
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨 ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని జైలు జీవితం అనుభవించిన కవిత ఇప్పుడు తెలంగాణలో సారా దందాలోకి దిగాలని భావిస్తుంది. త్వరలో హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇవ్వనున్న మైక్రో బ్రూవరీ లైసెన్సుల కోసం ఇప్పటికే తన వారితో అప్లికేషన్లు వేయించి, దాదాపు 10 మైక్రో బ్రూవరీలు హైదరాబాద్ నగరంలో కవిత భాగస్వామ్యంతో ప్రారంభం కానున్నాయి. కవిత పీఏ శరత్ రావు కనుసన్నల్లో, కవితకు సన్నిహితులు అజయ్ రావు, అజిత్ రావు, ప్రశాంత్ కుమార్ తదితరులకు చెందిన కంపెనీల ద్వారా ఇప్పటికే ప్రభుత్వానికి అప్లికేషన్ల సమర్పణ పూర్తి కాగా, వాటికి అప్రూవల్స్ కోసం కవిత ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు పూర్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే లైసెన్స్ మంజూరు సైతం ప్రారంభం కానుంది. పైన తెలిపిన వ్యక్తులకు లైసెన్సులు రాగానే కవిత తన పీఏ శరత్ మరియు మరో ఇద్దరు సిబ్బంది ద్వారా ఈ భాగస్వామ్యం తీసుకోనున్నారు. ఇప్పటికే పైన వ్యక్తుల పేర్ల మీద నడుస్తున్న మద్యం వ్యాపారం కవిత చేతితోనే ఉండగా ఇపుడు కొత్తగా మైక్రో బ్రూవరీస్ సైతం వారి పేరుతో కవిత చేతిలోకి రానున్నాయి. కవిత సిబ్బంది మధ్య ఈ అంశంపై భేదాభిప్రాయాలు వచ్చి విషయం బయటకు పొక్కడంతో “అక్కకి ఇంకా ఢిల్లీ వాసన పోలేదు” అని జాగృతి వర్గాల్లో చర్చ మొదలైంది.












