Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS

3.8K posts

Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS banner
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS

Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS

@Collector_JGL

[email protected], [email protected] 08546274000

Gadwal Katılım Aralık 2016
208 Takip Edilen11K Takipçiler
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం – జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మహిళల సంతృప్తి ఈ పథకం వారి ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు విద్య, ఉపాధి మరియు అవసరమైన సేవలకు చేరుకునే అవకాశాలను మెరుగుపరుస్తోందని ఆశాభావం వ్యక్తం చేసిన మహిళామణులు @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
తెలుగు
0
2
6
115
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఏప్రిల్ 2న గ్రామసభలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు - గౌరవ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి ఆదేశాలనుసారం కార్యాచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహించాల్సిన గ్రామ సభలపై మంగళవారం హైదరాబాదు నుంచి గౌరవ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామ సభల్లో చర్చించాల్సిన అంశాలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో ఉండేలా చూసుకోవాలన్నారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించాలని, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీల వారిగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియజేయడమే కాక రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయాన్ని పొందిన రైతుల పేర్లను చదివి వినిపించాలన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన వివిధ ప్రజాహిత కార్యక్రమాలు గురించి కూలంకషంగా వివరించాలన్నారు. ముఖ్యంగా ప్రతి పౌరుడికి జీవిత బీమా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం, రాగి జావ, పాలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలను గురించి చెప్పాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా సంబంధిత కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా ఆయా జిల్లాలలోని కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తమ ప్రదర్శనలతో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న 16 సంక్షేమ పథకాల గురించి గ్రామసభల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పథకాలను, వివిధ అభివృద్ధి పనుల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభలకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన మండల స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలో కూడా సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో ఆయా శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, డిపిఓ శ్రీకాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
1
3
102
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, గాయపడుతున్నారని రహదారి భద్రతకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, అవసరమైన చోట రహదారి భద్రత వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారితో పాటు అంతర్రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లోనూ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. రహదారి వైపుకు పెరిగిన ముళ్ల పొదలను తొలగించడం, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్, లైటింగ్ ఏర్పాటు చేయడం, ఇతరత్రా చర్యలతో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఆయా మండలాల్లోని ఎస్ హెచ్ఓల (స్టేషన్ హౌస్ ఆఫీసర్) వారీగా కూడా రహదారి ప్రమాదాల నివారణకు సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇకనుంచి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని ప్రతి నెల మూడో బుధవారం నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్అండ్ బి ఈఈ ప్రగతి, డిటిఓ వెంకటేశ్వరరావు, సంబంధిత శాఖల ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
1
3
85
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో వంద శాతం లక్ష్యాలను సాధించాలి - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు - గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్ మెరుగుపడడానికి అవసరమైన సలహాలు ఇవ్వండి గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో నిర్దేశించిన 39 ఇండికేటర్స్ లో వంద శాతం లక్ష్యాలను సాధించడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం లో భాగంగా జనవరి 28 నుంచి ఏప్రిల్ 14 వరకు చేపట్టిన సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో అదనపు పోషకాహారం అందించడం, తాగునీటి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల మరుగుదొడ్లను, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పశువులకు FMD (ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్) టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ తరఫున చేస్తున్న కార్యక్రమాలు, వైద్య పరీక్షల్లో వెనుకబడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ ప్రోగ్రాంకు సంబంధించి ప్రతివారం సంబంధిత అధికారులు మండల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. గట్టు బ్లాక్ ర్యాంకింగ్ మెరుగుపడడానికి సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సలహాలు ఇవ్వవచ్చని, జిల్లా అధికార యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, డిడబ్ల్యూఓ సునంద, డీఈవో విజయలక్ష్మి, గట్టు ఎంపీడీవో చెన్నయ్య, నీతి ఆయోగ్ కో ఆర్డినేటర్ అఫ్జల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad @NITIAayog #AspirationalBlock
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
3
6
123
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల జీవితాల్లో మార్పు - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు - బస్ స్టాండ్ పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు మంగళవారం గద్వాల్ ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగి ₹10,000 కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసిన తొలి పథకం మహాలక్ష్మి (ఉచిత బస్సు) పథకమని తెలిపారు. మహిళల సాధికారతకు ఈ పథకం ఒక కీలక అడుగుగా నిలిచిందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ,వారికి సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉద్యోగాలు,వైద్య సేవలు, విద్య కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటూ ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు. జోగులాంబ గద్వాల్ బస్ స్టేషన్ పరిధిలో గత రెండు సంవత్సరాల్లో సుమారు ₹110 కోట్ల ప్రయాణ చార్జీని మహిళలు ఆదా చేసుకున్నారని,దాదాపు 28 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని వెల్లడించారు. రోజుకు సగటున ₹13 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.ఈ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల రాష్ట్ర ముఖ్యమంత్రి,రవాణా శాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి అవసరమైన బడ్జెట్‌ను సమకూర్చుతూ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.వచ్చే ఏడాదికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే మండల సమాఖ్యల ద్వారా బస్సులను అద్దెకు ఇవ్వడం ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని బస్సులను ఆర్టీసీకి అద్దెకు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగంపరుచుకొని మహిళలను అభివృద్ధి చెందాలన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం – మహిళల అభిప్రాయాలు రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల తమ రోజువారీ జీవితంలో గణనీయమైన మార్పు వచ్చిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల బస్సు ఖర్చు గణనీయంగా తగ్గిందని,ఇప్పుడు ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలు,తదితర అవసరాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు.ఈ పథకం తమకు ఆర్థిక ఉపశమనం కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాన్ని కూడా అందించిందని వారు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ బస్ స్టాండ్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, పార్కింగ్‌ను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని పక్షంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయలక్ష్మి, ఆర్టిసి డిపో మేనేజర్ సునీత,ప్రజాప్రతినిధులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
1
8
155
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
గద్వాల పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ IAS గారు జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘం అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గద్వాల మునిసిపాలిటీ బడ్జెట్ సమావేశాన్ని మంగళవారం స్థానిక అక్షయ బంకిట్ హాల్లో పుర చైర్ పర్సన్ జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో పాటు ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న మొదటి బడ్జెట్ సమావేశం కావడంతో నూతన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల మునిసిపాలిటీ ఆస్తిపన్నుల వసూళ్లలో లక్ష్యం కంటే ఎక్కువగానే వసూలు చేయడంతో పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ కు ఎంపిక కావడం జరిగిందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను అభినందించారు. ప్రభుత్వం నుంచి గద్వాల మునిసిపాలిటీకి రూ.8.5 కోట్ల స్టాంపు డ్యూటీ నిధులు రావాల్సి ఉందని, ఇతర ఆదాయ మార్గాల్లో రూ.23 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనల కట్టుదిట్ట అమలు, పార్కుల నిర్వహణ, పట్టణ సుందరీకరణ, తదితర అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమైన జంక్షన్ల వద్ద భారీ ఫ్లెక్సీ లను ఉంచడంతో ఇబ్బందికరంగా ఉందని, ఫ్లెక్సీలతో పాటు ప్లాస్టిక్ నివారణకు కౌన్సిల్లో తీర్మానం చేసి అమలు చేయాల్సిందిగా సూచించారు. మున్సిపాలిటీలో ప్రతి ఉద్యోగి, ఇతర కార్మికులు బయోమెట్రిక్ విధానంలో హాజరు వేయాలని, 280 మంది కార్మికులు ఉండడంతో మునిసిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, తాగునీటి వృధాను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గద్వాల మునిసిపాలిటీ దుకాణాల ఆదాయం కూడా పెరిగేందుకు నిబంధనల ప్రకారం వేలంపాట నిర్వహించాలని, జనరల్ ఫండ్ సద్వినియోగం చేసుకునేలా ముందుకెళ్లాలన్నారు. మునిసిపాలిటీ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, శానిటేషన్, తాగునీటి సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా సహకరించాలన్నారు. గత కౌన్సిల్ సమయంలో గద్వాల పట్టణ అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులను ఖర్చు పెట్టడం జరిగిందని, భవిష్యత్తులోనూ గద్వాల మునిసిపాలిటీకి ఎక్కువ నిధులు వచ్చేలా తన వంతుగా కృషి చేస్తానన్నారు. అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ పట్టణ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గద్వాల మున్సిపాలిటీ బడ్జెట్ ప్రతులను జూనియర్ అకౌంట్స్ అధికారి రాజు చదివి వినిపించారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గద్వాల మున్సిపాలిటీకి ఆస్తి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ దుకాణాల అద్దెలు, వివిధ నిధులు, తదితర రూపాల్లో మొత్తం రూ.24.84 కోట్ల అంచనా ఆదాయాన్ని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు, ఇంజనీరింగ్ విభాగం ఖర్చులు, సాధారణ పరిపాలన వ్యయం, తదితర మొత్తం అంచనా ఖర్చు రూ.27.56 కోట్లుగా ప్రస్తావించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్ ను సన్మానించారు. అలాగే పదవీ విరమణ పొందుతున్న మున్సిపాలిటీ కార్మికుడు వెంకటరాజును కలెక్టర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మున్సిపాలిటీ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, ఇతర అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
1
5
130
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS retweetledi
Shashi Kumar Reddy Vura
సీఎం రేవంత్ రెడ్డి విజన్‌తో తెలంగాణలో Advanced Technology Centers (ATC) 🚀 ఏటీసీలతో నిరుద్యోగులకూ,విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధి – యువతకు కొత్త అవకాశాలు.
రేవంత్ నాయకత్వంలో దూసుకెళ్తున్న తెలంగాణ! 🔥 #RevanthReddy #TelanganaRising #ATC
తెలుగు
12
41
143
3.7K
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
విశ్రాంత ఉద్యోగులు సమాజసేవలో భాగం కావాలి - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ IAS గారు ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో బదిలీలు, ఉద్యోగ విరమణలు సర్వసాధారణమని విశ్రాంత ఉద్యోగులు తమ శేష జీవితంలో కొంత సమయాన్ని సమాజ సేవకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. జిల్లా యువజన క్రీడల అధికారిగా పనిచేసి పదవి విరమణ పొందుతున్న డివైఎస్ఓ కృష్ణయ్య గారిని సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణయ్య తన ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, భవిష్యత్తులో జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన సేవలు అవసరమైతే వినియోగించుకుంటామన్నారు. కృష్ణయ్య శేష జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, ఆరోగ్యంగా జీవించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
2
16
369
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఇండ్ల గణన పక్కాగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ IAS గారు జనాభా గణన 2027లో భాగంగా మొదట ఈ ఏడాది ఇండ్ల గణనను పక్కాగా చేపట్టాలని డీసీఓ ( డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్) భారతీ హోళికేరి గారు స్పష్టం చేశారు. జనగణనకు సంబంధించిన ప్రాథమిక కార్యకలాపాలపై సోమవారం హైదరాబాద్ నుంచి ఆమె సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ రూపకల్పన, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జనగణన విజయవంతంగా నిర్వహించాలంటే ప్రాథమిక స్థాయిలో చేపట్టే పనులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ విషయంలో సరైన రూపకల్పన, ఫీల్డ్ వెరిఫికేషన్, సిబ్బందికి సమానమైన వర్క్‌లోడ్ పంపిణీ జరగకపోతే క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. రక్షణ సంస్థలు, సున్నిత ప్రాంతాలు, జాతీయ ఆస్తులకు చెందిన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటిని సాధారణ జనగణన ప్రాంతాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. హెచ్‌ఎల్‌బీ అనేది జనగణనలో ఒక యూనిట్‌గా పనిచేస్తుందని వివరించారు. ప్రతి హెచ్‌ఎల్‌బీకి సుమారు 750–800 జనాభా ఉండేలా చూడాలన్నారు. 2011 తర్వాత భారీ మార్పులు జరిగిన నేపథ్యంలో కొత్త లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లు, జనాభా పెరుగుదల ఇవన్నీ పరిగణలోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలన తప్పనిసరి అని తెలిపారు. ఎన్యుమరేటర్లలో ఒకరికి తక్కువ పని, మరొకరికి ఎక్కువ పని ఉండకుండా సమానంగా బాధ్యతలు కేటాయించాలని సూచించారు. చార్జ్ అధికారులు, సూపర్వైజర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. జనగణన అనేది ఒక జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. గద్వాల ఐడిఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో సెన్సెస్ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, సిపిఓ పాపయ్య, డిపిఓ శ్రీకాంత్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
