


Kranthee Shivarathri
23 posts

@kranthee_shiv
Writer | Translator | Editor








ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం. పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు. అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.” మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది. నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా. Please support us in our fight for justice for Vinoda. @SPyadadri @TelanganaPolice @SajjanarOffice @revanth_anumula @SCWTelangana








అజు పబ్లికేషన్స్ పదిహేనో పుస్తకం - భారత సైనికుల వీరగాథలు ❤️ ఒక సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పుస్తకంలో భారత సైనికుల వీర గాథలను, వారి జీవితాలను – ఇండియన్ ఆర్మీలో ప్రఖ్యాతిగాంచిన ఆఫీసర్లలో ఒకరైన లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా (రిటైర్డ్) మనకు పరిచయం చేస్తారు. చావు అంచుల దాకా వెళ్ళి చేసే పోరాటాలు, ఉత్కంఠభరితమైన మిలిటరీ ఆపరేషన్స్, వీరోచితమైన సర్జికల్ స్ట్రయిక్స్, యుద్ధ రంగంలోకి దిగే సైనికులు తీసుకునే కఠినమైన ట్రైనింగ్, ఎప్పుడూ అట్టుడుకుతూ ఉండే సరిహద్దు రేఖ వద్ద జీవితం, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు – ఇలా భారత సైనికుల జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందీ పుస్తకం. 'ఇండియాస్ బ్రేవ్‌హార్ట్స్' పేరుతో ఇంగ్లిష్‌లో వచ్చిన ఈ పుస్తకానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడీ పుస్తకాన్ని తెలుగు పాఠకుల ముందుకు తీసుకువస్తున్నాం. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అఖిల కొనకంచి, ఈ పుస్తకం తెలుగులో ఎందుకు లేదు? అనుకొని మమ్మల్ని సంప్రదించి తనే అనువాదం చేసింది. Congratulation on your debut work Akhila. More to go 🤗 ఇండియన్ ఆర్మీ అభిమానులకు ఈ పుస్తకం ఒక కానుక. Now available on Amazon and all major book shops. ఈ పుస్తకానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. Originally published by Juggernaut in English. Author : @TheSatishDua Telugu translation : @akhila_author Editor : @kranthee_shiv Cover Design : Brahmam - Bhavana Grafix Order your copy - amzn.in/d/eM7pvNy

రేపు రాత్రి 9 గంటలకు , 'వనవాసి' మీద మాట్లాడుకుందాం ట్విట్టర్ స్పేస్ లో మిత్రుడు @InsideMalli కో-హోస్ట్ గా...సాహితీ మిత్రులందరికీ ఇదే హర్షణీయం - ఆహ్వానం.🙏