AP Digital Corporation
8.9K posts

AP Digital Corporation
@apdigitalcorp
Official Account of Andhra Pradesh Digital Corporation. General administration (I&PR) department. Government of Andhra Pradesh
Katılım Mayıs 2020
3 Takip Edilen62.3K Takipçiler
AP Digital Corporation retweetledi

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అంతా శుభం జరగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
#AndhraPradesh




తెలుగు
AP Digital Corporation retweetledi

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు నేడు విజయవాడ కనకదుర్గ ఆలయ వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
#AndhraPradesh


తెలుగు
AP Digital Corporation retweetledi

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
#AndhraPradesh



తెలుగు
AP Digital Corporation retweetledi

పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై ఉగాది పండుగ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సంతకం తో 6787 మందికి ఆర్థిక సాయం అందించేందుకు రూ.55.63 కోట్లు విడుదల అవుతాయి. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో 1 లక్షా 36 వేల 240 మందికి రూ.1241 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh


తెలుగు
AP Digital Corporation retweetledi

షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.

తెలుగు
AP Digital Corporation retweetledi

దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్, మంత్రి శ్రీ నారా లోకేష్ లతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు. అనంతరం మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు.
#DivyangaShakti #దివ్యాంగశక్తి
#AndhraPradesh
తెలుగు
AP Digital Corporation retweetledi

రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోంది. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం నేడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh



తెలుగు
AP Digital Corporation retweetledi

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ను ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ శ్రీ అజయ్ మిశ్రా నేడు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
#AndhraPradesh



తెలుగు

అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణంతో.. ముస్లింల ఆశయాలు నెరవేరుస్తున్న
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు!
#Iftar
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

తెలుగు
AP Digital Corporation retweetledi

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
#AndhraPradesh




తెలుగు
AP Digital Corporation retweetledi

గృహ వినియోగానికి వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు నిరంతర సరఫరా ఉండాలని ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై నేడు సమీక్షించారు. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, ఓఎన్జీసీతోపాటు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్ పీసీఎల్,బీపీసీఎల్, ఐఓసీఎల్ లకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని ఉన్నతాధికారులు వివరించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
#AndhraPradesh




తెలుగు

Statue of Sacrifice..
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#AndhraPradesh
English
AP Digital Corporation retweetledi
AP Digital Corporation retweetledi

అమరావతి శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్, శ్రీ టి జి భారత్, శ్రీ పీ నారాయణ, శ్రీమతి సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి వి ఎన్ మాధవ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.
#StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం




తెలుగు

Citizens are requested to book LPG cylinders only when required so that deliveries can reach everyone efficiently. #LPGSupplyAssured
English