1
11
333
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఏప్రిల్ 2న గ్రామసభలు : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు - ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల ప్రగతి వివరాలు ప్రస్తావించాలి సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అన్ని శాఖల్లోని అభివృద్ధి కార్యక్రమాల పూర్తి వివరాలను ఏప్రిల్ 2న జరిగే గ్రామసభల్లో ప్రస్తావించాలన్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, తదితర పథకాల గ్రామస్థాయి వివరాలను సేకరించి ఆయా గ్రామసభల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్ లు తరచూ తమ పరిధిలోని పాఠశాలలను, వసతి గృహాలను సందర్శించాలని, ప్రతి శుక్రవారం అక్కడే భోజనం చేయాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు సైతం సంబంధిత అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారని చెప్పారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో తాను ఇటీవల పలు మండలాల్లో పర్యటించి పరిశీలించగా చాలా కార్యాలయాల్లో పాత సామాన్లు అలాగే ఉన్నాయని, సంబంధిత అధికారులు ఆదేశాలు పాటించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పనితీరులో చాలా మార్పు రావాల్సి ఉందని, నిర్లిప్తంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు,ఆర్డీవో శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
2
5
218
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు - కార్యాలయాల వద్ద, ముఖ్య కూడలీలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి - వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ముద్రించిన గోడ పత్రికల విడుదల జిల్లాలో ఎండ తీవ్రతలు 40 డిగ్రీలు ఉన్నందున వడదెబ్బకు గురి కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎండల తీవ్రతపై వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్కరు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా మండలాలలోని అన్ని ఎంపీడీవోలు, తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులు అంగన్వాడి చిన్నారులకు వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని, పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే సగం రోజు పాఠశాలలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వసతిగృహాలలొ ఉండే విద్యార్థులు ఎండ పూట బయటకు వెళ్లకుండా ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. జిల్లా అధికారులు కూడా వడదెబ్బకు గురి కాకుండా టోపీలను వినియోగించాలని, తరచుగా నీరు సేవించాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలు కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు నిర్వహించాలని అన్నారు. వైద్యాధికారులు అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు ORS ప్యాకెట్ లు పంపిణి చేయాలన్నారు. పక్షులు, పశువులకు కూడా నీటిని అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకూడదని, ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. తరచుగా తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లేదా ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ ప్రజలకు సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలపై ఏప్రిల్ రెండవ తేదీ నుండి నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభలలో ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ముద్రించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశం ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా వైద్యాధికారి సంధ్య కిరణ్మయి, ఆర్డిఓ శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
2
11
295
