Vemula Prashanth Reddy

1.7K posts

Vemula Prashanth Reddy banner
Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

@VPR_BRS

Ex Minister for Roads & Buildings, Legislative affairs and Housing, MLA from Balkonda, Telangana.

Hyderabad, India Katılım Ekim 2018
40 Takip Edilen27.2K Takipçiler
Vemula Prashanth Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం రోడ్ల నిర్మాణాల గురించి ప్రశ్నించాడు. డిసెంబర్ 23 నుండి ఈరోజు వరకు ప్లాన్ మరియు నాన్ ప్లాన్ వర్కులు 524 శాంక్షన్ చేస్తే.. కంప్లీట్ చేసింది 49 మాత్రమే. అంటే రెండున్నర సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేసిన పనులు 9 శాతం మాత్రమే. 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే.. 112 కిలోమీటర్లు పూర్తి చేసారు. అంటే 5 శాతం మాత్రమే. ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన పనులు పూర్తి చేయాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
తెలుగు
5
26
55
832
Vemula Prashanth Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
హ్యామ్ పెద్ద స్కామ్.. హ్యామ్ మోడల్ రోడ్ల పేరిట కాంగ్రెస్ సర్కార్ రూ. 8 వేల కోట్ల స్కామ్ ను బయటపెట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS🔥
తెలుగు
0
22
67
903
Vemula Prashanth Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రెండున్నరేళ్లలో 2070 కి.మీ రోడ్లు శాంక్షన్ చేసి కేవలం 112 కి.మీ మాత్రమే పూర్తి చేశామని అసెంబ్లీ సాక్షిగా స్వయంగా చెప్పిన ఆర్ & బి మినిష్టర్ ఇదీ కాంగ్రెస్ పనితనానికి నిదర్శనం! అంటే ఈ లెక్కన వీళ్లు శాంక్షన్ చేసిన రోడ్లు పూర్తి చేయాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
తెలుగు
0
38
120
1.4K
Vemula Prashanth Reddy
తెలంగాణ రాష్ట్రంలో రహదారులు, వంతెనల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రస్తుతం రాష్ట్రంలోని R&B మరియు పంచాయతీ రాజ్ రోడ్లు మోకాళ్ల లోతు గుంతలతో అధ్వాన్నంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లలో రెండు వర్షాకాలాలు గడిచినా, దెబ్బతిన్న రోడ్లకు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 👉 గత రెండు బడ్జెట్‌ లలో సుమారు 4800 కోట్ల రూపాయలు రోడ్ల కోసం కేటాయించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా, వాస్తవానికి 25 శాతం నిధులు (సుమారు 1,200 కోట్లు) కూడా విడుదల చేయలేదని వేముల విమర్శించారు. విడుదలైన ఆ అరకొర నిధులు పాత బిల్లులు చెల్లించడానికి,కొత్త పనులు ముందుకు సాగటానికి ఏ మాత్రం సరిపోవు. అందుకే కాంట్రాక్టర్లు ఎవరు పనులు చేయడానికి ముందుకు రావటం లేదు. కేసీఆర్ ప్రభుత్వం 9 ఏండ్లలో రోడ్లు, బ్రిడ్జ్ ల అభివృద్ధి కొరకు సుమారు 25వేల కోట్లు నిధులు విడుదల చేసాం. అంటే.దాదాపు ప్రతి సంవత్సరం 2600కోట్లు యావరేజ్ గా విడుదల చేశాం. మేము పని చేసినంత ఈ ప్రభుత్వం పని చేయాలి అంటే పెరిగిన రెట్ల ప్రకారం మినిమమ్ యావరేజ్ గా ప్రతి సంవత్సరం 4000కోట్ల రూపాయలు విడుదల చేయాలి. 4000కోట్లు విడుదల చేయాల్సిన దగ్గర కేవలం 1200కోట్లు మాత్రమే విడుదల చేయడంతో రోడ్ల ఇంత అధ్వాన్నంగా తయ్యారు అయ్యాయి 👉 కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా R&B మంత్రి ఇచ్చిన సమాచారాన్ని వేముల ఉదహరిస్తూ..2023 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు "రాష్ట్రవ్యాప్తంగా 524 రోడ్ల పనులు మంజూరు చేస్తే, కేవలం 49 పనులు మాత్రమే పూర్తయ్యాయి అన్నారు. ఇది కేవలం 9 శాతం మాత్రమే. అలాగే 2,070 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు మంజూరు కాగా, కేవలం 112 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయని మంత్రి స్వయంగా ఒప్పుకున్నారు" అని ఆయన వెల్లడించారు. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాతవి , కొత్తవి కలిపి కేవలం 300 కిలోమీటర్ల పని మాత్రమే చేశారు. అంటే నియోజకవర్గానికి యావరేజ్ గా 3 కిలోమీటర్ల పని మాత్రమే చేశారు. గత 60 యేండ్లలో 6000 కిలోమీటర్ల డబుల్ రోడ్లు వేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదేళ్లలో కొత్తగా దాదాపు 8,439 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చామని,485 కిలోమీటర్ల 4 లైన్ రోడ్లువేశాం అని అన్నారు. 👉 బిల్డింగ్స్ తెలంగాణ ఏర్పడక ముందు 60 ఏళ్ల కాలంలో అన్ని ప్రభుత్వాలు కలిపి 30 లక్షల చదరపు అడుగుల ఆర్ అండ్ బి (R&B) భవనాలను నిర్మిస్తే, కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం 9 ఏళ్లలో కోటి రెండు లక్షల చదరపు అడుగుల R & B శాఖ భవనాలను పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఇతర శాఖల భవనాలు మరో కోటి చదరపు అడుగులు అంటే మొత్తంగ 2 కోట్ల చదరపు అడుగుల మేర నూతన నిర్మాణాలను చేపట్టి రికార్డు సృష్టించామని గుర్తు చేశారు. KCR నిర్మించిన తెలంగాణ గర్వించదగ్గ అద్భుత కట్టడాలను ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షతో గాలికి వదిలేసిందని అన్నారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో, తెలంగాణ సమాజం గర్వపడేలా నిర్మించిన సచివాలయ భవన మెయింటెనెన్స్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సచివాలయం ప్రారంభించి 3 ఏళ్లు కావస్తున్నా,ఇప్పటికి మెయింటెనెన్స్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఐఐటి (IIT) హైదరాబాద్, జెఎన్‌టియు (JNTU) వంటి సంస్థలు సూచించిన విధంగా ప్రతి ఆరు నెలలకోసారి చేయాల్సిన పీరియాడికల్ మెయింటెనెన్స్ కుడా ఆగిపోయింది.మెయింటెనెన్స్ లేక కట్టడం పాడైపోతే కేసీఆర్ గారిపై, నాపై (ప్రశాంత్ రెడ్డి) నింద వేయొచ్చనే కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల స్మారకార్థం సుమారు 3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన అమరజ్యోతి, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రాంగణం కుడా నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిని ఇంకా ప్రజలకు అందుబాటులోకి తేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణాల్లో ఒకటైన అమరజ్యోతిని కనీసం ఊడ్చే నాథుడే లేడు. సెల్లార్లలో ఉన్న ఖరీదైన మోటార్ల వైరింగ్ లను ఎలుకలు కొరుకుతున్నా పట్టించుకునేవారు లేరు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహా ప్రాంగణం లోనికి ప్రజలకు అందుబాటులోకి రాకుండా తాళాలు వేశారని, ప్రాంగణం లోపల కనీసం ఉడిచేవాడు కుడా లేరని విమర్శించారు. "కేసీఆర్ కట్టారు కాబట్టి సచివాలయం, అమరాజ్యోతి, 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ కట్టడాలకు చెడ్డ పేరు తేవాలి, అవి మెయింటెనెన్స్ లేక పాడైపోతే ప్రజల్లో వ్యతిరేకత తేవాలి" అనే నీచమైన ఆలోచనతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రశాంత్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను స్వయంగా ప్రభుత్వమే నాశనం చేయడం ప్రపంచంలో ఎక్కడా ఉండదని, ఇది తెలంగాణ సమాజం గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.
Vemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet media
తెలుగు
0
1
3
76
Vemula Prashanth Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రీజినల్ రింగ్ రోడ్ కోసం గత మూడు బడ్జెట్లలో రూ. 1,525 కోట్లు కేటాయించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. భూసేకరణ కూడా చేయలేదు. 2024లో డిసెంబర్ 29 నాడు రెండేళ్లలో RRR ను పూర్తి చేస్తామని కోమటిరెడ్డి చెప్పాడు. అంటే ఇంకొక 9 నెలల్లో పూర్తి చేస్తారా? పదిహేను నెలల కిందట టెండర్లు పిలిచి, ఇంతవరకు టెండర్లను ఓపెన్ చేయలేదు. మాటలు చెప్పుడు తప్ప చేతలు లేవు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఆమోదమే రాలేదు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
తెలుగు
0
41
125
1.9K
Vemula Prashanth Reddy
👉 RRR (రీజనల్ రింగ్ రోడ్) రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు హైదరాబాద్ నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని RRR కు రూపకల్పన చేసింది కేసీఆర్ గారేనని, 2015 లోనే అలైన్‌మెంట్, డిజైన్ పనులు పూర్తి చేస్తే కేంద్రం కాలయాపన చేసి 2021లో భారత్ మాలా ప్రాజెక్టులో చేర్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అత్యంత వేగంగా (యుద్ధ ప్రాతిపదికన) 80% మేర 3D సర్వే పనులు, భూముల గుర్తింపు పూర్తి చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 27 నెలల్లో కేవలం మిగిలిన 20% సర్వే పనులు మాత్రమే చేసి భూసేకరణకు ఒక్క పైసా కుడా ఖర్చు చేయకుండా ప్రాజెక్ట్ ని గాలికొదిలేశారు. 2024 డిసెంబర్ 29న ఉత్తర భాగం RRR కు టెండర్లు పిలిచినా సందర్బంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "RRR రైట్ రైట్" "రోడ్డెక్కిన ఉత్తర రింగ్ రోడ్" అని, ఫిబ్రవరి 2025 లో పనులు మొదలు పెట్టి,రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆర్భాటంగా మీడియా ముందు ప్రకటనలు చేసి 15 నెలలు గడుస్తున్న నేటికీ టెండర్లు ఓపెన్ చేయలేదని ఏద్దేవా చేసారు.అసలు వాస్తవం ఏంటంటే... ప్రాజెక్ట్ సంబందించి కేంద్రం ప్రభుత్వం (Morth) నుండి ఇంకా తుది ఆమోదం లభించలేదని రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ పద్దుల్లో వెల్లడించింది అని చెప్పారు. వరుసగా గత రెండు బడ్జెట్ లల్లో కుడా RRR కోసం రూ.1525 కోట్లు కేటాయించినట్లు చూపుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క రూపాయి కుడా ఖర్చు చేయలేదని విమర్శించారు. దక్షిణ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీనివల్ల ప్రాజెక్టు మొత్తం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. "మంత్రి కేవలం ప్రెస్ మీట్‌లకు, పేపర్ ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధి చూపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 👉 HAM ... ఒక పెద్ద స్కామ్ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ముసుగులో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో చేపట్టే రోడ్ల నిర్మాణాల్లో 8 వేల కోట్ల భారీ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. R&B శాఖలో సుమారు 6092 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ. 13,000 కోట్ల టెండర్లు పిలిచారని, ఇందులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఎప్పుడు లేని 10 % మొబైలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని తీసుకవచ్చి పనులు మొదలు పెట్టకముందే HAM కాంట్రాక్టర్లకు సుమారు రూ. 1300 కోట్లు R&B లో, 600 కోట్లు పంచాయతి రాజ్ లో మొత్తంగా 1900 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చి దోపిడీకి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. పాత మరియు ప్రస్తుతం నడుస్తున్న పనుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, HAM కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా మొబైలైజేషన్ అడ్వాన్స్ లు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటన్నారు. టెండర్లలో 5% కంటే ఎక్కువ వేయకూడదనే నిబంధనను ఎత్తివేసి, కాంట్రాక్టర్లకు ఎంతైనా అదనంగా వేసుకునే వెసులుబాటు కల్పించారని, దీనివల్ల 40% వరకు మార్జిన్ వచ్చేలా ప్లాన్ చేసి సుమారు 5200 కోట్ల R & B HAM పనుల్లో, 2400 కోట్లు పంచాయతీ రాజ్ HAM పనుల్లో మొత్తంగా 7600 కోట్లు దోపిడీకి తెర లేపరని ఆరోపించారు. సాధారణంగా కిలోమీటర్ డబుల్ రోడ్డు వైడెనింగ్ నిర్మాణానికి రూ. 1.75 కోట్లు ఖర్చయితే, ఈ HAM మోడల్ లో ప్రభుత్వం రూ. 