YS Jagan Mohan Reddy

2K posts

YS Jagan Mohan Reddy banner
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

@ysjagan

President, YSR Congress Party

Vijayawada, India Katılım Ocak 2015
7 Takip Edilen2.7M Takipçiler
YS Jagan Mohan Reddy
Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on winning the KFF Singapore Badminton Open 2026 Men’s Doubles title. Proud moment for India and Andhra Pradesh. Wishing them both many more achievements and continued success ahead. @BAI_Media @satwiksairaj @Shettychirag04
YS Jagan Mohan Reddy tweet media
English
12
305
1.4K
10.9K
YS Jagan Mohan Reddy
కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
111
2.4K
10.6K
97K
YS Jagan Mohan Reddy
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి.. దేవునిపై అచంచలమైన భక్తిని, త్యాగనిరతిని చాటిచెప్పే పర్వదినమే బక్రీద్‌. అల్లాహ్ ఆదేశాల మేరకు తన ప్రాణప్రదమైన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. #EidUlAdha
తెలుగు
51
645
3.2K
50.4K
YS Jagan Mohan Reddy
Warm birthday wishes to the Hon’ble Union Minister, Sri Nitin Gadkari ji. May God bless you with good health, happiness, and a long life. @nitin_gadkari
English
39
422
2.6K
36K
YS Jagan Mohan Reddy
సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబుగారు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు చూపుతూ, అప్పట్లో చేసిన CDFD ల్యాబ్‌ రిపోర్టులు చూపుతూ, డీఎన్‌ఏ ప్రొఫైల్‌ ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం. English Version - tinyurl.com/2wfajb56
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
181
1.1K
3.8K
216.6K
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? 1.పేప‌ర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? 2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? 3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్‌ ఆపరేషన్‌’’ను ఎందుకు దాచిపెడుతున్నారు? 4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? 5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్‌ నుంచి ఎందుకు డిలీట్‌ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్‌ వివరాలను ఎందుకు తొలగించారు? 6.సెలెక్ట్‌ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? 7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేర‌సారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్‌ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్‌ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. 8.టెట్‌ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్‌ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్‌ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి? 9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..! English Version- tinyurl.com/45um3x5b
తెలుగు
167
1.1K
3.5K
398.2K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్‌, జూపూడి ప్రభాకర్‌, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్‌ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు చూపిస్తున్నారు? మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్‌లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా? మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్‌ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌ చేశారు చంద్రబాబూ. @ncbn గారూ… , మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది. #YSRCPForFarmers English Version- tinyurl.com/y69hc29c
తెలుగు
70
789
2.1K
33.9K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
నాగార్జునసాగర్ వంటి మహత్తర ప్రాజెక్టులకు బాటలు వేసి, రైతాంగం అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప దార్శనికుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
23
418
1.6K
28.8K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృద‌యాల్లో గూడుక‌ట్టుకుని ఉన్నాయి. నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
35
591
3.5K
55.8K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు త‌న ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. నేడు టంగుటూరి ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
27
408
1.7K
21.9K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, లోక్‌సభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి, భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
34
517
2.1K
42.1K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
𝟮 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗶𝗻𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗲𝘃𝗲𝗿𝗲 𝗳𝗶𝘀𝗰𝗮𝗹 𝘀𝘁𝗿𝗲𝘀𝘀 The provisional accounts for the financial year 2025-26 have been published by the CAG, these accounts bring to light unsettling facts regarding the State. On one hand Mr. Chandrababu Naidu garu claims of a galloping State with a year-on-year GSDP growth rate of 10.75% during FY 2025-26. In a manner that completely contrasts this, the tax revenues of the State Government have contracted by 3.22% during FY 2025-26. In any State that is progressing fast, there would be heightened levels of investment and consumption, reflecting in the form of higher tax collections by the State Government. In reality, the State Government tax revenues have declined by 3.22% against the revised estimates of a 9.60% growth over previous year during 2025-26, as shown in volumes placed for State Budget for FY 2026-27. If the State tax revenues have actually grown by 9.60%, then one would believe the State Government's GSDP growth estimates of 10.75%. However, what was witnessed was a contraction to the tune of 3.22% (-𝟯.𝟮𝟮%), in own tax revenues. The State tax revenues during 2023-24 (last year of the previous Government) were, Rs. 85,922.23 crores. After two years, even if a modest 8% growth was achieved, the tax revenues in the year 2025-26 should have been, Rs. 1,00,219.69 crores. However, what was achieved was only 86,552.68 crores during 2025-26. Therefore, the notional loss under this Government during this year is to the tune of 𝗥𝘀. 𝟭𝟯,𝟲𝟲𝟳 𝗰𝗿𝗼𝗿𝗲𝘀. Mr. @ncbn garu speaks of "Sampada Srushti", is this his Samapada Srushti? lower revenues by Rs. 13,667 crores even when compared with a modest benchmark? As we have always been saying, the Rs. 9,000 crores raised through NCD issuance by APMDC during May 2025, was actually intended to be utilised for meeting Government revenue expenditure. No asset creation took place from this NCD issuance. In an unprecedented manner, private NCD holders were allowed access to the Consolidated Fund of the State in violation of all Constitutional norms. From the accounts, on can ascertain that, this amount is received as Non-tax revenues during 2025-26. Therefore, what was witnessed over the last two years was, unambiguous signs of economic distress resulting from policy paralysis and corruption, tales of rapid growth for the purposes of diversion, and adoption of un-constructional and unhealthy means for raising debt.
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
English
102
1.1K
2.5K
96.8K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు ఆయన. వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేం. నేడు సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
38
623
2.6K
36K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
.@ncbn గారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్‌ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులుపెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్‌ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు. చంద్రబాబుగారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులుకూడా చితికిపోయారు. సిండికేట్‌ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్‌ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? చంద్రబాబుగారూ.., ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు, పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. Chandrababu Naidu Garu, under your governance, no sector has been spared from exploitation. In the case of aqua feed prices too, you have colluded with the aqua feed companies and are enabling the looting of aqua farmers. Every measure our government had taken to support aqua farmers has been systematically weakened, causing severe damage to the farming community. How can companies increase aqua feed prices without the knowledge or approval of APSADA, the regulatory authority headed by the Chief Minister himself? In this context, is your narrative not misleading? How did these companies gain the audacity to defy both the government and the law? Is it not because they are closely associated with you and your party? Is it not an undeniable truth that these aqua feed companies are sympathizers and supporters of your party? Is it not true that you compromised with them for commissions? That is precisely why you have remained silent despite the continuous hike in feed prices. Chandrababu Garu, ever since you came to power, aqua farmers, along with all sections of society in the State, have been pushed into distress. During the period of our Government, we enacted laws to protect farmers from syndicates, middlemen, and exploitative companies, and established APSADA as a regulatory body under the chairmanship of the Chief Minister. However, after you came to power, you deliberately weakened and rendered the institution ineffective. Our government not only took responsibility for regulating seed and feed quality standards and controlling their prices, but also for determining prices for aqua products. We supplied electricity to aqua farmers at just Rs. 1.50 per unit and extended support in every possible way. But after you assumed office, all those systems were dismantled, pushing aqua farmers into severe distress. During the first year itself, when aqua product prices crashed and farmers suffered huge losses, you remained a silent spectator instead of taking responsibility to support them. Now, you are openly backing the exploitation being carried out through the hike in feed prices. Is this not grave injustice to farmers? Chandrababu Garu, merely building a narrative that the feed price hike is temporary, would not serve any purpose. The increased prices must be completely rolled back. Otherwise, we warn that we will launch protests along with the farmers.
తెలుగు
94
852
2.8K
65K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా "దాసోహం కౌసలేంద్రస్య" అన్న వినయమూర్తి.. అపారబలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు. రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న రామభక్తుడు హ‌నుమాన్. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ హనుమాన్ జయంతి శుభాకాంక్ష‌లు. #HanumanJayanti
తెలుగు
228
1.3K
7.6K
246.4K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Hello India !!!!! AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh. Article 19 of the Indian Constitution guarantees Freedom of Speech, one of the most sacred and non-negotiable pillars of democracy. But today, in Andhra Pradesh, that constitutional guarantee is being subjected to a dangerous, systematic, and deeply disturbing assault under the TDP coalition government led by Chief Minister @ncbn. The Andhra Pradesh Police machinery is increasingly being weaponized as a political tool to intimidate critics, silence opposition voices, and create an atmosphere of fear among citizens who question the government. A systematic campaign of political vendetta, authoritarian intimidation, and institutional misuse of power is being unleashed against social media activists, YSRCP supporters, journalists, and ordinary citizens who dare to expose the failures, hypocrisy, corruption, and anti-people governance of the TDP coalition. The modus operandi has now