Ramesh Kandula
7.3K posts

Ramesh Kandula
@iamkandula
Journalist. Author of 'Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao', published by Penguin Random House. Views Personal. RTs not endorsements.

ఇది ఇవాల్టి ఈనాడు వార్త. ఇప్పుడీ ఫ్యాక్ట్ చెక్ బాధ్యులు (@FactCheckAPGov), వాళ్ల చేత ఫాల్స్ వివరణ ఇప్పించిన సిఆర్డీఏ పెద్దలు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? “ఆసరా లేని కుటుంబం దగ్గర 5 సెంట్లు ఇంటి భూమిని సేకరణ కింద తీసుకున్నారు, వాళ్లకి ప్రత్యామ్నాయం ఇవ్వటం లేదని అంటే” misleading అని బుకాయించారు. ఇప్పుడు కోర్టులో ప్లేటు ఫిరాయించారు. శుక్రవారం నాడు కోర్టులో '5 సెంట్ల భూమికి బదులుగా మరోచోట భూమి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు' అని సిఆర్డీఏ తరఫు న్యాయవాది కోర్టుకి చెప్పారు. నేను నా వీడియోలో చెప్పిందీ అదే ముక్క కదా - ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేయకూడదని! 5 సెంట్ల భూమి ఆమెది కాకపోతే, ఆమె కుటుంబానికి ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన అవసరమే లేకపోతే కోర్టుకి ఇప్పుడిలా ఎందుకు చెప్పినట్టు? ఫ్యాక్ట్ చెక్ లో సిఆర్డీఏ మాయాజాలం చేస్తే, దానికి కొంతమంది తెలిసీతెలియక వంతపాాడారు. ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేశాక, సిఆర్డీఏ వాళ్లు నిజాలు ఒప్పుకున్నారు. దీన్నిబట్టి ఎవరి క్రెడిబిలిటి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.

భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సీఆర్డీఏ రోడ్డున పడేసిందని... దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ ఒక మీడియా మరియు దాని తరపున ప్రతినిధులు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. జరిగింది ఏంటంటే... నెల్లూరి శేషగిరిరావు గారి కుమార్తె శ్రీమతి చెరుకూరి వెంకాయమ్మ అనే మహిళ రాయపూడి గ్రామం సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 43 సెంట్లు మరియు 110-D1లో 0.34 సెంట్ల భూమిని భూసమీకరణ కింద రాజధాని అమరావతి అభివృద్ధి కోసం APCRDAకి (Form-9.3) ఇచ్చారు. తర్వాత సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 38 సెంట్లను, 110-D1లో 0.34 సెంట్ల భూమిని శ్రీమతి సుభాషిణి అనే మరో మహిళకు అమ్మేసారు. దానికి అనుగుణంగా, సీఆర్‌డీఏ వారు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించి, వాటి రిజిస్ట్రేషన్ జి. సుభాషిణి గారి పేరు మీద చేశారు. కానీ కొందరు చేస్తున్న ప్రచారంలో ఈ భూమిని వెంకాయమ్మ గారి నుంచి మత్స్యకారుల కాలనీ కోసం ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది అవాస్తవం. సుభాషిణి గారికి అమ్మగా, సర్వేనెంబర్ 110-D3లో మిగిలిన 0.05 సెంట్ల భూమిని వెంకాయమ్మ గారు తన తండ్రి నెల్లూరి శేషగిరిరావు గారికి అమ్మారు. ఆయన ఆ 0.05 సెంట్ల భూమిని APCRDA కు ఇచ్చేందుకు (Form-9.3) అంగీకారం తెలిపారు. దీంతో ఆయనకు యాన్యుటీ కింద 9 ఏళ్లపాటు 3,78,744 రూపాయలను అందించడం జరిగింది. తర్వాత ఆయన ఆ భూమిని తన తమ్ముడి కొడుకు నెల్లూరి బ్రహ్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి అమ్మేసారు. అంటే ఇప్పుడు వెంకాయమ్మ గారి పేరిట ఏ భూమి కూడా లేదు. సీఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం, రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడానికి కనీసం 0.12 సెంట్ల భూమి ఉండాలి. దాని కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూ యజమానులకు ఏపీ సీఆర్‌డీఏ TDR బాండ్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆ 0.05 సెంట్ల భూమికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడం కుదరదు. TDR బాండ్లు మాత్రమే ఇవ్వబడతాయి. ఇక మరో విషయం ఏమంటే శేషగిరిరావు గారి భూమిలో దొండపాడు గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం పంచాయతీ వారు రెండు బోర్లను తవ్వించారు. అందుకు గాను శేషగిరిరావుకు ఉద్యోగం ఇచ్చారు. కోవిడ్ 19 కారణంగా ఆయన చనిపోయాక ఆ ఉద్యోగంలో బ్రహ్మేంద్ర కుమార్ చేరాడు. శేషగిరిరావు మరణాంతరం ఆయన చట్టబద్ధమైన భార్య (పిటిషనర్ శేషగిరమ్మ) 0.05 సెంట్ల భూమిని తన పేరిట మ్యుటేషన్ చేయించుకోలేదు. పిటిషనర్ కూతురు వెంకాయమ్మ కూడా గత సెప్టెంబర్ నెల 29న మరణించారు. దాంతో ఇప్పుడు శేషగిరమ్మను, ఆమె మనవరాలు శ్యామలను శేషగిరిరావు గారి స్థానంలో పంచాయతీ శాఖలో ఉద్యోగం చేసుకుంటున్న బ్రహ్మేంద్ర కుమార్ చూసుకుంటున్నారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేయగా తేలింది ఏమంటే... శేషగిరమ్మ గారు బోరుపాలెం గ్రామం సర్వేనెంబర్ 100-Aలో 0.50 సెంట్ల భూమిని కూడా ఏపీ సీఆర్‌డీఏకి (ఫారమ్-9.3) ఇచ్చేందుకు అంగీకరించారు. దానికి ప్రతిగా ఆమెకు రిటర్న్ బుల్ రెసిడెన్షియల్ ప్లాట్ నంబర్ 3-288-1838-5-C2 (S-500) మరియు కమర్షియల్ ప్లాట్ నంబర్ 1-252-1800-5-H3 (S-120) లను కేటాయించి, 24.08.2022న రిజిస్ట్రేషన్ కూడా చేసారు. అయితే వాటిని కూడా ఆమె బ్రహ్మేంద్ర కుమార్ కు అమ్మేసారు. అందువల్ల బ్రహ్మేంద్ర కుమార్ గారు పిటిషనర్‌కి కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ ద్వారా పొందారు. కాబట్టి పిటిషనర్ నెల్లూరి శేషగిరమ్మ నుంచి తీసుకున్న రాయపూడి మరియు బొరుపాలెం గ్రామాల భూములకు గాను సీఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు మరియు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగింది. కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇస్తోంది. ఆమె మనుమరాలు శ్యామలకు కూడా దివ్యాంగ పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. వాస్తవాలు ఇలా ఉండగా కొందరు ఈ విషయాలను తెలుసుకోకుండా వారికి తోచిన కథనాలను అల్లుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి కథనాల పట్ల అప్రమత్తంగా ఉండండి. #FactCheck #AndhraPradesh

