"ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు." అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.
యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది.
ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు.
మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి.
ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్ సెక్స్‌టార్షన్ కు దిగుతారు.
పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి.
క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి.
ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్!
#CyberCrime#FakeDatingApps#HoneyTrap#Sextortion#BeAlert#CyberSecurity#HyderabadPolice
సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం సంప్రదాయ బద్దంగా జరిగింది. దేవాన్ష్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని… అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు ఇలాగే చిరకాలం దేవాన్ష్ కు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మనవడి వేడుకలో పాల్గొనడం నాకు గొప్ప జ్ఞాపకంగా ఎప్పటికి నిలిచి ఉంటుంది.
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీధర్ చౌదరి గారు నన్ను నా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పార్టీ బాధ్యతలు స్వీకరించిన వారికి హృదయపూర్వక అభినందనలు. సమన్వయం, క్రమశిక్షణ, అంకితభావంతో కలిసి పనిచేస్తూ టీడీపీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
@ntrtrust ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే తెలంగాణలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించాలని మా విన్నపం ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు తెలుగు వారందరికీ ప్రపంచంలో గుర్తింపు చచ్చిన గొప్ప వ్యక్తి అన్న NTR@ntrtrust
మీ ఆరోగ్యం… మీ గ్రామంలోనే!
NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న NTR సంజీవని మొబైల్ క్లినిక్స్,
ప్రాథమిక వైద్య సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం ద్వారా
గ్రామీణ మరియు దూరప్రాంతాల ఆరోగ్య అవసరాలను తీర్చుతున్నాయి.
ఈ క్లినిక్స్ ద్వారా:
- స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు
- అవసరమైన ఉచిత మందుల పంపిణీ
- శిక్షణ పొందిన వైద్య బృందం నుండి మార్గదర్శనం
- ఆరోగ్య అవగాహన మరియు నిరోధక వైద్య సూచనలు
ప్రతి వ్యక్తి ప్రాథమిక ఆరోగ్య సేవలకు చేరువ కావాలని,
“ఎవరూ ఆరోగ్య సేవలకు దూరం కాకూడదు” అనే లక్ష్యంతో
NTR సంజీవని నిరంతరం సేవలను విస్తరిస్తోంది.
NTR Sanjeevani Mobile Clinics — ప్రజల ఆరోగ్యం కోసం నిరంతర ప్రయాణం.
#NTRTrust#NTRMemorialTrust#health#healthcamp#freecamp#freehealthcheckup#FreeHealthCheckUpCamp#freehealthcamp#FreeMedicalCamp#FreeMedical#FreeMedicalCheckUp#freemedicalservices