Swetcha Votarkar
300 posts

Swetcha Votarkar
@swetchajourno
Journalist | Special correspondent @TNewsTelugu | poet | views are personal |
Hyderabad, Telangana,India Katılım Aralık 2016
351 Takip Edilen2.1K Takipçiler

అధికార వార్షికోత్సవ శుభాకాంక్షలు @PawanKalyan గారు💐💐
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మీ మాటలు నిజమా లేక జూన్ 2, 2025 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పే సందర్భంలో పొగడ్తలు నిజమా @PawanKalyan గారు? లేటెస్ట్ పోస్ట్ కాబట్టి తెలంగాణ నేల మీద, ప్రజల మీద మీ కన్సర్న్ నిజమే అయితే ..తెలంగాణను ఎడారిగా మార్చబోతున్న గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఆలోచనను విరమించుకోమని..తెలంగాణకు నష్టం చేసే కుట్రలను ఆపేయమని, అవి బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ కు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని మీ ముఖ్యమంత్రి @ncbn గారికి వివరంగా చెప్పి ఒప్పించండి..కాళేశ్వరాన్ని అడ్డుకోలేదు అని చెప్తున్న @ncbn గారి మాటలు అబద్ధాలు అనడానికి సాక్ష్యాలను గమనించండి.. కాళేశ్వరం ప్రాజెక్టు కు పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత ఆ అనుమతులు రద్దు చేయమంటూ రాసిన లేఖను జతపరుస్తున్నాను.
గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కు పూర్తిగా సహకరిస్తున్న మీ మిత్రపక్ష భాగస్వామి, ప్రధాన మంత్రి @narendramodi గారితో కూడా చర్చించండి.
మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్ర అభివృద్ధి ముమ్మాటికీ మీ బాధ్యతే..కానీ తెలంగాణను పణంగా పెట్టి మాత్రం కాదు.
#SaveTelangana
#StopGodavariBanakachala



తెలుగు

మన తెలంగాణను
పరాయి శక్తులు...పరాధీన శక్తుల నుండి
కాపాడుకుందాం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
జై తెలంగాణ✊🏽✊🏽
#TelanganaFormationDay2025
#JaiTelangana✊🏽

తెలుగు

ఆశయం తెలంగాణ
ప్రతీ ఆలోచన తెలంగాణ..
ఆత్మగౌరవం, అస్తిత్వ
అభివృద్ధి, సంక్షేమానికై..
తిరుగులేని ఉద్యమ జెండా
తెలంగాణ గుండెల నిండా..
ఇంకెప్పుడూ.. ఇంకెవ్వడూ
తెలంగాణను చెదరనీయకుండా
మరో పోరుకు సంకల్పిస్తూ..
25 వసంతాల శుభాకాంక్షలు 🌷🌷
#25YearsOfBRS
#BRSFormationday
@BRSparty
@KCRBRSPresident
@KTRBRS @RaoKavitha @BRSHarish @SantoshKumarBRS @jagadishBRS @vinodboianpalli
తెలుగు

ముందు జై తెలంగాణ అనలేదు..అననియ్యలేదు..
సందు చూసుకొని సమైక్య రాష్ట్రమే బాగుందన్నారు..
బతుకమ్మ పండుగకి సంబురం లేకుండా చేశారు..
తెలంగాణ తల్లికి నగలుండవన్నారు..
అమ్మ చేతిలో బతుకమ్మను మాయం చేశారు..
తెలంగాణ భాష,యాస అంటారెందుకు
తెలుగు భాష అనమని రాయిస్తున్నారు..
రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తరిమికొట్టిన నేల మీద
ద్రోహపు కళ్ళకు ఆశలు పుట్టిస్తున్నారు..
తెలంగాణకు అన్నం తినుడే కాదు..
వ్యవసాయమూ నేర్పిన్రంటున్నారు..
నీళ్లను,భూములను వాళ్లకు దోచిపెడుతూ
తెలంగాణ ప్రజలను గోసపెడుతున్న
మీ తాకట్టు బతుకులు చూస్తేనే అసహ్యమేస్తుంది..
అలెర్ట్ తెలంగాణ!!
వీళ్ళంతా తెలంగాణ భవిష్యత్తుకు ప్రమాద సూచికలు..!!
#AlertTelangana
తెలుగు

