V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS
#Hyderabad జూబ్లీబస్ స్టేషన్ లో బుధవారం శ్రీ సత్యసాయి సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని #TSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC ) గారు ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని.. ప్రయాణికులకు స్వయంగా ఆయన భోజనం వడ్డించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి.. చలివేంద్రం ఏర్పాటు చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులైన రాజు, ఉదయ్, వంశీ, ఫణిశంకర్, గంగాధర్ శర్మ, వినోద్, సుదీప్, ఉదయ్ నారాయణ, శ్రీనివాస్, శ్రవణ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వేంకటేశ్వర్లు, రంగారెడ్డి డిప్యూటీ ఆర్ఎమ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
@TSRTCHQ @PROTSRTC