ɾąցհąѵ

31.5K posts

ɾąցհąѵ banner
ɾąցհąѵ

ɾąցհąѵ

@ThisIsRagh

విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ♥️

Sumali Aralık 2023
726 Sinusundan1.1K Mga Tagasunod
Naka-pin na Tweet
ɾąցհąѵ
ɾąցհąѵ@ThisIsRagh·
Choose your hard...🔥🔥
ɾąցհąѵ tweet media
English
10
12
48
13.9K
ɾąցհąѵ
ɾąցհąѵ@ThisIsRagh·
@SedimentaryRok సినిమా హిట్ అయ్యింది బాచి ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాధ్ కి ఒక turning point.. రవితేజ, పూరీ కలయికలో వరసగా మూడు హిట్లు వచ్చాయి. (ఇట్లు.., ఇడియట్, అమ్మా నాన్నా.. )
తెలుగు
1
0
1
58
Sed Rock
Sed Rock@SedimentaryRok·
@ThisIsRagh అందుకే పోయిందేమో
తెలుగు
1
0
2
80
ɾąցհąѵ
ɾąցհąѵ@ThisIsRagh·
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001) చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశం. మన సినిమాల్లో తాళికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాత తెలుగు సినిమాల్లో, క్లైమాక్స్‌లో విలన్ హీరోయిన్ మెడలో తాళి కట్టబోతున్న సమయంలో హీరో వచ్చి ఆమెను రక్షించడం ఒక సుపరిచితమైన మూస. ఎందుకంటే తాళి కట్టడం, కట్టకపోవడం అనేది జీవితాన్ని నిర్ణయించే అంశంగా చూపించేవారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కూడా అదే దారిలో వెళ్లొచ్చు. కానీ పూరీ జగన్నాధ్ ఆ మూసను ధైర్యంగా బద్దలు కొట్టారు. ఈ చిత్రంలో విలన్ శ్రావణికి బలవంతంగా తాళి కడతాడు. ఆ సంఘటనతో ఆమె కుంగిపోతుంది, జీవితమే ముగిసిపోయిందని భావిస్తుంది. కానీ బలవంతంగా కట్టిన తాళికి ఎలాంటి విలువ లేదని, ఒక స్త్రీ జీవితాన్ని ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఎవరూ నిర్ణయించలేరని చెప్పేలా ఆ విషయాన్ని డ్రామా లేకుండా తీసి పడేయడం చాలా కొత్తగా అనిపించింది. ఆ సన్నివేశంలో నాకు కేవలం ఒక దర్శకుడు కాదు, సమాజం అలవాటు పడిన కొన్ని మూస భావనలను తొలగించే ఒక విప్లవకారుడిగా పూరీ జగన్నాధ్ కనిపించాడు. 🔥🔥
తెలుగు
1
4
34
1.6K
ɾąցհąѵ
ɾąցհąѵ@ThisIsRagh·
@Kadirodu_Offl విషాద ముగింపు వల్ల కావచ్చు..
తెలుగు
0
0
0
63
🔱🐎 సుజత్ 🕉️☪️✝️
కళాతపస్వి గారి చిత్రాలలో అన్నీ క్లాసిక్ లే . సాగరసంగమం , సప్తపది , శంకరాభరణం , స్వాతిముత్యం , సూత్రధారులు , సిరిసిరిమువ్వ , శృతిలయలు , సిరివెన్నెల , ఆనంద భైరవి .. ఆల్మోస్ట్ అన్నీ నేను రిపీట్ లో చూసే సినిమాలు. అయినప్పటికీ .. నాకు విపరీతంగా నచ్చే సినిమా మాత్రం స్వాతి కిరణం. నా అంతటివాడు లేడనే గర్వం , ఒక పిల్లకుంక నన్ను మించిపోతాడేమోననే ఈర్ష్య సకల మానసిక వ్యాధులన్ని కలగలిసిన ఓ విద్వాంసుడు గా మమ్ముక్క యాక్టింగ్ పీక్స్ లో ఉంటది !! ఇక ఈ సినిమా కి వాణి జయరాం గాత్రం వెన్నెముక . కానీ బాక్సాఫీస్ దగ్గర ఎందుకో నిలబడలేదు.
🔱🐎 సుజత్ 🕉️☪️✝️ tweet media
ɾąցհąѵ@ThisIsRagh

మీ అభిప్రాయంలో వీటిలో కె.విశ్వనాథ్ గారి ఉత్తమ చిత్రం?

తెలుగు
1
0
10
849
ɾąցհąѵ
ɾąցհąѵ@ThisIsRagh·
ఇష్టం లేని వృత్తి చేయడం వేరేవారి జీవితాన్ని మనం జీవించడం లాంటిది. పిల్లలు భవిష్యత్తులో ఏం చేయాలి అనుకుంటున్నారో పిల్లల ఇష్టాలకు వదిలేయండి, లేదా ఒప్పించండి. కానీ బలవంతంగా మీరు అనుకున్న మార్గంలో వాళ్ళను నడిపించకండి.
AVM@AvmNews7

తల్లిదండ్రుల కల కోసం నా ఆత్మను చంపుకున్నా..!: సోషల్ మీడియాలో కన్నీరు మున్నీరవుతున్న డెంటిస్ట్రీ యువతి ఆవేదన!💔 తల్లిదండ్రుల కోరిక మేరకు ఇష్టం లేకపోయినా Dentistry చదివి డాక్టర్ అయ్యానని, కానీ తన అసలైన కల అయిన Artist అవ్వాలనే కోరికను పూర్తిగా కోల్పోయానని ఒక యువతి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. "కోర్సు పూర్తి చేయడానికి నా ఆత్మను సైతం చంపుకున్నా.. ఇప్పుడు నాలో కళను నెరవేర్చుకునే శక్తే లేదు, నాకిక సమయం దాటిపోయింది" అంటూ ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నాయి.

తెలుగు
0
0
4
148
ɾąցհąѵ
ɾąցհąѵ@ThisIsRagh·
మీ అభిప్రాయంలో వీటిలో కె.విశ్వనాథ్ గారి ఉత్తమ చిత్రం?
ɾąցհąѵ tweet mediaɾąցհąѵ tweet mediaɾąցհąѵ tweet mediaɾąցհąѵ tweet media
తెలుగు
217
11
269
53.9K
ɾąցհąѵ
ɾąցհąѵ@ThisIsRagh·
స్వాతిముత్యం క్లైమాక్స్ 😭 "లలితా ఇప్పుడే వెళ్లిపోతున్నావేంటి" "ఏం వద్దా" "ఒక రెండు నెలలు ఉండకూడదు?" "ఎందుకు?" "ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడు సరాసరి స్వర్గానికే వెళ్లొచ్చు.. అందుకే.."
తెలుగు
4
10
132
9K