3.30 కోట్లుగా టెండర్లో చూయించారని అంటే రెట్టింపు ఖర్చు చూపిస్తూ ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తున్నారని గణాంకాలతో వివరించారు. 15 సంవత్సరాల మెయింటెనెన్స్ పేరుతో ఏటా 4% నిధులను 15 సార్లు కేటాయించడం ద్వారా,రెండు సార్లు 8 % నిధులను కేటాయించడం ద్వారా మరో రూ.10,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ HAM మాడల్ లో ఇప్పుడు చేపట్టిన 6090 కి.మి రోడ్ల అభివృద్ధి పనులను సాధారణంగా 6100 కోట్ల రూపాయలతో పూర్తి చేయవచ్చు. కావున Ham టెండర్ల లో చూయించిన 13000 కోట్ల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సమాకూర్చే 40 శాతం నిదులు అంటే 5200 కోట్లతోనే ఈ పనులను అటు ఇటుగా పూర్తి చేయవచ్చు. కాబట్టి HAM మాడల్ అవసరం లేదు. కావున కేవలం ప్రజల సొమ్మును దోచుకొని దాచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం HAM మాడల్ ను తెస్తున్నారు. మొత్తం 34 ప్యాకేజీలను కేవలం 5, 6 గురు కాంట్రాక్టర్లు 20 శాతం ఎక్సెస్ తో దక్కించుకోబోతున్నారని, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగబోయే దోపిడీ అని విమర్శించారు. ఈ కుంభకోణంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) తో పాటు అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ అవినీతిలో భాగస్వాములైన అధికారులు, కాంట్రాక్టర్లు కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని, బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో దీనిపై పోరాడుతుందని స్పష్టం చేశారు.
Vemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet media
తెలుగు
0
1
9
239
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
👉 అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం* 👉 మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులను వంచించిన బడ్జెట్ 👉 ఆరు గ్యారంటీలకు మంగళం పాడిన బడ్జెట్* 👉 ప్రజలకు ఉపయోగపడే స్కీమ్‌లకు సరైన కేటాయింపులు లేవు..అవినీతి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులకు భారీ నిధులు 👉 ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ 👉 మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీతో పేద ప్రజలను, మహిళలను, నిరుద్యోగులను పూర్తిగా వంచించిన బడ్జెట్‌గా ఉందని అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైంది. అయినా కూడా మళ్ళీ అదే విధంగా అంకెల మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది అని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై, 420 హామీల అమలులో బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదు అని విమర్శించారు. ప్రజలకు పనికొచ్చే స్కీం లకు కేటాయింపు లు లేవు కానీ స్కామ్ లు చేసే ప్రాజెక్ట్ లకు కేటాయింపు లు చేసారు కోటి 58 లక్షల మహిళలకు ఇస్తానన్న ₹2500 చేయూత పథకం ప్రస్తావనే లేదు వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్‌ను ₹2000 నుండి ₹4000కి పెంపు కేటాయింపులు లేవు తులం బంగారం హామీ – పూర్తిగా మర్చిపోయారు జాబ్ క్యాలెండర్ పూర్తిగా విస్మరించబడింది. పూర్తి కాలేని రుణమాఫీపై స్పష్టత లేదు.“రైతు భరోసా” పేరుతో హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు మూడు పంటలకు ఎగ్గొట్టారు. ఆచరణ కు సాధ్యం కానీ రాజీవ్ యువవికాసానికి మాత్రం బడ్జెట్ లో ప్రతి సారి కేటాయింపులు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో ఈ బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉంది. ఈ ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ.. ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదు. *మొతంగా ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను పూర్తిగా వంచించే బడ్జెట్‌గా నిలిచింది. ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని అన్నారు* ఎన్నికల అప్పుడు ప్రజలకు అనేక హామీలతో ఆశలు కల్పించి బడ్జెట్ లో కేటాయింపులు చేయక పేద ప్రజలను నట్టేట ముంచారు అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు #KCR #KCROnceAgain #ktrbrs #brssocialmedia #brspartyoffice #brsvibe #brspartyonline #kcrbrspresident #KTR
Vemula Prashanth Reddy tweet media
తెలుగు
0
8
24
520
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