Fake. ఫ్యాక్ట్ చెక్ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన వివరణ ఫేక్. అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటోందని, దాన్ని భూసమీకరణ కింద సిఆర్డీఏ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలంగాని, ఇల్లు గాని ఇవ్వటం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండని కోర్టుకి వెళ్లిందని నేను ఒక వీడియో చేశాను. youtu.be/JEya0lszUPY దీని మీద సిఆర్డీఏ తరఫున AP Fact Check పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. Misleading అనే టైటిల్ తో ఈ వివరణ ఉంది. అంటే, నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అర్థం. నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పదోవ పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణని ఒకటికి రెండు సార్లు చదివాను. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే, misleading అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు. నేను వీడియోలో చెప్పిందీ అదే కదా? 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేదే నేను వేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీఏ అధికారులు వ్యవహరించాలి అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయటం చూస్తే, సిఆర్డీఏ ఎంత కళ్లుమూసుకుపోయి ఉందో అర్థమవుతోంది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నే రిపీట్ చేశారు: “కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.” ఆమెకి ఉన్నదే ఆ 5 సెంట్ల భూమి. మరి రిటర్న్ బుల్ ప్లాట్ కాకుండా, బాండ్లు, సర్టిఫికెట్లు ఆమెకెందుకు? ఇంకో విశేషం ఏంటంటే, శేషగిరమ్మ అనే వృద్ధురాలి దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు. 2.42 గజాలు. నిజమా? 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్లు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. “ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ” అని రాశారు. అంటే ఆమె కోర్టుకి వెళ్లిన విషయం వాస్తవం కాదనే ధ్వని ఉంది. దీన్ని కూడా అబద్ధం అని రాసే ధైర్యం సిఆర్డీఏ అధికారులకి ఎలా వచ్చిందో తెలియదు. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో కూడా వచ్చిన క్లిప్పింగుని జతచేశాను. మొత్తంగా ఏంటంటే, నిబంధనల ముసుగులో అడ్డగోలుగా ప్రవర్తిస్తామని, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తామని సిఆర్డీఏ వారు చెబుతున్నారన్నమాట.

