



KB
56.1K posts

@KiranBoidhapu
News and Views about Politics | Sports | Cinema Catch me on @PointingoutOffl






తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరా •సురక్షితంగా పట్టుకునేందుకు తక్షణ చర్యలకు ఆదేశం •యూనివర్శిటీలో విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచన తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు ఆరా తీశారు. ప్రస్తుతం చిరుత ఎక్కడ ఉంది? పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో రాజమండ్రి నుంచి ఫోన్ లో సమీక్షించారు. చిరుత ప్రస్తుతం వినియోగంలో లేని గదిలో నక్కి ఉన్నట్టు, సిబ్బంది ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణమే జూ సిబ్బంది సహకారం తీసుకోవాలని చెప్పారు. రెస్కూ సందర్భంగా విద్యార్థులు, విశ్వ విద్యాలయం సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిరుత సంచారంపై ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. @HANUMAN_APGOV @PIB_India @IPR_AP @pibvijayawada