కొత్త ఆశలు, కొత్త విజయాలు మీవే కావాలి పచ్చడి రుచుల్లా జీవితం షడ్రుచులతో కూడి ఆనందంగా ఉండాలి తెలుగు కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావాలి ఉగాది పండుగ మీ ఇంట నిండా సంతోషాలు నింపాలి చేదు మరిచి మిఠాయి రోజులకి స్వాగతం పలుకుతూ ప్రతి రోజు పండుగలా మారాలి నవ్వులు, విజయాలు మీ వెంట ఉండాలి అని కోరుకుంటూ #తెలంగాణ_రాష్ట్ర_ప్రజలందరికి_శ్రీ_పరాభవ_నామ #ఉగాది_పండుగ_పర్వదిన_శుభాకాంక్షలు #kcrbrspresident #brsvibe #brspartyoffice #brspartyonline #brssocialmedia #ktrbrs #KCROnceAgain #KCR
Vemula Prashanth Reddy tweet media
తెలుగు
3
2
34
374
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
కొత్త ఆశలు, కొత్త విజయాలు మీవే కావాలి పచ్చడి రుచుల్లా జీవితం షడ్రుచులతో కూడి ఆనందంగా ఉండాలి తెలుగు కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావాలి ఉగాది పండుగ మీ ఇంట నిండా సంతోషాలు నింపాలి చేదు మరిచి మిఠాయి రోజులకి స్వాగతం పలుకుతూ ప్రతి రోజు పండుగలా మారాలి నవ్వులు, విజయాలు మీ వెంట ఉండాలి అని కోరుకుంటూ #తెలంగాణ_రాష్ట్ర_ప్రజలందరికి_శ్రీ_పరాభవ_నామ #ఉగాది_పండుగ_పర్వదిన_శుభాకాంక్షలు #kcrbrspresident #brsvibe #brspartyoffice #brspartyonline #brssocialmedia #ktrbrs #KCROnceAgain #KCR
Vemula Prashanth Reddy tweet media
తెలుగు
1
3
11
202
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
👉 గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్ల, అబద్ధాల పుట్ట –చిత్తు కాగితం తో సమానం 👉 గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను తామే చేసినట్టు గవర్నర్ ప్రసంగం లో చెప్పించారు. 👉 కాంగ్రెస్ పాలన అంతా మోసమే 👉 గవర్నర్ ప్రసంగంలో స్కీమ్‌లు కంటే … స్కామ్‌ల సంబందించిన కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి 👉 6 గ్యారంటీలు గాలికి… 420 హామీలు అటకెక్కాయి 👉 మహిళలకు ₹2500 ఎక్కడ? ₹4000 పెన్షన్ పెంపు ఏమైంది? 👉 రుణమాఫీ సగం మందికే… రైతు భరోసా అడ్రస్ లేదు 👉 ఉద్యోగాలపై పచ్చి అబద్ధాలు – జాబ్ క్యాలెండర్ ఎక్కడ? 👉 అభివృద్ధి శూన్యం… ప్రచారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం* 👉 మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు జరిగిన గవర్నర్ ప్రసంగంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్లగా, అబద్ధాలతో నిండిపోయిందని, ప్రజలకు ఉపయోగపడే స్కీం ల కంటే స్కామ్‌లే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమేనని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్‌ను గవర్నర్ చదవడం తప్ప ఈ ప్రసంగంలో కొత్తదనం ఏమాత్రం కనిపించలేదని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీలు గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండేళ్లుగా మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని, ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు ₹4,000 పెన్షన్, దివ్యాంగులకు ₹6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, కొత్త పెన్షన్ల మంజూరుపై కూడా గవర్నర్ ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదన్నారు.తులం బంగారం హామీ అటకేక్కించారు అని అన్నారు. రైతులకు ₹2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పించడం పూర్తిగా అబద్ధమని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ పూర్తి కాలేదని, అయినప్పటికీ అందరికీ చేశామని ప్రచారం చేయడం మోసమని అన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఎకరాకు ₹15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రైతు భరోసా ఇచ్చామని చెప్పి అబద్దమాడి ఇప్పటికి రెండు సార్లు ఇచ్చి మూడు సార్లు ఎగొట్టి రైతులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. క్వింటాలుకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు రైతులకు అందలేదని, కొద్దిమందికి మాత్రమే ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం సుమారు 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కానీ గవర్నర్ ప్రసంగంలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పించడం వాస్తవాలకు విరుద్ధం అని అన్నారు. ఇవి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ఫలితమేనని, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్తగా ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ తమవిగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉండి, డొల్ల ప్రసంగం – చిత్తు కాగితంతో సమానం అని వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. #kcrbrspresident #brsvibe #brspartyoffice #brspartyonline #brssocialmedia #ktrbrs #KCROnceAgain #NewsUpdate #newsheadlinestoday #newsfeed
Vemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet media
తెలుగు
0
5
40
639
Vemula Prashanth Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఈరోజు గవర్నర్ ప్రసంగం మొత్తం ఒక చిత్తు కాగితంతో సమానం. కొత్తగా వచ్చిన గవర్నర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన స్కీమ్‌ల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదు… కాంగ్రెస్ స్కామ్‌ల గురించే ఉంది. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
తెలుగు
153
27
118
2K
Vemula Prashanth Reddy retweetledi
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఈ బడ్జెట్‌లో కూడా పెన్షన్లు పెంచుతామని చెప్పకుండా ప్రజలను మరో సంవత్సరం పాటు మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
తెలుగు
236
10
33
424
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
👉 BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పై పీసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వాఖ్యలు అయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం 👉 డ్రగ్స్ వంటి అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం సరికాదు 👉 రేపు అసెంబ్లీలో, కౌన్సిల్ లో డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం. మేము సిద్ధం - కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? 👉 మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ డ్రగ్స్ ఘటనపై పారదర్శక విచారణ జరిపి ఎవరు ఉన్నా, ఏ పార్టీ వారైనా చట్టం ముందు కఠిన చర్యలు తీసుకోవాలి 👉 కేటీఆర్‌పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ******* మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ ఘటన ను సాకుగా చూపి కేటీఆర్ పై పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుస్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.KTR పై మహేష్ కుమార్ గౌడ్ వాఖ్యలు అయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం అని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి, లోతైన మరియు పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పెద్దవారైనా సరే చట్టం ముందు సమానంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు BRS పార్టీ నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ఆరోపణలు చేస్తోందని ఆయన తీవ్రంగా ఖండించారు. మొయినాబాద్ ఫార్మ్‌హౌస్‌లో జరిగిన విందులో వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని అక్కడ డ్రగ్స్ దొరికితే నిజానిజాలను పూర్తిగా వెలికితీయాలని కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్,కాంగ్రెస్ నేతలు ఆధారాలు లేకుండా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ ఘటనతో లింక్ పెట్టి ఆరోపణలు చేయడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న చర్య అని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. డ్రగ్స్ వంటి తీవ్రమైన సమస్యపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్న వేముల ప్రశాంత్ రెడ్డి, నిజంగా కాంగ్రెస్ నేతలకు నైతిక ధైర్యం ఉంటే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి డ్రగ్ టెస్ట్ చేయించుకుందామని సవాల్ విసిరారు. రేపు అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో, కౌన్సిల్ లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వరుసగా నిలబడి డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం అన్నారు. .మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారని,కాంగ్రేస్ పార్టీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమా అని అన్నారు. డ్రగ్స్ నియంత్రణలో గతంలో కేసీఆర్ ప్రభుత్వ కాలంలో కఠిన చర్యలు తీసుకున్నామని, డ్రగ్స్ వంటి కీలక సమస్యను ప్రత్యర్థి పార్టీల పై రాజకీయ ఆరోపణల కోసం ఉపయోగించడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు #kcrbrspresident #brsvibe #brspartyoffice #brspartyonline #brssocialmedia #ktrbrs #KCROnceAgain #newsheadlinestoday #NewsUpdate #newsfeed @BRSparty
Vemula Prashanth Reddy tweet media
తెలుగు
1
12
93
2.3K
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR గారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు #kcrbrspresident #brsvibe #brspartyoffice #brspartyonline #brssocialmedia #ktrbrs #KCROnceAgain #KCR @KTRBRS @BRSparty @BRSHarish @TSwithKCR @KCR
Vemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet media
తెలుగు
6
18
248
3.9K
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
👉 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజా తీర్పుకు అవమానం 👉 స్పీకర్ నిర్ణయం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే చర్య, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేయడమే. 👉 స్పీకర్ ఈ నిర్ణయంతో అయన గౌరవాన్ని తగ్గించుకున్నారు 👉 రాజ్యాంగ వ్యవస్థలను అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా వాడుతున్నారనే వాదన బలపడుతోంది 👉 తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తి తుంగలో తొక్కి కాంగ్రెస్ రాజ్యాంగం నడిపిస్తున్నారు 👉.శాసన వ్యవస్థ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా నిలుస్తుంది 👉 మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తి ని అపహాస్యం చేసినట్టే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు తర్వాత అధికారంలో ఉన్న పార్టీలో పనిచేయడం ప్రజల తీర్పును తుంగలో తొక్కినట్టేనని ఆయన అన్నారు. BRS పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ కు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి, ప్రజల తీర్పును పూర్తిగా అవమానించినట్టేనని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అని గుర్తుచేశారు.కడియం శ్రీహరి స్వయంగా కాంగ్రెస్ కండువా వేసుకుని తన కూతురు తరపున ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేసిన అభ్యర్థుల తరపున బహిరంగంగా ప్రచారం చేసిన విషయం ప్రజలు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. ఇలాంటి స్పష్టమైన పరిస్థితుల్లో కూడా వారికి స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే చర్య మాత్రమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థలను అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉపయోగిస్తున్నారనే వాదనకు బలం చేకూరుస్తుందని అన్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర దెబ్బ అని, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన గౌరవాన్ని తగ్గించుకున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. BRS పార్టీ ఎమ్మెల్యేలుగా ప్రజల ఓట్లతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి బహిరంగంగా చేరినట్టు ఆధారాలు ఉండగా దానికి స్పీకర్ క్లీన్ చీట్ ముద్ర వేయడం ప్రజాస్వామ్యం పై దాడి చేయడమేనని, ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఈ తీర్పు శాసన వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే తగిన సమాధానం ఇస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. #NewsUpdate #ktrbrs #brssocialmedia #brspartyoffice #brspartyonline #kcrbrspresident #news #brsvibe #NewsHeadlines #newsfeed #KCR #KCROnceAgain
Vemula Prashanth Reddy tweet media
తెలుగు
1
3
13
371
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
👉 వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టి.. ఎర్రజొన్న పంట ధర తగ్గకుండా చూడాలి. 👉 క్వింటాలుకు ₹3850 ఉన్న ధరను ₹3450కు తగ్గించే ప్రయత్నం వల్ల రైతులకు తీవ్ర నష్టం 👉 ధరల పతనంతో కుదేలవుతున్న రైతు..తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ 👉 ఎర్ర జొన్న రైతుల రక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి. 👉 జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ** సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నలు క్వింటాలుకు ₹3850 పలికిన ధర ప్రస్తుతం వ్యాపారుల సిండికేట్ కారణంగా ₹3450 వరకు పడిపోయి ఎర్రజొన్న రైతులు తీవ్రంగా నస్టపోతున్నారు. ఈ విషయంలో ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ఈ విషయమై ఆయన జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఎర్రజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎర్రజొన్న రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి పరమావధి కావాలని, రైతులను నష్టపరిచే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం తమకు అందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరం తో పోలిస్తే ఈసారి ఎర్రజొన్న సాగు మరియు ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట వైపు మొగ్గుచూపడంతో ఎర్రజొన్న సాగు తగ్గిందన్నారు. గత సంవత్సరం 34000 ఎకరాల్లో ఎర్రజొన్న పంట ఉంటే ఈ సంవత్సరము 23000 ఎకరాలకు ఉత్పత్తి పడిపోయింది అన్నారు.