
Venkatesh Sirangu
400 posts













Nayara Energy has cut the prices of Diesel and petrol. Petrol prices have been reduced by Rs 5 per litre and Diesel prices have been reduced by Rs 3 per litre. Nayara Energy has over 7,000 retail outlets across the country.








India's largest LED billboard at SAS iTower, Hyderabad, showcases an immersive 3D anamorphic visual #3Dbillboard #hyderabad #SASitower youtube.com/shorts/JBM_zV-…





ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కేంద్ర మంత్రులతో వరుసగా రెండు రోజులపాటు చర్చలు విజయవంతమయ్యాయి. ✅మొదట సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ @kishanreddybjp గారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ఉదయం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mlkhattar గారితో, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖట్టర్ గారి నివాసంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ✅ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్-II విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ✅కన్సల్టెంట్‌గా SBICAPS ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-I వాల్యూయేషన్, ఫేజ్-II విస్తరణతో పాటు ఇతర అంశాలపై #SBICAPS సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. ✅కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తారు. @MoHUA_India #HyderabadMetro #MetroExpansion #Telangana #UrbanMobility #Hyderabad #MetroPhase2