@iamkandula please try to go deep into the facts before going public

భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సీఆర్డీఏ రోడ్డున పడేసిందని... దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ ఒక మీడియా మరియు దాని తరపున ప్రతినిధులు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. జరిగింది ఏంటంటే... నెల్లూరి శేషగిరిరావు గారి కుమార్తె శ్రీమతి చెరుకూరి వెంకాయమ్మ అనే మహిళ రాయపూడి గ్రామం సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 43 సెంట్లు మరియు 110-D1లో 0.34 సెంట్ల భూమిని భూసమీకరణ కింద రాజధాని అమరావతి అభివృద్ధి కోసం APCRDAకి (Form-9.3) ఇచ్చారు. తర్వాత సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 38 సెంట్లను, 110-D1లో 0.34 సెంట్ల భూమిని శ్రీమతి సుభాషిణి అనే మరో మహిళకు అమ్మేసారు. దానికి అనుగుణంగా, సీఆర్‌డీఏ వారు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించి, వాటి రిజిస్ట్రేషన్ జి. సుభాషిణి గారి పేరు మీద చేశారు. కానీ కొందరు చేస్తున్న ప్రచారంలో ఈ భూమిని వెంకాయమ్మ గారి నుంచి మత్స్యకారుల కాలనీ కోసం ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది అవాస్తవం. సుభాషిణి గారికి అమ్మగా, సర్వేనెంబర్ 110-D3లో మిగిలిన 0.05 సెంట్ల భూమిని వెంకాయమ్మ గారు తన తండ్రి నెల్లూరి శేషగిరిరావు గారికి అమ్మారు. ఆయన ఆ 0.05 సెంట్ల భూమిని APCRDA కు ఇచ్చేందుకు (Form-9.3) అంగీకారం తెలిపారు. దీంతో ఆయనకు యాన్యుటీ కింద 9 ఏళ్లపాటు 3,78,744 రూపాయలను అందించడం జరిగింది. తర్వాత ఆయన ఆ భూమిని తన తమ్ముడి కొడుకు నెల్లూరి బ్రహ్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి అమ్మేసారు. అంటే ఇప్పుడు వెంకాయమ్మ గారి పేరిట ఏ భూమి కూడా లేదు. సీఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం, రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడానికి కనీసం 0.12 సెంట్ల భూమి ఉండాలి. దాని కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూ యజమానులకు ఏపీ సీఆర్‌డీఏ TDR బాండ్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆ 0.05 సెంట్ల భూమికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడం కుదరదు. TDR బాండ్లు మాత్రమే ఇవ్వబడతాయి. ఇక మరో విషయం ఏమంటే శేషగిరిరావు గారి భూమిలో దొండపాడు గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం పంచాయతీ వారు రెండు బోర్లను తవ్వించారు. అందుకు గాను శేషగిరిరావుకు ఉద్యోగం ఇచ్చారు. కోవిడ్ 19 కారణంగా ఆయన చనిపోయాక ఆ ఉద్యోగంలో బ్రహ్మేంద్ర కుమార్ చేరాడు. శేషగిరిరావు మరణాంతరం ఆయన చట్టబద్ధమైన భార్య (పిటిషనర్ శేషగిరమ్మ) 0.05 సెంట్ల భూమిని తన పేరిట మ్యుటేషన్ చేయించుకోలేదు. పిటిషనర్ కూతురు వెంకాయమ్మ కూడా గత సెప్టెంబర్ నెల 29న మరణించారు. దాంతో ఇప్పుడు శేషగిరమ్మను, ఆమె మనవరాలు శ్యామలను శేషగిరిరావు గారి స్థానంలో పంచాయతీ శాఖలో ఉద్యోగం చేసుకుంటున్న బ్రహ్మేంద్ర కుమార్ చూసుకుంటున్నారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేయగా తేలింది ఏమంటే... శేషగిరమ్మ గారు బోరుపాలెం గ్రామం సర్వేనెంబర్ 100-Aలో 0.50 సెంట్ల భూమిని కూడా ఏపీ సీఆర్‌డీఏకి (ఫారమ్-9.3) ఇచ్చేందుకు అంగీకరించారు. దానికి ప్రతిగా ఆమెకు రిటర్న్ బుల్ రెసిడెన్షియల్ ప్లాట్ నంబర్ 3-288-1838-5-C2 (S-500) మరియు కమర్షియల్ ప్లాట్ నంబర్ 1-252-1800-5-H3 (S-120) లను కేటాయించి, 24.08.2022న రిజిస్ట్రేషన్ కూడా చేసారు. అయితే వాటిని కూడా ఆమె బ్రహ్మేంద్ర కుమార్ కు అమ్మేసారు. అందువల్ల బ్రహ్మేంద్ర కుమార్ గారు పిటిషనర్‌కి కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ ద్వారా పొందారు. కాబట్టి పిటిషనర్ నెల్లూరి శేషగిరమ్మ నుంచి తీసుకున్న రాయపూడి మరియు బొరుపాలెం గ్రామాల భూములకు గాను సీఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు మరియు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగింది. కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇస్తోంది. ఆమె మనుమరాలు శ్యామలకు కూడా దివ్యాంగ పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. వాస్తవాలు ఇలా ఉండగా కొందరు ఈ విషయాలను తెలుసుకోకుండా వారికి తోచిన కథనాలను అల్లుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి కథనాల పట్ల అప్రమత్తంగా ఉండండి. #FactCheck #AndhraPradesh

Kommineni gets bail in SC. The order says: Considering that the petitioner himself has not made any such statement and his journalistic participation in a live TV show deserves to be protected so that the freedom of speech is also protected in the process, we direct that the petitioner shall be released in relation to the FIR..