
Cyberabad Municipal Corporation
1.3K posts

Cyberabad Municipal Corporation
@CMC_Offcl
Cyberabad Municipal Corporation includes Serilingampally – Kukatpally – Quthbullapur Zones





🚨 * అడ్డగుట్ట సొసైటీ లో అక్రమ నిర్మాణాలకు ఆకాశమే హద్దు!* 🚨 కూకట్పల్లి జోన్ ,కూకట్పల్లి సర్కిల్ పరిధి అడ్డగుట్ట సొసైటీ ప్లాట్ నెంబర్ 101సి,102సి, హౌస్ నెంబర్ 2-22-311/ఏ /1 ,సర్వ్ నెంబర్ 177 లో జి+2 అనుమతులతో 5 అంతస్థుల భారీ అక్రమ రెండు భవనాలు. కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఎటు చూసినా అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు ఎగసిపడుతుండగా, సంబంధిత అధికారులు మాత్రం మౌనం వీడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతుల్లేకుండా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తూ, బిల్డింగ్ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్కిల్ స్థాయిలో పర్యవేక్షణ ఉందా? లేక కేవలం ఫైళ్లకే పరిమితమైందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. “సెటిల్మెంట్ ఉంటే చాలు… అక్రమాలకు అడ్డుకట్ట ఉండదా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించకపోవడం వల్ల ప్రజల భద్రతే ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత CMC అధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. #IllegalConstructions #Kukatpally @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Kukatpally @WO_Kukatpally @PRavind44086528 @ZC_Kukatpally1































































