Dy.Rm(O)/Ghz retweetledi

హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది. తాజాగా ఆ రూట్ లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఆ రూట్ లో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
@TSRTCHQ @PROTSRTC @DyRMOGhz @CTMOTSRTC @Govardhan_MLA @puvvada_ajay @eenadulivenews @v6velugu

తెలుగు



