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఆహార కేంద్రాల్లో తనిఖీలు పెంచాలి : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు జిల్లాలోని హోటల్స్, రెస్టారెంట్స్, తదితర ఆహార కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయో,లేదో తరచూ తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. సోమవారం ఐడిఓసీ సమావేశపు మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామస్థాయిలో ఉండే హోటల్స్ సైతం సంబంధిత గ్రామపంచాయతీ, ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి హోటల్స్ నిర్వహించేందుకు అనుమతులు తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేయాలన్నారు. జిల్లాలోని హోటల్స్ లో ఆహారాన్ని తయారు చేసేందుకు వినియోగించే నూనెలు, ఇతర సరుకులు నాణ్యతతో ఉన్నాయో లేదో సంబంధిత అధికారులు తరచు పరిశీలించాలన్నారు. ఆహార కేంద్రాల వంట గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అక్కడ వినియోగించే పాత్రలు, నీళ్లు శుభ్రంగా లేకుంటే ఆహారం కల్తీ అయ్యే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు తరచూ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వంట చేసే మాస్టర్లు, ఇతర సిబ్బంది నిబంధనల ప్రకారం జాగ్రత్తలు పాటిస్తూ శుచి, శుభ్రతతో వంటలు చేసేలా ఆదేశించాలన్నారు. ఒక నెలలో హోటల్స్ నుంచి సేకరించిన ఆహార పదార్థాల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి రిపోర్టును ఎప్పటికప్పుడు తమకు పంపించాలన్నారు. హోటల్ ల యజమానులు నిబంధనల ప్రకారం ఆయా ఆహార కేంద్రాలను నిర్వహించాలని, కల్తీ ఆహార పదార్థాలను విక్రయించే యాజమాన్యాలపై కేసులు బుక్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు,ఆర్డీవో శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
1
3
13
448
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించని అధికారులకు మెమోలు : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డిఓ శ్రీనివాసరావుకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ఆయా శాఖల వారీగా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్జీలు రావడమే కాక మామూలు రోజుల్లోనూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అవే సమస్యలపై తన వద్దకు వస్తున్నట్లు చెప్పారు. ప్రజావాణికి వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఉంచడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవిన్యూ, పురపాలక శాఖలలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించకపోవడానికి కారణమేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రతి బుధవారం ఆయా శాఖల జిల్లా అధికారులు తమ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ చాలామంది పాటించడం లేదని మండిపడ్డారు. ప్రజావాణి ఆర్జీలు అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉంచిన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
1
13
323
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
పంటల సర్వే పురోగతిపై క్షేత్ర స్థాయిలో సందర్శించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ IAS గారు - రైతులను సంప్రదించి సరైన సమాచారం నమోదు చేయాలని సూచన ఇటిక్యాలలో జరుగుతున్న పంటల సర్వే పనుల పురోగతిపై సంబంధిత వ్యవసాయ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్వే విధానం, డేటా నమోదు, సంబంధిత యాప్ వినియోగంపై అధికారుల ఫోన్లో ప్రత్యక్షంగా పరిశీలించి సూచనలు జారీ చేశారు. పంటల వివరాలు, భూమి పరిస్థితి (ఫాలో ల్యాండ్, వేస్ట్ ల్యాండ్, వేకెంట్ ల్యాండ్) వంటి అంశాలను ఖచ్చితంగా పరిశీలించి యాప్ లో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహించబడుతున్నందున పంటల విస్తీర్ణం ఖచ్చితంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. డేటా నమోదు పూర్తిగా ఖచ్చితంగా ఉండాలని, ఏవైనా తప్పులు ఉంటే సూపర్వైజర్ స్థాయిలో సరిదిద్దే విధానం ఉన్నప్పటికీ మొదటి నుంచే సరైన సమాచారం నమోదు చేయాలని సూచించారు. రైతుల వివరాలు, సర్వే నెంబర్లు, మొబైల్ నెంబర్లు అందుబాటులో ఉన్నందున సందేహాలు ఉంటే రైతులను సంప్రదించి సరైన సమాచారం నమోదు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
4
10
455
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఇటిక్యాల తహసీల్దార్ కార్యాలయం మరియు MPDO కార్యాలయాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ IAS గారు - 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచన - అపరిశుభ్రత కనిపిస్తే కఠిన చర్యలకై ఆదేశాలు ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అక్కడి మీసేవ డాష్ బోర్డులో కుల, ఆదాయ, భూభారతి, తదితర దరఖాస్తులను పరిశీలించి నిర్దిష్ట సమయంలోగా వాటిని పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డు గది, ఇతర విభాగాలను పరిశీలించారు. పొలం సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఇబ్బంది కలగకుండా నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. సమీపంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి పలు విభాగాల పనితీరును గమనించారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పలుచోట్ల అనవసరమైన వస్తువులు, చెత్తను గమనించిన కలెక్టర్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
2
4
260
