Maneeshts
338 posts






Galgotias, now in the news for robots, is the same university whose faculty once published a paper suggesting that thali and bell vibrations could kill coronavirus. My heart goes to the students of this university who will feel ashamed to say where they are studying.










-- ఫైర్ సేఫ్టీ అందరి బాధ్యత -- హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు. -- నగరవ్యాప్తంగా హైడ్రా అవగాహన కార్యక్రమాలు. ✳️వస్తున్నది వేసవి కాలం. నిప్పు రగిలితే మంటలు వ్యాపించి భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే హైడ్రా తనిఖీలు చేసి కొన్ని షాపులను సీజ్ చేయడమైంది. నెల రోజులు వ్యవధి కావాలని షాపుల యజమానులు, వ్యాపార సంఘాలకు చెందిన ప్రతినిధులు విజ్ఞప్తి చేయగా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు ఫిబ్రవరి నెలవరకూ సమయం ఇచ్చారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది. నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలను సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా పెద్దయెత్తున నిర్వహిస్తోంది. ఎవరికి వారు ఆలోచించి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అనుసరించాల్సిన ప్రాథమిక అంశాలను ఈ కిందన పొందుపరుస్తున్నాం. వీటిని తూచా తప్పకుండా పాటించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -- సెల్లార్లను గోదాములుగా మార్చకండి. ✅ సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించండి. మీ వ్యాపారానికి సంబంధించిన గోదాముగా మార్చకండి. ఆ వస్తువులు పోతాయని గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళాలతో బంధించరాదు. ✅ సెల్లార్లలో చెత్త పేరుకుపోకుండా జాగ్రత్త పడండి. ఆ చెత్తకు నిప్పంటుకుని వ్యాపార సముదాయం మొత్తం అగ్ని ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ✅ సెల్లార్లలో వాచ్ మ్యాన్ నివాసాలు లేకుండా చూడండి. అలాగే క్యాంటిన్ల నిర్వహణ, వంటలు చేయడం.. చెత్త తగుల బెట్టడం చేయరాదు. -- దారులు మూసేయకండి.. ✅ సెల్లార్లతో పాటు.. ర్యాంపులు, కారిడార్లు, మెట్ల మార్గాలు ఖాళీగా ఉంచండి.. మీ వ్యాపార వస్తువులను నిలువ ఉంచి దారులు మూసేయకండి. ✅ అగ్ని ప్రమాదం జరిగితే ఎటువైపు నుంచి సులభంగా బయట పడగలమో ఎగ్జిట్ మార్గాలను సూచిస్తూ సైన్ బోర్డులు పెట్టండి. ✅ లిఫ్ట్‌లో పై అంతస్తులకు వెళ్లే అవకాశం ఉంది కదా అని మెట్ల మార్గాలను వస్తువులతో మూసేయవద్దు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్టును వినియోగించరాదు కనుక మెట్ల మార్గమే సరైనది. -- నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వాడండి.. ✅ ఐఎస్‌వో స్టాండర్డ్ కరెంటు వైర్లను, స్విచ్ బోర్డులను, ప్యానెల్ బోర్డులను మాత్రమే వినియోగించండి. నాణ్యమైన వస్తువులు వాడకపోతే కాలిపోయే ప్రమాదాలుంటాయి. మీరు వినియోగిస్తున్న విద్యుత్ లైన్లకు ఎర్తింగ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ✅ మీరు విద్యుత్ వినియోగానికి తగ్గట్టు పవర్ కనెక్షన్లు తీసుకోండి. తర్వాత ఏసీలు ఇతర విద్యుత్ వాడక వస్తువులు వినియోగిస్తే పవర్ సరిపోక ట్రిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ✅ కరెంటు స్తంభం నుంచి వచ్చే వైర్లు, వ్యాపార సముదాయానికి విద్యుత్‌ను సరఫరా చేసే వైర్లను అనుసంధానం చేసే ప్యానల్ బోర్డు వద్ద పొరపాటున నిప్పురవ్వలు పడినా వెంటనే మంటలు అంటుకోకుండా.. కంకరతో ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలి. ✅ విద్యుత్ సర్క్యూట్‌లపై ఓవర్‌లోడ్ ఉండకూడదు మరియు వైరింగ్‌లో ఎలాంటి జాయింట్లు ఉండకూడదు. -- ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చండి.. ✅ అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసే స్మోక్ డిటెక్టర్లు ప్రతి సముదాయంలో ఉండాలి. ✅ మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే వాటర్ స్ప్రింక్లర్లు అమర్చాలి. ✅ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలి. ✅ ఇవన్నీ పని చేస్తున్నాయో లేదో.. సమయానుకూలంగా పరీక్షించుకుని పనిచేసే విధంగా ఉంచాలి. ✅ షాపుల్లో, వ్యాపార సముదాయాల్లో పని చేసే ప్రతి ఒక్కరికీ ఫైర్ ఎక్టింగ్విషర్ వినియోగించడం ఎలా అనేది శిక్షణ ఇవ్వండి. ✅ అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసేలా ఫైర్ అలారమ్(రెడ్ బటన్) ప్రెస్ చేసేందుకు వీలుగా అమర్చండి. -- ఈ కింది జాగ్రత్తలు కూడా తీసుకోండి.. ✅ విద్యుత్ బల్బులు, ట్యూబ్‌లైట్లకు దగ్గరగా ఎలాంటి వస్తువులు నిలువ ఉంచరాదు. డోర్ కర్టైన్లు, దుస్తులు ఉంచరాదు.. బల్బు వెడికి నెమ్మదిగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. ✅ షాపు అలంకరణకు ఉద్దేశించిన వైర్ల జాయింట్లు, సీరియల్ బల్బులు, ఫాల్ సీలింగ్ లైట్లు అమర్చేటప్పడు ఎక్కడైనా కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యేప్రమాదం ఉండకుండా చూడండి. ✅ మరీ ముఖ్యంగా అపార్టుమెంట్లు కింది భాగంలో వ్యాపార కార్యకలాపాలు, షాపుల మాదిరి వినియోగిస్తే మరింత అప్రమత్తంగా ఉండండి. మంటలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడండి. ✅ మీ ఇంటికి చేరువలో అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉండే పరిస్థితులున్నా.. ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎవరైనా గమనిస్తే.. హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667 నంబరుకు పూర్తి సమాచారంతో పాటు.. వీడియోలు, ఫొటోలు, కరెంట్ లొకేషన్‌ను చెబుతూ సమాచారం ఇవ్వండి. ✅ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్ కోసం, మంటలను ఆర్పడం కోసం 101 కి ఫోను చేయాలి. #FireSafetyAwareness #FirePrevention #MockDrills #FireDrill #DisasterPrevention #HYDRAA #Hyderabad













