Vannemreddy Satish Kumar

13.8K posts

Vannemreddy Satish Kumar banner
Vannemreddy Satish Kumar

Vannemreddy Satish Kumar

@JSPSatishKumar

MA Public Admin, MA Human Rights @JSPDhalam Grass Roots Level Democracy @Pawankalyan @JanasenaParty

Katılım Eylül 2019
128 Takip Edilen1.7K Takipçiler
Sabitlenmiş Tweet
Vannemreddy Satish Kumar
Vannemreddy Satish Kumar@JSPSatishKumar·
భవిష్యత్తులో భారతదేశానికి దిశా నిర్దేశం చేయబోయే ప్రజా నాయకుడు ప్రసంగంలో గుర్తింపు పొందిన రోజు *నా జీవితంలో మర్చిపోలేని రోజు* జగమంత జనసేన కుటుంబాన్ని ఇచ్చిన మా దైవ సమానులు శ్రీ గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు*ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి* ధన్యవాదాలు, 🙏
తెలుగు
1
8
18
1.2K
Vannemreddy Satish Kumar retweetledi
Deputy CMO, Andhra Pradesh
పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం * స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి * రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు * స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం * పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్ల చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి •రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి. ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ శ్రీ బాలునాయక్ పాల్గొన్నారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
31
857
3.4K
39.7K
Vannemreddy Satish Kumar retweetledi
Deputy CMO, Andhra Pradesh
పల్లె ప్రగతికి పారదర్శక సర్వే - తద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గుర్తింపు - పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం జియో ట్యాగింగ్ తో రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ - పల్లె పండుగ 1, 2 ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన - గిరిజన ప్రాంతాలకు మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరణ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే 2వ విడతలో 2,750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే ఎక్కువగా 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాం. మొదటి విడతలో 22,500 గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గానూ 22,514 పూర్తి చేశాం. రెండవ విడతలో 15 వేల లక్ష్యానికి గానూ 15,303 గోకులాలు నిర్మించాం. పశువుల తాగునీటి అవసరాల కోసం 15 వేల లక్ష్యానికి గానూ 15,188 నీటి తొట్టెలు నిర్మించాం. మొదటి విడతలో 20 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 21 వేలు పూర్తి చేశాం. రెండవ విడతలో ఈ పనులను భారీగా పెంచి, 81 వేలు లక్ష్యానికి గానూ 86 వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించాం. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. •మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరించాలి గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలి. నల్లరేగడి నేలలు, డెల్టా ఏరియాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి, అక్కడి భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించాలి. కొండలు, గుట్టలతో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ పనులు చాలా కాలం మన్నేలా, శాస్త్రీయంగా ఉండటం కోసం నిపుణులైన ఇంజనీర్లు, పారిశుధ్యం-ప్రజారోగ్య నిపుణులు సలహాలు, సూచనలు కచ్చితంగా తీసుకోవాలి. •రోడ్ల నాణ్యతపై రాజీపడొద్దు గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నేలా ఉండాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. నాణ్యత లోపిస్తే సహించేది లేదు. సీసీ రోడ్డు వేసిన తర్వాత ఇరువైపులా అలాగే వదిలేయకుండా, మట్టితో పక్కాగా వాలు చేయాలి. వాలు చేయకుండా వదిలేస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశంతోపాటు వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్డు అంచులు త్వరగా పాడైపోతాయి. పల్లె ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే లక్ష్యంగా రోడ్లకు జియో మానిటరింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చాం. రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ పెట్టేందుకు ఈ డిజిటల్ పద్ధతి సహాయపడుతుంది. ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఎంతవరకు రోడ్డు పనులు జరిగాయో శాటిలైట్, జియో-ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చు. ప్రజలు కూడా రోడ్ల యొక్క ప్రస్తుత స్థితిగతులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. (1/2)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
24
578
2.3K
20K
Vannemreddy Satish Kumar
Vannemreddy Satish Kumar@JSPSatishKumar·
*అనకాపల్లి జిల్లా పరిధిలో గల గ్రంధాలయాల అభివృద్ధి మరియు సెస్ బకాయల కొరకు వినతి అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారిని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు @APDeputyCMO @AndhraPradeshCM @ncbn
Vannemreddy Satish Kumar tweet mediaVannemreddy Satish Kumar tweet media
తెలుగు
0
2
1
40
Vannemreddy Satish Kumar retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
भाषाएँ भारत को कभी विभाजित नहीं करतीं, बल्कि इसकी एकता को सुदृढ़ करती हैं। हर भाषा, बोली और संस्कृति का सम्मान करते हुए अपनी मातृभाषा का संरक्षण करना ही भारत की विविधता का सच्चा सार है। - श्री @PawanKalyan (माननीय उपमुख्यमंत्री, आंध्र प्रदेश, अध्यक्ष, जनसेना पार्टी) #JSPForNewAgePolitics
हिन्दी
14
539
1.7K
15K
Vannemreddy Satish Kumar retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Social consciousness without Caste ! Detailed explanation of JanaSena ideology by Chief, Deputy CM Shri @PawanKalyan garu !
English
28
708
2.2K
19.1K
Vannemreddy Satish Kumar retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Hade fantastiska samtal med statsminister Ulf Kristersson. Det var fantastiskt att H.K.H Kronprinsessan Victoria också deltog i mötet. Hon framförde också lyckönskningar från Deras Majestäter Kungen och Drottningen av Sverige. Min tacksamhet till dem. Relationerna mellan Indien och Sverige bygger på starka grunder av demokratiska värderingar, rättsstatens principer och människocentrerad utveckling. Med tanke på vårt växande samarbete inom alla områden beslutade vi att höja våra relationer till ett strategiskt partnerskap. Våra samtal omfattade att främja det bilaterala samarbetet inom sektorer som handel, försvar, innovation, AI, klimatförändringar med mera. @SwedishPM
Narendra Modi tweet mediaNarendra Modi tweet media
Svenska
507
2.6K
18.2K
931.8K
Vannemreddy Satish Kumar retweetledi
Deputy CMO, Andhra Pradesh
ఒక నాయకుడిలో ప్రజలు కోరుకునేది స్పందించే హృదయం. అలాంటి స్పందించే అందరికంటే ఎక్కువ నేను మన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిలో చూశానంటున్నారు ప్రముఖ నటుడు శ్రీ @AdiviSesh గారు. సమస్య విన్నవెంటనే స్పందించే తత్వం ఆయనకి మాత్రమే సొంతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని స్పష్టం చేశారు. #PawanKalyanTransformsAP #Chapter9
తెలుగు
95
3.2K
11.4K
193.9K
Vannemreddy Satish Kumar retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
నియోజక వర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు వివరాల స్వీకరణ
JanaSena Party tweet media
తెలుగు
11
453
1.4K
14.9K
Vannemreddy Satish Kumar
Vannemreddy Satish Kumar@JSPSatishKumar·
*వేసవి విజ్ఞాన శిబిరం* 17.05.26 *విశాఖ కేంద్ర గ్రంథాలయంలో బాల బాలికలకు వ్యక్తిత్వ వికాస ప్రక్రియతో ఉన్నతమైన భవిష్యత్తు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్* @JanaSenaParty @PawanKalyan @APDeputyCMO @JSPShatagniTeam
Vannemreddy Satish Kumar tweet mediaVannemreddy Satish Kumar tweet mediaVannemreddy Satish Kumar tweet media
తెలుగు
0
2
4
46
Vannemreddy Satish Kumar retweetledi
Deputy CMO, Andhra Pradesh
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో, భారతదేశంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఇచ్చిన పిలుపు మేరకు, కాన్వాయ్ వాహనాల సంఖ్యను 50% తగ్గించి, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ ప్రధాన మంత్రి మోదీ గారి సూచనల మేరకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు సహకరించాలని సూచించారు.
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సూచన మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 50 శాతం కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు చర్యలు పాటించాలని సూచించిన శ్రీ మోదీ గారు, స్వయంగా తాను పాటిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada

తెలుగు
13
511
1.7K
19.3K
Vannemreddy Satish Kumar retweetledi
Deputy CMO, Andhra Pradesh
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #AndhraPradesh
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
23
1.5K
8.2K
88.6K
Vannemreddy Satish Kumar
Vannemreddy Satish Kumar@JSPSatishKumar·
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #Pawankalyan
Vannemreddy Satish Kumar tweet mediaVannemreddy Satish Kumar tweet mediaVannemreddy Satish Kumar tweet media
తెలుగు
0
4
16
187
Vannemreddy Satish Kumar retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
8
922
4.3K
32.8K
Vannemreddy Satish Kumar retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
500+ days in jail. Bail denied. Again. Chinmoy Krishna Das Prabhu, a spiritual leader and an ISKCON monk, continues to languish behind bars in Bangladesh while the world watches. When even his lawyers are intimidated, threatened and silenced in court corridors, what justice are we even talking about? Is advocating for the rights of the Minority Hindu community a crime? When a saffron-clad soul is treated like a criminal for raising his voice, the world CANNOT remain silent. I appeal to the Government of Bangladesh to give medical aid and, more importantly, access to fair justice to Chinmoy Krishna Das Prabhu immediately. May he be granted bail at the earliest. And to all the pseudo-secularists and Selective Human rights Activists around the World who flood timelines overnight, wave watermelons and trend hashtags on cue, your silence can be still heard. Apparently, your humanity has a filter. @bdhc_delhi @UNHumanRights @UN_HRC @UN #FreeChinmoyKrishnaDas
Pawan Kalyan tweet media
Pawan Kalyan@PawanKalyan

