Sabitlenmiş Tweet

ఇంత వరకు *తెలుగు కూటమి* పనుల కోసం ఎక్కువ మంది చేరటానికి వీలైన సంస్థ లేదు. కొత్త వారు చేరితేనే "సంస్థ సజీవంగ ఉంటుంది. వారు కూడ ఈ సంస్థ మాది అనుకోని చొరవతో పనులు చేయటం మొదలుపెడతారు.
దీనిని సరిగా గమనించి వర్మ, వెంకటేశ్వరరావు కింతలి, చిన్నసూరి, ఎర్ర నాయుడు, శివాజీ పట్నాయక్, వెంకట రావు, సురేష్, జిడుగు రవీంద్రనాథ్, పారుపల్లి కోదండరామయ్య గార్లు విశాఖలో
*తెలుగు కూటమి సొసైటీ*
ను స్థాపించారు.
తెలుగు భాష, సంస్కృతులకు పూర్వ వైభవం తేవాలనే ఆత్మాభిమానం ఉన్న తెలుగు వారు ఇందులో చేరాలని విన్నవిస్తున్నాం.
ఈ కూటమి ప్రధాన ఆశయం తెలుగు భాష వాడుకను పెంచుట. అవసరం ఉన్నవారికి, పిల్లలకు #తెలుగు మాట్లాడుట, వ్రాయుట, చదువుట నేర్పటం.
ఏడాది సభ్యత్వానికి 300 రూ., శాశ్వత సభ్యత్వానికి 5,000 రూ, దాతలుగా ఇష్టం వచ్చినంత చెల్లించవచ్చు.
సభ్యత్వం కొరకు లంకె
telugukootami.org/%e0%b0%aa%e0%b…
#మనమాతృభాషతెలుగు
#teluguvelugu


తెలుగు






























