IBM❤️PSPK✊
1.6K posts





బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో కూడుకున్నది శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మరణించిన తరువాత జీవించే అవకాశం అవయవ దానంతోనే లభిస్తుందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబాన్ని ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి శ్రీ వసంత రాయలు కుటుంబం మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ పి. హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “ శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు మరణం ఆ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు. జన సైనికుడు అకాల మరణం విషయం తెలిసిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎంతో బాధపడ్డారు. తక్షణం కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని ఇక్కడికి పంపించార"న్నారు. • శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితోనే... మృతుడు కుమారుడు శ్రీ సీతారామరాజు మాట్లాడుతూ.. “మా నాన్న గారు మరణానంతరం కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దేహంలో జీవించే అవకాశం ఉంటుందని అవయవదానానికి అంగీకరించాం. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే మా కుటుంబం అవయవదానానికి అంగీకరించాం. పుట్టిన ప్రతి ఒక్కరు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఆయనను స్ఫూర్తిని అందిపుచ్చుకొని అవయవదానానికి అంగీకరించాం. డాక్టర్ అనూష మాట్లాడుతూ... “పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు అభినందనీయులు. కష్ట సమయంలో కూడా నలుగురిని బతికించాలన్న వారి ఆకాంక్ష చాలా గొప్పది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా.. మనో ధైర్యం కోల్పోకుండా అవయవదానం గురించి మేము చెప్పిన వెంటనే ఒప్పుకున్నార"న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీ తోట సత్యనారాయణ, శ్రీ చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.





If India manages to Draw today will Giveaway ₹5000 to 3 Lucky persons who Likes and Repost this. Make Sure to Follow Me and @FairWin_247 Tag 5 of your Friends as well. #ENGvIND | #ENGvsIND

If India manages to Draw today will Giveaway ₹5000 to 3 Lucky persons who Likes and Repost this. Make Sure to Follow Me and @FairWin_247 Tag 5 of your Friends as well. #ENGvIND | #ENGvsIND




ఎవడు చెప్తాడు అన్న ఇలా 😭🙏 నెగిటివ్ చేస్తున పోయేది నేను గా మీరు happy గా ఉండండి అంటున్నావ్ @PawanKalyan 🥺🙏 ధర్మం కోసం తీసావ్ హిందువులే చూసుకుంటారు ♥️ #HHVMBlockbuster