సుప్రీం సాధికార కమిటీ నివేదికలో అంశాలు తెలిసీ ఈ హెడ్డింగ్ పెట్టుకున్నారంటే ఎంత దురాశ..
#KanchaGachibowliforest
#SupremeCourt
#CentralEmpoweredCommitteeReport


తెలుగు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంలో పలు రాజకీయ పార్టీల కుట్రలకు, కుతంత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా తన వంతు పాత్ర పోషించింది ఓ వర్గం మీడియా. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించడం మొదలుకొని ఉద్యమాన్ని తప్పుబట్టే ప్రశ్నలు రాసిచ్చి అడిగించడం దాకా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ప్రతి పోరాటాన్నీ పత్రికల్లో, చానెళ్లలో కనిపించకుండా అణిచిపెట్టిన సందర్భాలకు లెక్కే లేదు.

తెలుగు

ఎంత బెదిరిపోయి ఉంటాయి ఆ జింకలన్నీ
యుద్ధ భూమిలో అన్నీ కోల్పోయి ఏడుస్తున్న పసిపిల్లల్లా..
ఎంత భయమేస్తే ఆర్తనాదాలు చేసి ఉంటాయి ఆ నెమళ్లన్నీ
ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో శత్రువుల ఆకస్మిక దాడిలా..
మనిషి భాష రాదేమో కానీ
మనిషి మనుగడకి ప్రకృతి ఇచ్చిన వరాలు ఆ జీవాలు..
నెమలి అంటే ఇక పురివిప్పిన నాట్యం బదులు
ఈ ఆర్తనాదాలే వినిపిస్తాయేమో..
ఎక్కడ గడ్డీ మొక్కలు కనిపించినా
ఆ జింకల కన్నీళ్లే వెంటాడుతాయేమో..
అధికారంలో ఉన్నవాళ్లు బలవంతంగా విధ్వంసం చేస్తున్నా
చెట్లను చెరువులను వన్యప్రాణులనూ మాయం చేసే కుట్రలకు
ఆ అధికారాన్నిచ్చిన ప్రజలు ఎదురు తిరుగుతున్నారు..
అపురూప వన్య సంపద రక్షణను గుండెల మీదికెత్తుకొని
లాఠీ దెబ్బలు తింటున్నారు, గొంతెత్తి నినదిస్తున్నారు..
మా ప్రియమైన వన్యప్రాణులారా!
ప్రభుత్వ కుతంత్రాలకు బెరిరిపోవద్దు..చెదిరిపోవద్దు..
మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటాం.. ✊🏽
#SaveHCUBioDiversity
#SaveHCU
#SaveTelangana
#ShameOnCongress
@KTRBRS
@RaoKavitha
@BRSHarish
@SantoshKumarBRS
@BRSparty
@sravandasoju
@KonathamDileep
@TelanganaCMO
@TelanganaForest
@RahulGandhi
@iamkondasurekha
@VennelaMocherla
@sabarigrajan
@HydUniv
తెలుగు

అసెంబ్లీలో మహిళా సభ్యురాలి పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడిన వ్యక్తికి స్పీకర్ పదవిలో ఉండే అర్హత ఉందా?
#Telanganaassembly2025
#Insultingwoman
తెలుగు

