Jai Sri Ram🚩
5.8K posts



Tit for Tat. What bjp used to do with other parties in different states, has happened with them. Tamilnadu CM has broken NDA ally AIADMK and reached to a majority of 144 MLAs. Good job done @TVKVijayHQ





పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సూచన మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 50 శాతం కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు చర్యలు పాటించాలని సూచించిన శ్రీ మోదీ గారు, స్వయంగా తాను పాటిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada









శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు… •పెదపాడు పాఠశాలకు కొత్త భవనం •అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు •రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన శ్రీ @PawanKalyan గారు, ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది.














