Saleem Paasuupula
651 posts

Saleem Paasuupula
@exponential1990
There is a second-best cryptocurrency $KAS (KASPA)











చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి! రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న కళ్ళముందే కూలగొడుతుంటే తట్టుకోలేక భోరున ఏడుస్తున్న ఖమ్మం వెలుగుమాట్ల బాధితులు











బ్రేకింగ్ న్యూస్ రూ.5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టనున్న రేవంత్ ప్రభుత్వం ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకే ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకున్నా, ఏషియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రుణం మంజూరు చేయకున్నా హడావిడిగా మూసీ నది ఒడ్డున రూ. 5000 కోట్లు వెచ్చించి దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించే పనికి ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన చేయనున్న కాంగ్రెస్ సర్కారు దీని కోసం ఈసి, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు నిన్న తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరించనున్నారు అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో నివసించే సుమారు 500 కుటుంబాలు ఈ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. అసలు ప్రజలకు ఏమాత్రం పనికిరాని ఒక విగ్రహం కోసం 5000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్పు. దాని కొరకు తమ రెక్కల కష్టంతో అపార్ట్మెంట్ కొనుక్కున్న 500 కుటుంబాలను రోడ్డున పడేయడం దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, అభివృద్ధి పనులకు డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత్రిమ బీచ్, మిస్ వరల్డ్ అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్ వంటి పనికిరాని పనులకు వందల వేల కోట్లు తగలేస్తుండటం మీద ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రైతుబంధు కోసం డబ్బు లేదంటున్న ఈ తుగ్లక్ ముఖ్యమంత్రికి ఒక విగ్రహం కోసం రూ 5000 కోట్లు తగలెయ్యడం అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


