Let’s all unite together in condemning the detention of ISKON Bangladesh Priest ‘ Chinmoy Krishna Das’ by Bangladesh police. We urge and plead Bangladesh Govt under Sri Mohammed Yunus to stop atrocities on Hindus. Indian army blood has been spilled , our resources had been spent , our Army Jawans lives had lost for Bangladesh formation. We are deeply disturbed the way our Hindu brothers and sisters are being targeted. We plead @UN @UNinIndia to intervene.

English
1.5K
26.5K
75.5K
1.7M
Vannemreddy Satish Kumar
Vannemreddy Satish Kumar@JSPSatishKumar·
వేసవి విజ్ఞాన శిబిరం జిల్లా కేంద్ర గ్రంధాలయం లో బాల బాలికలకు ఉచిత వేసవి శిబిరాలు చిత్రలేఖనం కవితలు వ్యాసాలు కథలు మొదలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు @APDeputyCMO @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam
Vannemreddy Satish Kumar tweet media
తెలుగు
2
5
10
534
Vannemreddy Satish Kumar retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru @annamalai_k Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu. “From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees. He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility. Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics. Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service. @pibchennai
English
190
10K
43.2K
723.8K
Vannemreddy Satish Kumar retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
ప్రజలకు మరింత విస్తృత సేవలు చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం •ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు: శ్రీ @PawanKalyan గారికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు సూచనలు •ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో ఆప్యాయంగా ముచ్చటించిన గౌరవ ప్రధానమంత్రి •మార్క్ శంకర్ సొంతంగా రూపొందించి అందించిన వెల్కమ్, థాంక్యూ కార్డులు చూసి ముచ్చటపడ్డ శ్రీ మోదీ గారు •ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ కవిత వినిపించిన అకీరా నందన్ •ఆద్య, పలీనా అంజని చదువులు గురించి అడిగిన శ్రీ మోదీ జీ •శ్రీమతి అన్నా కొణిదెల గారితో సంభాషణాల్లో రష్యన్ పదాలు పలికిన గౌరవ ప్రధాన మంత్రి ‘ఎవరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే మీరు ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహిస్తూ శ్రద్ధ చూపించాలి’ అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి హితవు చెప్పారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ సభ్యులు హార్ధిక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి, శస్త్ర చికిత్స గురించి వాకబు చేసి పరామర్శించారు. గత కొన్నేళ్లుగా సాగించిన పర్యటనల్లో దుమ్ము ధూళి రేగిపోయి - సైనస్ లోకి చేరిపోయి ఒక చిన్నపాటి గట్టి బాల్ మాదిరిగా మారిపోయి తీవ్ర ఇబ్బంది కలిగించి ఇన్ఫెక్షన్ అయిందని, కంటిపైనా ప్రభావం చూపిందని... ఆ క్రమంలో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫేస్) చేశారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని శ్రీ మోదీ గారు అడిగారు. భుజాల దగ్గర మజిల్ కి గతంలో తగిలిన గాయాలు ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ అని వైద్యులు తెలిపారని, వాటికి సర్జరీలు చేయాల్సి ఉందని, స్పైనల్ కార్డ్ కి సంబంధించి సమస్య ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారు హితవు చెబుతూ ‘ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. మీరు ఈ సమాజానికి చేయాల్సింది ఎంతో ఉంది’ అని పలు సూచనలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారితో మాట్లాడుతూ కొన్ని రష్యన్ పదాలు పలికారు. ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ సందర్భంగా తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థాంక్యూ కార్డులను శ్రీ మోదీ గారికి అందించారు. మార్క్ శంకర్ ను దగ్గరకు తీసుకొని ‘నీ గురించి మేమందరం ఎంతో కంగారుపడ్డాము. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని సింగపూర్ లో నువ్వు ఎలా ఉన్నావో అని మేమంతా ఆందోళనపడి, నీ గురించే ఆలోచించేలా చేశావు కదరా బాబూ’ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. •కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు అకీరా నందన్ తో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని అడిగారు. ప్రస్తుతం మార్షన్ ఆర్ట్స్ నేర్చుకొంటున్నాను, అలాగే స్పోర్ట్స్ షూటింగ్ శిక్షణ పొందుతున్నాను అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు... నువ్వూ అటు వైపే వెళ్తున్నావా అని చమత్కరించారు. ఈ సందర్భంగా- ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ కవితను వినిపించి, అందుకు సంబంధించి వివరాలను అకీరా నందన్ వినిపించారు. ఆ కవితకు ముగ్ధుడైన శ్రీ మోదీ గారు రాంధారీ సింగ్ దినకర్ జీ ఎంతో కఠినమైన హిందీ భాషను రాశారు.. కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు అని చెప్పి అభినందించారు. ఆద్య కొణిదెల ఏమి చదువుతున్నారో అడిగారు. ఈ సందర్భంగా ఆద్య – తన అమ్మమ్మ గారి వైపు గుజరాతీ మూలాలు ఉన్నాయని చెప్పారు. ఆద్యతో కూడా శ్రీ మోదీ గారు హిందీలో మాట్లాడారు. చిన్న కుమార్తె పలీనా అంజని ఇంగ్లీష్ లో మాట్లాడారు. హిందీ వచ్చా అని శ్రీ మోదీ గారు అడిగారు. తనకు హిందీ రాదు అని పలీనా తెలిపారు. ఈ సందర్భంగా పలీనా, శ్రీమతి అన్నా కొణిదెల గారితో మాట్లాడుతూ మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి అని సరదాగా చెప్పారు. సుమారు 20 నిమిషాలపాటు శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోఉన్నారు. అనంతరం శ్రీ మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసింది. ‘మీరు మా ఇంటికి వచ్చి చూపించిన అప్యాయతను, ప్రేమపూర్వక సంభాషణలను ఎప్పటికీ మరచిపోలేము’ అని ఇంటిల్లిపాదీ శ్రీ మోదీ గారికి చెప్పారు. @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
22
1.2K
4.3K
90.1K
Vannemreddy Satish Kumar retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
'కవి కోకిల' శ్రీ గుర్రం జాషువా గారు విరచితమైన ‘ఫిరదౌసి’లోని కవితలు ఇవి. గజినీ మహమ్మద్ పద్దెనిమిదిసార్లు మనదేశంపై దండయాత్ర చేసి మన సోమనాథుణ్ణి పెకలించడం గురించి, సంపదను ఏ విధంగా దోచుకొనిపోయాడో చెప్పిన కవితా పంక్తులు... గజనీమహమ్మదుఁడభూత పరాక్రమశాలి, వీరవాహినుల బలంబుతో బదియునెన్మిది మాఱులు కత్తిదూసి చిక్కని రుధిరంబులో భరతఖండము నార్ద్ర మొనర్చి సోమనాధుని పెకలించి కైకొని యెతొమ్మిది వన్నెల రత్నరాసులన్ బంగారు నాణెముల్ బస్తాల కెత్తించి మదపుటేన్గుల మీద బదిలపరచి లేతపచ్చల నేరి గోతాల కుట్టించి లొట్టి పిట్టలమీద దిట్టపఱచి కురువిందమణులను కుంచాల కొలిపించి పరువు డెద్దులబండ్లపై నమర్చి మొలక వజ్రముల జాలెల పోసి కూర్పించి గుఱ్రాల మూపుల గుస్తరించి పదియు నెనిమిది విజయరంభల వరించి గాంగలజలమున నెత్తుటికత్తి గడగి సర్వము హరించి హిందూదేశంబు విడచి గజనీమామూదు గజనీకి కదలిపోయె… They came. They destroyed. They thought they erased us. They were wrong. Somnath was razed 17 times. 17 times, Bharat rebuilt it — not just in stone, but in soul. This land does not forget. This civilization does not kneel. Post-Independence, when the dust of partition still hadn't settled, it was Sardar Vallabhbhai Patel who chose to rebuild Somnath first because he knew a nation that honours its civilizational memory can never be truly conquered. The Modern-day Cultural Renaissance of India began with the reconstruction of Somnath Temple 75 years ago. Today's Somnath Amrut Mahotsav isn't just a celebration. It is a declaration — that we know who we are, where we come from, and where we are going. Jay Somnath. 🔱 Jai Hind #SomnathAmrutMahotsav
Pawan Kalyan tweet media
తెలుగు
98
3.3K
12.2K
138.5K
Vannemreddy Satish Kumar retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను. @PawanKalyan
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
తెలుగు
840
10.4K
72.3K
2.8M