ทวีตที่ปักหมุด
ɾąցհąѵ
31.5K posts

ɾąցհąѵ
@ThisIsRagh
విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ♥️
เข้าร่วม Aralık 2023
726 กำลังติดตาม1.1K ผู้ติดตาม

ఎదనే కొరికే చూపందం...
అలకే అందం
మనసే తెలిపే మాటందం
ప్రతీది అందం...
జగమే కననీ అందం
తన జతలో చెలిమే ఆనందం
#GuessTheSong

తెలుగు

@ThisIsRagh నేను నా ముగ్గురు పిల్లల్ని అలానే పెంచాను.... ఫైనాన్సియల్లీ ఇండిపెండెంట్...ఓన్ డెసిషన్ మేకింగ్ 💯%✅✍️✍️✍️
తెలుగు

ఇష్టం లేని వృత్తి చేయడం వేరేవారి జీవితాన్ని మనం జీవించడం లాంటిది.
పిల్లలు భవిష్యత్తులో ఏం చేయాలి అనుకుంటున్నారో పిల్లల ఇష్టాలకు వదిలేయండి, లేదా ఒప్పించండి.
కానీ బలవంతంగా మీరు అనుకున్న మార్గంలో వాళ్ళను నడిపించకండి.
AVM@AvmNews7
తల్లిదండ్రుల కల కోసం నా ఆత్మను చంపుకున్నా..!: సోషల్ మీడియాలో కన్నీరు మున్నీరవుతున్న డెంటిస్ట్రీ యువతి ఆవేదన!💔 తల్లిదండ్రుల కోరిక మేరకు ఇష్టం లేకపోయినా Dentistry చదివి డాక్టర్ అయ్యానని, కానీ తన అసలైన కల అయిన Artist అవ్వాలనే కోరికను పూర్తిగా కోల్పోయానని ఒక యువతి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. "కోర్సు పూర్తి చేయడానికి నా ఆత్మను సైతం చంపుకున్నా.. ఇప్పుడు నాలో కళను నెరవేర్చుకునే శక్తే లేదు, నాకిక సమయం దాటిపోయింది" అంటూ ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నాయి.
తెలుగు

@ThisIsRagh "ఈ గాలిలో" పాట కోసం మళ్ళీ మళ్ళీ వెళ్ళాము అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి క్రేజీ అటువంటిది 👌💜
తెలుగు

సంగీత సామ్రాట్ "చక్రవర్తి" – ఒక యుగానికి స్వరరూపం
తెలుగు సినీ సంగీత చరిత్రలో కొన్ని పేర్లు కేవలం సంగీత దర్శకులుగా మాత్రమే కాకుండా ఒక కాలానికి ప్రతీకలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన వ్యక్తులలో "చక్రవర్తి" ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో కొనసాగిన ఆయన, అసాధారణమైన పని వేగం, అపారమైన సృజనాత్మకత, సంగీతంపై ఉన్న పట్టు ద్వారా ఒక ప్రత్యేక యుగాన్ని నిర్మించారు.
ముఖ్యంగా ఎనభయ్యవ దశకంలో తెలుగు సినిమాకు వినిపించిన స్వరాలలో చక్రవర్తి ముద్ర అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ, ఆయన సాధించిన విజయాలు, సృష్టించిన ప్రభావంతో పోలిస్తే, కె.వి. మహదేవన్ లేదా ఇళయరాజాలకు లభించినంత విశిష్టమైన గుర్తింపు మాత్రం ఆయనకు దక్కలేదనే అభిప్రాయం సినీ అభిమానుల్లో తరచుగా వినిపిస్తుంది.
చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించిన ఆయన, మహావాది వెంకటప్పయ్య వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. సంగీతంపై ఉన్న ఆసక్తి ఆయనను మద్రాసుకు తీసుకెళ్లింది. "మూగ ప్రేమ" చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆయన, క్రమంగా అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఎదిగారు. ముఖ్యంగా దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో ఏర్పడిన అనుబంధం ఆయన ప్రస్థానంలో కీలక పాత్ర పోషించింది.
చక్రవర్తి గురించి ఎక్కువగా చెప్పుకునే విషయం ఆయన పని వేగం. ఒకేసారి అనేక చిత్రాలకు సంగీతం అందిస్తూ కూడా నిర్మాతలు, దర్శకులు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వగలగడం ఆయన ప్రత్యేకత. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఆయన, తెలుగు సినీ చరిత్రలో అత్యధిక చిత్రాలకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులలో ఒకరిగా నిలిచారు. ఎనభయ్యవ దశకంలో తెలుగు సినిమా ఎక్కడ వినిపించినా, అక్కడ చక్రవర్తి సంగీతం కూడా వినిపించేదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక సంవత్సరంలో 50 కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం చేశారు అని చెబుతారు, అంటే దాదాపు వారానికి ఒకటి.
చక్రవర్తి సంగీతం అంటే చాలామందికి ముందుగా ఉత్సాహభరితమైన నృత్య గీతాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆయన ప్రతిభ అక్కడితో పరిమితం కాదు. ప్రేమగీతాలు, జానపద గీతాలు, కుటుంబ కథా చిత్రాలకు తగ్గ భావోద్వేగ స్వరాలు, భక్తి గీతాలు – ప్రతి విభాగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా మధురమైన మెలోడీలకు ఆయన ప్రాణం పోశారు.
గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో చక్రవర్తికి ఉన్న అనుబంధం తెలుగు సినీ సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అలాగే ఆత్రేయ, వేటూరి, సి. నారాయణరెడ్డి, జాలాది వంటి ప్రముఖ గేయరచయితల పదాలకు ఆయన స్వరాలు విశేషమైన ప్రజాదరణను తెచ్చాయి. కొత్త గాయకులకు అవకాశాలు కల్పించడంలో కూడా ఆయన ముందుండేవారు.
తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఆయన అందించిన మరో ముఖ్యమైన సేవ శిష్యులను తీర్చిదిద్దడం. కీరవాణి ఆయన వద్ద సహాయకుడిగా పనిచేయగా, రాజ్-కోటి ద్వయంలోని కోటి కూడా ఆయన వద్ద సంగీత రంగంలోని అనుభవాన్ని సంపాదించాడు. ఈ విధంగా ఆయన ప్రభావం ఒక తరం సంగీత దర్శకులపై పడింది.
"నేటి భారతం", "శ్రావణ మేఘాలు" చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారాలు అందుకున్న చక్రవర్తి, గాయకుడు, నటుడు, డబ్బింగ్ కళాకారుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. 2002 ఫిబ్రవరి 3న ఆయన కన్నుమూసినా, ఆయన సృష్టించిన సంగీత సంపద మాత్రం చిరంజీవిగా నిలిచిపోయింది.
తెలుగు సినీ సంగీత చరిత్రలో ఒక స్వర్ణయుగానికి స్వరరూపం ఇచ్చిన మహానుభావుడిగా, అసాధారణమైన పని వేగంతో రికార్డులు సృష్టించిన సంగీత సామ్రాట్‌గా చక్రవర్తి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
#RaghavMuzix
తెలుగు