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ IAS గారు - ఆసుపత్రి ఆవరణలో ఔషధ మొక్కలను నాటి పెంచేందుకు కృషి నేడు, కలెక్టర్ ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, గర్భిణీ స్త్రీల సంరక్షణ, టీకాలు, ఔషధాల నిల్వలు, వివిధ రికార్డుల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హై రిస్క్ కేసులను గుర్తించి వెంటనే మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. హెమోగ్లోబిన్ స్థాయిలు, బీపీ, షుగర్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, అవసరమైన మందులు, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు సమయానికి అందించాలని ఆదేశించారు. ఔషధాల నిల్వలను ఫార్మసిస్ట్ క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. టీకాల కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.రెండు రోజులకు మించి జ్వరం ఉన్న వారికి బ్లడ్ టెస్టులు చేయాలని సూచించారు. టిబి కేసుల గుర్తింపు మరియు పరీక్షలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మెడికల్ సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఆవరణలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలం ఉన్నందున ఔషధ మొక్కలను నాటి పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
2
4
250
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
ఇటిక్యాల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ IAS గారు - అపరిశుభ్రత కనిపిస్తే కఠిన చర్యలకై ఆదేశాలు - ప్రణాళికా బద్దంగా చదివితే మంచి ఫలితాలు గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి వివిధ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి గణితం పరీక్షకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు ఇప్పటిదాకా అసలే చదవని పాఠ్యాంశాన్ని ప్రస్తుతం చదివితే లాభం లేదని, ఇప్పటికే చదివిన పాఠ్యాంశాలను పునఃశ్చరణ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం చదివాక ముందుగా వారికి బాగా వచ్చిన ప్రశ్నలను ఎంచుకొని సమాధానం రాయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా సాధన చేయాలని, వంద శాతం ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం గురుకుల విద్యాలయంలోని వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సూచించారు. వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఫుడ్ కమిటీ సభ్యులుగా ఉన్న విద్యార్థులతో మాట్లాడి ఎప్పటికప్పుడు మెనూ ప్రకారం రుచికరంగా, శుభ్రతతో వంటలు చేసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థుల వసతి భవనంలో కలెక్టర్ పర్యటించారు. భవనంలోని గదులు అపరిశుభ్రంగా ఉండడంతో అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ఒక గదిలో పాత ఫర్నిచర్ ఎందుకు ఉంచారని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ విధుల్లో నిర్లక్ష్యం చూపడం సరికాదన్నారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, గురుకుల భవనాలకు పెయింటింగ్ చేయించాలన్నారు. ప్రభుత్వం గురుకుల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
1
3
11
427
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS retweetledi
Jacob Ross
Jacob Ross@JacobBhoompag·
Jacob Ross tweet media
ZXX
0
8
16
933
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS
జోగులాంబ జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తాగునీటి సరఫరా పనులు, సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఐడిఓసి సమావేశపు మందిరంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ గారు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ ఒకటి నుంచి 15 వరకు అందుబాటులో ఉన్న నిధులతో చేతి పంపులు, సమస్య ఉన్న మోటర్లు, పైప్ లైన్స్, తదితర మరమ్మత్తులు చేయించాలన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు వస్తే పరిష్కరించేందుకు వాటర్ ఇన్స్పెక్షన్ టీములను ఏర్పాటు చేయాలన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలోనూ సంబంధిత అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. నీటి సరఫరాపై ఆయా ప్రాంతాలవారీగా సమస్య వస్తే ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలన్నారు. ఇక్కడ ట్యాంకర్ లతో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా మండలాల వారీగా తాగునీటి సరఫరాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు తనకు రిపోర్ట్ పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, కార్యాలయాల శుభ్రతపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా చోట్ల చేయలేదని, త్వరలో తాను ఆయా మండలాలలో పర్యటిస్తానని, సమస్యలు కనిపిస్తే చర్యలు చేసుకుంటామని హెచ్చరించారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలన్నారు. గ్రామ సభల్లో వివిధ శాఖల సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజలను భాగస్వాములు చేస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలన్నారు. గ్రామసభల్లో చర్చించాల్సిన 16 ఆజెండా అంశాలను, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, డిపిఓ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet mediaCollector Jogulamba | Rizwan Basha Shaikh IAS tweet media
తెలుగు
0
3
8
250