become frighteningly clear and predictable. TDP leaders and their affiliated supporters continuously file politically motivated complaints against social media posts, videos, comments, and opinions that question the TDP government or criticize its leaders. Acting almost immediately on these complaints, the police department rushes to register cases, invoke exaggerated and questionable legal provisions, file false and fabricated FIRs, and begin coercive harassment against dissenting voices. The misuse of power does not stop there. The police department itself is allegedly sending notices to social media platform X and other social media platforms, demanding the removal of content critical of TDP leaders and seeking the blocking or suspension of accounts that expose government failures or question those in power. This coordinated censorship campaign clearly demonstrates how the Naidu government is using the police department as its political enforcement machinery to control public discourse, crush dissent, and suppress democratic expression. Such coercive steps exposes the insecure, intolerant, vindictive, and deeply authoritarian mindset of a government that appears terrified of criticism, accountability, transparency, and public scrutiny. Ironically, while the TDP propaganda ecosystem continuously spreads toxic misinformation, character assassination campaigns, abusive trolling, hate-driven narratives, and malicious attacks against YSRCP leaders and political opponents on a daily basis, complaints filed against them are conveniently ignored. No action, no FIRs, no accountability. This shocking double standard and blatant misuse of state machinery represents a grave attack on democratic values, constitutional freedoms, civil liberties, and the very spirit of democracy itself. Democracy cannot survive in an atmosphere where fear replaces freedom, intimidation replaces accountability, police institutions become political weapons, and criticism is criminalized. We strongly condemn these draconian, repressive, politically motivated, and anti-democratic actions and demand that the Andhra Pradesh government immediately stop abusing police power, targeting opposition voices, manipulating social media regulation, and throttling democratic dissent. హలో ఇండియా !!! రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు మొత్తం పోలీస్‌ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణిచి వేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటి వాక్‌ స్వాతంత్య్రం. దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టిక‌ల్‌–19 లో పొందుపర్చారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్‌ మీడియా కార్యకర్తలు, వైయస్సార్‌సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు, సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతూ, అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్‌ మీడియలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్‌ చేసినా ఏ మాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్ట విరుద్ధంగా, కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు పట్టినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, పూర్తి ఏకపక్షంగా, కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. అలా తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులు ఎత్తిచూపుతూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్‌) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్‌ చేయడం లేదా సస్పెండ్‌ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సామాజిక మాధ్య‌మ‌ వేదిక (సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌)లకు నోటీసులు పంపిస్తోంది. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్‌ మీడియాపై సెన్సార్‌షిప్‌ విధిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం, ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్‌ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అని చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావం వల్ల పెల్లుబికుతున్న అసహనం. దాని వల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలు. ఆ దిశలో ప్రభుత్వ చర్యలు తేటతెల్లం అవుతున్నాయి. అదే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్య‌మ వేదికల ద్వారా ప్రతిరోజూ వైయస్సార్‌సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది. ఆ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై విపక్ష వైయస్సార్‌సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్‌ఐఆర్‌ల ఊసే లేదు. ఆ విధంగా రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది. స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు, పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం, ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. అందుకే హేయమైన చర్యలు, అణిచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీస్‌లను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం, సోషల్‌ మీడియాపై నియంత్రణ.. మొత్తంగా అసమ్మతిని అణచి వేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తున్నాం. #UpholdDemocracyInAP
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
English
450
1.6K
4.8K
294K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయ‌న. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు. #RabindranathTagore
తెలుగు
40
594
3.5K
186.8K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి, బ్రిటీష్ పాలకులను ఎదురించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
37
580
2.7K
48.8K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi. Congratulations to BJP and others. @TVKVijayHQ @MamataOfficial @BJP4India
English
667
15.1K
72.2K
1.2M
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Heartiest birthday greetings to the Hon’ble Vice President of India, Shri C.P. Radhakrishnan Garu. May God bless you with a long and healthy life in the continued service of our nation. @CPR_VP @VPIndia
English
65
960
7.9K
262.7K