ఎవరు చస్తే... నాకేంటి!
నేను మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోతా.. లేకుంటే ఢిల్లీకి పోతా-ముఖ్యమంత్రి
ఎవరికేమైతే నాకేంటి!
నేను మాత్రం దుబాయ్లో మ్యాచ్ చూస్తా...
చావు బతుకుల ఆర్తనాదాల మధ్య కూడా చాపల పులుసే తింటా-ఒక మంత్రి
ప్రమాదం జరిగింది టన్నెల్లో అయితే నేను మాత్రం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేస్తా..రెస్క్యూ ఆపరేషన్ ఏమైతే ఏంది, చీకటైతుందని హెలికాప్టర్లో ఇంటికెళ్ళిపోతా-ఇంకో మంత్రి
మేడిగడ్డకి పగుల్లోస్తే గాయిగత్తర లేపిన ముఖ్యమంత్రి, మంత్రులకి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారో లేరో చెప్పే కనీస బాధ్యత లేదా?
#justasking
#shameoncongress
#Telangana
#SLBCTunnelCollapse
తెలుగు

మీకు దమ్మాగిపోయేదాకా అబద్దాలతో దుమ్మెత్తిపోసినా
ప్రజల గోసపుచ్చుకుంటున్న మీ గోసపుచ్చుకునేదాకా
తెలంగాణ చైతన్యం, పౌరుషం మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి
ఏడిదాకా తరిమి కొడతదో.. జస్ట్ వెయిట్ అండ్ సీ గైస్..
#JaiTelangana✊🏽
#FailureCongress
@INCTelangana
@INCIndia
@revanth_anumula
@RahulGandhi
తెలుగు

తెలంగాణ ఊపిరికి పుట్టినరోజు శుభాకాంక్షలు💐 @KCRBRSPresident
@KTRBRS
#HappyBirthdayKCR
#JaiTelangana✊🏽

తెలుగు

రీజనబుల్ టైం
నాట్లేసే ముందే సాగునీరు, పెట్టుబడి సాయం, కరెంట్ రైతులకి అందకుండా చేసినప్పుడు గుర్తుకురాలేదా రీజనబుల్ టైం..
చెప్పిన సమయానికి రుణమాఫీ జరగక రైతు బ్యాంక్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే దుస్థితికి కారణమైనప్పుడు గుర్తుకు రాలేదా రీజనబుల్ టైం..
పెన్షన్లు, ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, చదువులకు ఫీజులు, హాస్టళ్లలో పిల్లలకు ఆహారం, కనీస సౌకర్యాలు..ఆఖరికి తాగునీళ్ళు కూడా అందించాల్సింది ఖచ్చితమైన సమయానికే కదా..
పరిపాలన గాలికొదిలేసి ప్రజల చావులకి కారణమైనపుడు కాకుండా
వ్యక్తిగత స్వార్థాలకి 'రీజనబుల్ టైం' గుర్తుకు తెచ్చుకున్నందుకు సిగ్గుపడండి..
#ShameOnCongress
#Telangana
తెలుగు

ఎగిరి దుమికితే నింగి తగులును..
ఎగిరినం అనుకుంటే.. కనుమరుగాయెను..
అరె అరె.. అరె అరె..
#ZeroCongress
#DelhiAssemblyElectionResults2025
తెలుగు

లేనిపోని సమస్యలు సృష్టించి
ప్రజలను వంచించి
బాధితులను వేధించి అవమానించిన చోట
ప్రజలను, ప్రతిపక్షాన్ని
ప్రభుత్వం ఒకే గాటిన కట్టిన చోట
అర్థమయ్యేది ఒక్కటే..
ప్రతిపక్షం ప్రజాపక్షం✊🏽
#Telangana
తెలుగు

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభల సందర్భంలో జరిగిన పరిణామాలను తెలంగాణ ప్రజలకు, ప్రపంచానికి చూపించే విషయంలో మీడియా కుట్రలను తేలికగా తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రతీ రోజూ తెలంగాణ ప్రజల సమస్యలను దాచి తెలంగాణ సమాజానికి ద్రోహం చేసే కుట్రలను చేస్తున్న మీడియా సంస్థల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనివార్యం..
#BeAwareTelangana
తెలుగు