@SedimentaryRok సినిమా హిట్ అయ్యింది
బాచి ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాధ్ కి ఒక turning point..
రవితేజ, పూరీ కలయికలో వరసగా మూడు హిట్లు వచ్చాయి.
(ఇట్లు.., ఇడియట్, అమ్మా నాన్నా.. )
తెలుగు

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001) చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశం.
మన సినిమాల్లో తాళికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాత తెలుగు సినిమాల్లో, క్లైమాక్స్‌లో విలన్ హీరోయిన్ మెడలో తాళి కట్టబోతున్న సమయంలో హీరో వచ్చి ఆమెను రక్షించడం ఒక సుపరిచితమైన మూస. ఎందుకంటే తాళి కట్టడం, కట్టకపోవడం అనేది జీవితాన్ని నిర్ణయించే అంశంగా చూపించేవారు.
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కూడా అదే దారిలో వెళ్లొచ్చు. కానీ పూరీ జగన్నాధ్ ఆ మూసను ధైర్యంగా బద్దలు కొట్టారు. ఈ చిత్రంలో విలన్ శ్రావణికి బలవంతంగా తాళి కడతాడు. ఆ సంఘటనతో ఆమె కుంగిపోతుంది, జీవితమే ముగిసిపోయిందని భావిస్తుంది.
కానీ బలవంతంగా కట్టిన తాళికి ఎలాంటి విలువ లేదని, ఒక స్త్రీ జీవితాన్ని ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఎవరూ నిర్ణయించలేరని చెప్పేలా ఆ విషయాన్ని డ్రామా లేకుండా తీసి పడేయడం చాలా కొత్తగా అనిపించింది.
ఆ సన్నివేశంలో నాకు కేవలం ఒక దర్శకుడు కాదు, సమాజం అలవాటు పడిన కొన్ని మూస భావనలను తొలగించే ఒక విప్లవకారుడిగా పూరీ జగన్నాధ్ కనిపించాడు. 🔥🔥
తెలుగు

కళాతపస్వి గారి చిత్రాలలో అన్నీ క్లాసిక్ లే .
సాగరసంగమం , సప్తపది , శంకరాభరణం , స్వాతిముత్యం , సూత్రధారులు , సిరిసిరిమువ్వ , శృతిలయలు , సిరివెన్నెల , ఆనంద భైరవి .. ఆల్మోస్ట్ అన్నీ నేను రిపీట్ లో చూసే సినిమాలు.
అయినప్పటికీ ..
నాకు విపరీతంగా నచ్చే సినిమా మాత్రం స్వాతి కిరణం.
నా అంతటివాడు లేడనే గర్వం ,
ఒక పిల్లకుంక నన్ను మించిపోతాడేమోననే ఈర్ష్య సకల మానసిక వ్యాధులన్ని కలగలిసిన ఓ విద్వాంసుడు గా మమ్ముక్క యాక్టింగ్ పీక్స్ లో ఉంటది !!
ఇక ఈ సినిమా కి వాణి జయరాం గాత్రం వెన్నెముక .
కానీ బాక్సాఫీస్ దగ్గర ఎందుకో నిలబడలేదు.

ɾąցհąѵ@ThisIsRagh
మీ అభిప్రాయంలో వీటిలో కె.విశ్వనాథ్ గారి ఉత్తమ చిత్రం?
తెలుగు

@ThisIsRagh You can like later but answer my question your honor
English

















