
Muta Gopal
3.1K posts

Muta Gopal
@MutaGopal
MLA, Musheerabad, Current BC Cell State President & Constituency In-Charge for BRS party, founded by Shri K. Chandrashekar Rao.































ఢిల్లీకి బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించిన భారత ఎన్నికల కమిషన్ ఈనెల 5వ తేదీన ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సారథ్యంలో ఈ సమావేశానికి హాజరుకానున్న బీఆర్ఎస్ పార్టీ బృందం భారత ఎన్నికల కమిషన్ (@ECISVEEP) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 5, మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో తాను నిర్వహించనున్న సమావేశానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధి బృందాన్ని అధికారికంగా ఆహ్వానించింది. ఈ ప్రతినిధి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్యే శ్రీ కె. తారక రామారావు నేతృత్వం వహించనున్నారు. శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డి – రాజ్యసభ సభ్యుడు మరియు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శ్రీ వడ్డిరాజు రవిచంద్ర – రాజ్యసభ సభ్యుడు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ – మాజీ ఎంపీ శ్రీ బల్క సుమన్ – మాజీ ఎంపీ మరియు పార్టీ సీనియర్ నేత శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ – బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఈ బృందంలో ఉండనున్నారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీకి, ఈసీఐ కార్యదర్శి శ్రీ అశ్వినీ కుమార్ మొహాల్ ఒక అధికారిక లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షులకు కూడా పంపించారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరగనుంది. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. Election Commission of India invites BRS delegation to Delhi Meeting to be held under the supervision of the Central Election Commission at 3:00 PM on August 5 in Delhi BRS delegation, led by Party Working President KTR, to attend the meeting. The Election Commission of India (ECI) has officially invited a delegation from the Bharat Rashtra Samithi to attend a meeting with political parties at its headquarters, Nirvachan Sadan, in Delhi at 3:00 PM on Tuesday, August 5. The delegation will be led by BRS Working President and MLA @KTRBRS. Shri K.R. Suresh Reddy – Rajya Sabha MP and BRS Floor Leader Shri @vaddirajumprs - Rajya Sabha MP Shri @vinodboianpalli – Former MP Shri @balkasumantrs – Former MP and senior party leader and Shri @RSPraveenSwaero – BRS General Secretary will accompany him as part of the delegation. This invitation was extended through an official letter by ECI Secretary Shri Ashwini Kumar Mohal. The invitation was also forwarded to the BRS leadership via the Chief Electoral Officer of Telangana. According to media sources, the meeting is expected to focus on electoral reforms, various representations already submitted to the ECI, and issues related to the Model Code of Conduct. Given the ongoing political developments in various states, this meeting has gained added significance.

