ఉత్పత్తి తగ్గిన పరిస్థితుల్లో సహజంగా ధర పెరగాల్సి ఉండగా, వ్యాపారులు కలిసి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేయడం రైతులకు తీవ్ర అన్యాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎర్రజొన్నకు క్వింటాలుకు కనీసం ₹3850 నుంచి ₹4000 వరకు ధర రావాల్సి ఉండగా, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరను ₹3400 నుంచి ₹3450 వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఎర్రజొన్న ధర తగ్గడానికి అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ వ్యాపారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ మరియు ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుందని, అక్కడ ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాబట్టి ధర తగ్గింపుకు చెప్పే కారణాలు సమంజసం కావని పేర్కొన్నారు. గత మూడు నాలుగేళ్లుగా అమలులో ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలని, విత్తనాలు ఇచ్చే సమయంలో రైతులతో తప్పనిసరిగా బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపారు. విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే రైతుల పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఏ గ్రామాల్లో ఏ వ్యాపారులు రైతులతో బైబ్యాక్ అగ్రిమెంట్లు చేసుకున్నారో పూర్తి వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ రూరల్ జక్రాన్‌పల్లి మండలాల్లో ఎర్రజొన్న సాగు ఎక్కువగా ఉన్నందున అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా సిండికేట్‌గా వ్యవహరించే వ్యాపారులను ఉపేక్షించకూడదని, వ్యాపారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టంగా హెచ్చరించాలని కోరారు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే మొక్కజొన్న ధరలు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు ఎర్ర జొన్న ధర కూడా తగ్గితే రైతులు మరింత నష్టపోతారని ఆయన అన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు కనీసం క్వింటాలుకు ₹4000 ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎర్రజొన్న రైతులు అందరు సంఘటితం కావాలని, గిట్టుబాటు ధర లభించకాపోతే పోరాటానికి సిద్ధం కావాలని @BRSparty మీకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.
తెలుగు
0
13
43
1.1K
Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy@VPR_BRS·
👉 గత KCR ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట 👉 ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.* 👉 బాల్కొండ ‘షాదీఖానా’ నిధుల నిలుపుదలపై ఎమ్మెల్యే వేముల తీవ్ర ఆగ్రహం. 👉 అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందే వరకు పోరాడుతాం. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ మండల కేంద్రంలో ముస్లీమ్ మైనారిటీ సోదరులతో కలిసి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 👉 కేసీఆర్ పాలన - సంక్షేమ స్వర్ణయుగం గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజమైన లౌకికవాదంతో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముస్లింలలో ఉన్న పేదరికాన్ని తొలగించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని వేముల విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగ్గా లేదని, ప్రజలకు అందుతున్న అనేక పథకాలు ఇప్పుడు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 👉 షాదీఖానా నిధులపై నిలదీత తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానా నిర్మాణం కోసం సెక్రటేరియట్ నుండి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతితో సుమారు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేయడం లేదా క్యాన్సిల్ చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా పాత జీవోలను, అభివృద్ధి పనులను కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎందుకు నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను, ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ముస్లిం సోదరులకు సూచించారు. బాల్కొండ షాదీఖానా నిర్మాణం కోసం తాను వ్యక్తిగతంగా పోరాడతానని, నిధులు వచ్చే వరకు విశ్రమించబోనని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. #kcrbrspresident #brsvibe #brssocialmedia #ktrbrs #happyholi2026 #BalkaSuman #VemulaPrashanthReddy #JaiKCR #KTR
Vemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet mediaVemula Prashanth Reddy tweet media
తెలుగు
0
4
15
295