాజమాన్యం సాకులు చెప్పడం సరికాదు. ఫ్యాక్టరీ నడపడానికి మన గోదావరి జలాలను వాళ్లు వాడుకుంటున్నారు కనుకే ఉపాధి కల్పిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజలందరి ప్రాథమిక హక్కు. ఉద్యోగాలు ఇస్తున్నామనే సాకుతో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కాలుష్యంపై గట్టిగా నిలదీస్తే రాష్ట్రం వదిలి వెళ్లిపోతాం అని కొందరు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు మేము లొంగేవాళ్లం కాదు. పారిశ్రామికవేత్తల మీద మాకు తగిన గౌరవం ఉంది. ఉద్యోగాలు ఇస్తున్నారనే మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ పర్యావరణాన్ని రక్షించడం మీ ప్రాథమిక బాధ్యత . దయ చేసి ఆ బాధ్యతను గుర్తించి నడుచుకోవాలి. * రూ. 1368 కోట్లు మంజూరు చేశాం గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఈ రెండేళ్లలో 1849 కిలోమీటర్ల బీటీ రోడ్లు రూ. 1368 కోట్లతో మంజూరు చేశాం. అందులో 229 కిలోమీటర్ల బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 600 కిలోమీటర్లు సాస్కీ పథకం ద్వారా మంజూరు చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు రూ.1038కోట్లతో మంజూరు చేశాం. అందులో 1340 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అడవి తల్లి బాట కింద మరో 216 కిలోమీటర్ల బీటీ రోడ్లు రూ.180 కోట్లతో మంజూరు చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైమ్ లైన్ పెట్టుకొని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కీలోమీటర్ల బీటీ రోడ్లుకు రూ.989 కోట్లు కావాలని అధికారులు కోరారు. ఇందులో 480 కిలోమీటర్లు బీటీ రోడ్లు ప్రాధాన్యత ఆధారంగా కావాలని కోరారు. వీటిని కూడా ఒకసారి పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటాం. * అధికారులతో సమీక్షలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు రాబోయే పవిత్ర గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఆరు జిల్లాల్లో దాదాపు రూ.8,800 కోట్లు నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. పుష్కర జిల్లాల పరిధిలో రూ.1,080 కోట్ల అంచనా వ్యయంతో 1,324 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి 889 పనులను ప్రతిపాదించారు. కనెక్టివిటీని పెంచేందుకు రూ. 975 కోట్ల వ్యయంతో 850 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులను అంచనా వేశారు. జనసందోహం అంతా కేవలం రాజమండ్రి నగరానికే పరిమితం కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలకు వికేంద్రీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అలాగే పుష్కర్ నగర్ అంచనా నమూనాను తయారు చేయాలని, పుష్కర్ నగరలతో పాటు పుష్కర్ పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒక పంచాయతీలో పైలైట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలని నిర్ణయించారు. లాడ్జింగ్, బోర్డింగ్, పార్కింగ్, శానిటేషన్ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు, శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్‌ దండే, పంచాయతీ రాజ్ కమిషనర్‌ శ్రీ కృష్ణతేజ, కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
1
208
549
4.2K
Anil Kumar B(+) 🚩 retweetledi
Deputy CMO, Andhra Pradesh
గోదావరి గలగల కాదు... కాలుష్యంతో విలవిల •రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి •నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే •పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు •ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది •కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు •పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి •రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి, నేడు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంతో విలవిలలాడుతోంది. నదిని మురికిగా ఉంచి, భక్తులను పవిత్ర స్నానాలు చేయమనడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇంత కలుషిత నీటిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ, జబ్బులు రావడం మాత్రం ఖాయమ’ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు, రంగులు వేయడం కంటే ముందు గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించాలని అధికారులకి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ముందు తూర్పు లంక లాగూన్స్ పరిశీలించారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ నల్లా ఛానెల్ ను మరోసారి పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ మీద మురుగు నీరు శుద్ధి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడం గుర్తించారు. దీనిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఒక వైపు పుణ్య నది గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతూ.. మరో వైపు భారీ స్థాయిలో మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం అత్యంత హాస్యాస్పదం, దారుణం. స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదుగానీ... జబ్బులు వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. రాజమండ్రి నగరం నుంచి ప్రతి రోజూ 75 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే, అందులో కేవలం 30 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 45 మిలియన్ లీటర్ల మురికినీటిని ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. గోదావరి తల్లి మన తప్పులన్నింటినీ భరిస్తూ ప్రవహిస్తోంది కాబట్టి సరిపోయింది. కానీ పవిత్రమైన పుష్కర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావన కలగకూడదు. * మురుగునీటి శుద్ధికి బడ్జెట్ ఎక్కడ? రాబోయే పుష్కరాల కోసం అన్ని రకాల వసతులు, రోడ్లు, ఘాట్‌ల నిర్మాణం, మౌలిక వసతులు కోసం దాదాపు రూ.8,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ, వారు స్నానం చేసే గోదావరి నదిని శుభ్రంగా ఉంచే మురుగునీటి శుద్ధికి మాత్రం పైసా బడ్జెట్ కేటాయించలేదు. రోజూ 45 ఎంఎల్డీ మురుగునీరు నేరుగా నదిలోకి వెళ్తుంటే.. దాన్ని ఆపడానికి బడ్జెట్ పెట్టకుండా, మిగతా వసతులకు రూ. 8,000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం? కొన్నేళ్ల క్రితం ఏలూరులో తాగునీరు కలుషితమై, ప్రజలు వింత వ్యాధి బారిన పడి పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదిలోకి మురుగు నీరు కలవకుండా నిరోధించేందుకు, అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి. * వాళ్లది బాధ్యత లేని నిర్లక్ష్యం నిన్న జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలు తాము అన్ని నిబంధనలూ కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే వారు చెప్పిన మాటలకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. పరిశ్రమ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల కోసం కనీసం ఒక కాంక్రీట్ కెనాల్ కూడా నిర్మించలేదు. విషపు నీటిని నేరుగా వదిలేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఈ రసాయన మురికి నీరంతా నేరుగా పవిత్ర గోదావరిలో కలవడం వల్ల నదిలో విపరీతంగా గుర్రపుడెక్క పెరిగిపోతోంది. నది పర్యావరణ వ్యవస్థ సర్వనాశనమవుతోంది. ఇన్ని తప్పులు చేస్తూ, తిరిగి మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు అని ఆ పరిశ్రమ వాళ్ళు మాట్లాడుతున్నారు. (1/2)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
15
399
1.4K
10.7K